Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. తనూజతో గుంజీలు తీయించిన నాగార్జున..!

ఇక భరణి తను ఎంత ఆడుతున్నా సరే తనూజ గుర్తించట్లేదని.. తనకు నమ్మకం కుదరట్లేదని చెప్పి ఆ విషయంలో హర్ట్ అయ్యానని తనూజకి మిర్చీ ఇచ్చాడు.

By:  Ramesh Boddu   |   17 Nov 2025 9:47 AM IST
బిగ్ బాస్ 9.. తనూజతో గుంజీలు తీయించిన నాగార్జున..!
X

బిగ్ బాస్ సీజన్ 9లో సండే ఎపిసోడ్ లో ప్రస్తుత కెప్టెన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ తనూజతో గుంజీలు తీయించాడు నాగార్జున. బిగ్ బాస్ ఆర్డర్స్ ప్రకారం ఇలా చేయించాల్సి వచ్చింది. ఇంతకీ అసలు ఎందుకు తనూజ గుంజీలు తీసింది అంటే. సండే ఎపిసోడ్ లో ఆటలో తమని హర్ట్ చేసిన వారు ఎవరన్నది చెప్పి వారికి ఒకటి లేదా రెండు పచ్చి మిర్చీ ఇచ్చి తినమనాలి. ఆదివారం ఆటలో స్పైసీ నెస్ యాడ్ చేసేందుకు ఈ ప్రక్రియ నిర్వహించారు నాగార్జున. ఈ క్రమంలో ఒక్కొక్కరు తమని హర్ట్ చేసిన వారి పేర్లు చెప్పి మిర్చి ఇచ్చారు. ఎక్కువగా కళ్యాణ్ కి మిర్చీలు వచ్చాయి. అతను కూడా తప్పక తిన్నాడు.

తనూజ తనకు మిర్చీ అసలు పడదని..

ఇక భరణి తను ఎంత ఆడుతున్నా సరే తనూజ గుర్తించట్లేదని.. తనకు నమ్మకం కుదరట్లేదని చెప్పి ఆ విషయంలో హర్ట్ అయ్యానని తనూజకి మిర్చీ ఇచ్చాడు. ఐతే తనూజ తనకు మిర్చీ అసలు పడదని కొద్దిగా కారం ఎక్కువైతేనే డాక్టర్ ని కలుస్తానని. మొన్న అలానే వాంటింగ్స్ కూడా అయ్యాయని చెప్పింది. దీని బదులుగా ఎలాంటి పనిష్మెంట్ అయినా తీసుకుంటానని అన్నది దాంతో నాగార్జున బిగ్ బాస్ టీం తో చర్చించి ఆమెను 20 గుంజీలు తీయాలని చెప్పాడు.

ఐతే తనూజ మొదటి 10 గుంజీలు తీసే టైం లో భరణి తనకి చెప్పుఇన రీజన్ కి ఆన్సర్ ఇస్తూ చేసింది. నెక్స్ట్ 10 చేసి అయిపోయాయి 20 అంటే.. కాదు నువ్వు చేసేటప్పుడు మాట్లాడకూడదు అందుకే మరో 10 తీయాలని మొత్తం 30 సిట్ అప్స్ తీయించాడు. మొత్తానికి అలా తనూజ సండే ఎపిసోడ్స్ లో సిట్ అప్స్ 30 తీసింది. కెప్టెన్ అయిన తనూజతో ఇలాంటి పనిష్మెంట్ చేయించడం ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది.

తనూజ విన్నింగ్ రేసులో ఉన్నా..

ఇక తనూజ సాటర్డే ఎపిసోడ్ లో తనకు ఎవరు హౌస్ లో సపోర్ట్ లేరని చెప్పడం కూడా ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. హోస్ట్ నాగార్జున కూడా అదేంటి తనూజ నువ్వు కెప్టెన్ అవ్వాలని అందరు అనుకున్నారు కదా నువ్వు సపోర్ట్ ఎవరు లేరని అంటావేంటని అడిగాడు. తనూజ తాను విన్నింగ్ రేసులో ఉన్నాననే ధైర్యం వచ్చే సరికి ఇదంతా ఎవరి వల్లో కాదు తను ఆడిన ఆట వల్లే అన్నట్టుగా ఆట మార్చేస్తుంది.

ఐతే తనూజ ఆట తీరుని బయట ఆడియన్స్ గమనిస్తున్నారు. కొన్ని విషయాల్లో ఆమె మాట్లాడే విధానం చూసి విన్నర్ గా ఆమె టైటిల్ దూరం అయ్యే పరిస్థితి కనబడుతుంది. బిగ్ బాస్ సీజన్ 9లో తనూజతో పోటీగా ఇమ్మాన్యుయెల్ రేసులో ఉన్నాడు. ఐతే వీరిద్దరితో పాటు కామనర్ కళ్యాణ్ కూడా రేసులో ఉన్నాడు.