Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. డబల్ ఎలిమినేషన్ షాక్ ఇస్తారా..?

బిగ్ బాస్ సీజన్ 9లో కొత్త ట్విస్ట్ లు ఆడియన్స్ ని షో మీద మరింత ఆసక్తి కలిగేలా చేస్తుంది. సీజన్ 9లో ఈ వారం ఆల్రెడీ అగ్నిపరీక్ష మెంబర్స్ నుంచి ఒకరిని హౌస్ లోకి తీసుకొచ్చారు.

By:  Ramesh Boddu   |   26 Sept 2025 9:58 AM IST
బిగ్ బాస్ 9.. డబల్ ఎలిమినేషన్ షాక్ ఇస్తారా..?
X

బిగ్ బాస్ సీజన్ 9లో కొత్త ట్విస్ట్ లు ఆడియన్స్ ని షో మీద మరింత ఆసక్తి కలిగేలా చేస్తుంది. సీజన్ 9లో ఈ వారం ఆల్రెడీ అగ్నిపరీక్ష మెంబర్స్ నుంచి ఒకరిని హౌస్ లోకి తీసుకొచ్చారు. దివ్య నిఖిత హౌస్ లోకి ఎంటర్ అయ్యింది. మిడ్ వీక్ కంటెస్టెంట్ ఎంట్రీ ఆడియన్స్ కు మాత్రమే కాదు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని కూడా సర్ ప్రైజ్ చేసింది. ఇక బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఈ వీకెండ్ ఎపిసోడ్ ని దసరా ఫెస్టివల్ ఎపిసోడ్ గా చేయాలని చూస్తున్నారు. విజయ దశమి అక్టోబర్ 2న వచ్చింది.

నామినేషన్స్ లో ఏడుగురు హౌస్ మెట్స్..

మిడ్ వీక్ వచ్చింది కాబట్టి ఆరోజు షూటింగ్ ని కూడా ఈ వీకెండ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉందట. ఐతే ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు హౌస్ మెట్స్ ఉన్నారు. వారిలో వీక్ కంటెస్టెంట్స్ అంటే లిస్ట్ లో చివరిగా ఉన్న వారు ఎలిమినేట్ అవుతారు. ఈ వారం కామనర్స్ నుంచి కళ్యాణ్, ప్రియ, హరీష్ నామినేషన్స్ లో ఉన్నారు. సెలబ్రిటీస్ నుంచి రాము, సంజన నామినేషన్స్ లో ఉన్నారు.

ఐతే ఈ వారం డబల్ ఎలిమినేషన్ అయితే తప్పకుండా కామనర్స్ లోనే ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందట. హౌస్ లో కళ్యాణ్ ఆట తీరు ఏమాత్రం ఇంప్రెస్ చేయట్లేదు. వాళ్లను వీళ్లను బుజ్జగించడం తప్ప కళ్యాణ్ చేసింది ఏది లేదు. నెక్స్ట్ ప్రియ కూడా ప్రతి విషయాన్ని డ్రాగ్ చేస్తూ వస్తుంది. అందుకే ఆమె కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

దసరా ఎపిసోడ్ ని ముందే ప్లాన్..

ఒకవేళ ప్రియ కాకపోతే రాము రాథోడ్ కి ఎలిమినేషన్ రిస్క్ ఉన్నట్టు తెలుస్తుంది. ఒకరే ఎలిమినేట్ అయితే కళ్యాణ్ దాదాపు కన్ఫర్మ్ అంటున్నారు. కానీ ఇద్దరైతే మాత్రం ఈ ముగ్గురికి రిస్క్ తప్పదన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి దసరా ఎపిసోడ్ ని ముందే ప్లాన్ చేస్తున్న బిగ్ బాస్ టీం.. ఎలిమినేషన్ తో పాటు మరో ఆరేడుగురు హౌస్ మెట్స్ ని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి పంపిస్తారని తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 9లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే కాన్సెప్ట్ కొనసాగుతుంది. ఐతే మొన్నటిదాకా సెలబ్రిటీస్ టెనంట్స్ గా ఉండి లాస్ట్ వీక్ ఓనర్స్ అయ్యారు. ఐతే వాళ్లు టెనంట్స్ కి ఫ్రీ యాక్సెస్ ఇచ్చేసి హౌస్ అంతా కలగాపులగం చేస్తున్నారు. ఈ విషయంపై నాగార్జున ఏదైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటారా అన్నది చూడాలి.