కళ్యాణ్ మెడ పట్టుకున్న డీమాన్ పవన్.. చెయిర్ కాలుతో తన్ని...?
బిగ్ బాస్ సీజన్ 9లో 12వ వారం నామినేషన్స్ లో హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
By: Ramesh Boddu | 25 Nov 2025 12:02 PM ISTబిగ్ బాస్ సీజన్ 9లో 12వ వారం నామినేషన్స్ లో హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ సీజన్ లో బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా వచ్చి 12వ వారం దాకా కొనసాగుతున్నారు కళ్యాణ్, డీమాన్ పవన్. ఇద్దరు కూడా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన వారే అవడంతో ఇద్దరి మధ్య మంచి క్లోజ్ నెస్ ఉంది. ఐతే రీతుకి డీమాన్ పవన్ క్లోజ్ అవ్వడం వల్ల కళ్యాణ్ కాస్త దూరమయ్యాడు. ఐతే డీమాన్ పవన్ రీతు వల్ల తన గేమ్ చెడగొట్టుకుంటున్నాడని కళ్యాణ్ హెచ్చరిస్తూ వచ్చాడు.
రీతుతో కళ్యాణ్ గొడవ.. డీమాన్ పవన్ కూడా..
లాస్ట్ వీక్ కెప్టెన్సీ కంటెండర్ గా రీతుని గెలిపించేందుకు డీమాన్ పవన్ ముందు మాన్ స్టర్ డెన్ లోకి వెళ్లాడు. ఐతే కళ్యాణ్ ఈ ఇష్యూపై నువ్వు నీ కోసం గేమ్ ఆడు ఎవరి కోసమో కాదు అనేలా చెప్పుకొచ్చాడు. మధ్యలో రీతు కలగచేసుకుని ఎందుకు డీమాన్ ని పదే పదే అలా అంటావ్ అనగా రీతుతో కళ్యాణ్ గొడవ పెద్దదైంది. కళ్యాణ్ తన పాయింట్స్ చెబుతూనే రీతు మీద మీదకు వెళ్తున్నాడు.. రీతు కూడా ఎక్కడ తగ్గకుండా కళ్యాణ్ కి ఆన్సర్ ఇస్తుంది.ఐతే మధ్యలో డీమాన్ పవన్ కూడా రెచ్చిపోయాడు. కళ్యాణ్, డీమాన్ పవన్ ఇద్దరు వాదన జరుపుకున్నారు.
ఐతే కళ్యాణ్ ని ఆపమని చెప్పే క్రమంలో కళ్యాణ్ మెడ పట్టుకున్నాడు డీమాన్ పవన్ అయితే డీమాన్ అలా చేసే సరికి కళ్యాణ్ ఎక్కడ డీమాన్ మీదకు వెళ్తాడని ఇమ్మాన్యుయెల్, దివ్య మధ్యలో వెళ్లారు. వెంటనే కళ్యాణ్ అటు వైపు ఉన్న చెయిర్ ని తన్నాడు. హౌస్ లో ఎవరి ఆట వారు ఆడుతున్నారు. ఐతే రీతు వళ్ల డీమాన్ పవన్ వెనకపడుతున్నాడని కళ్యాణ్ ఫీల్ అవుతున్నాడు. అదే విషయం డీమాన్ కి చెబుతున్నా కూడా తను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు.
డీమాన్ పవన్, కళ్యాణ్ మధ్య కొట్టుకునే రేంజ్ ఫైట్..
నామినేషన్ ఫైట్ లో ఎవరి పాయింట్స్ వారికి ఉన్నా కూడా కళ్యాణ్ డీమాన్ మధ్య గొడవకు సంబందించిన వీడియోస్ వైరల్ అయ్యాయి. అంతేకాదు డీమాన్ పవన్, కళ్యాణ్ మధ్య కొట్టుకునే రేంజ్ ఫైట్ జరిగినా టెలికాస్ట్ చేయలేదని లైవ్ లో చూసిన వారు ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందని అంటున్నారు. ఐతే ఎపిసోడ్ లో డీమాన్ కళ్యాణ్ మెడ పట్టుకున్న క్లిప్ అయితే ఉంది కానీ మిగతా విషయాలన్నీ ట్రిమ్ చేశాడని అంటున్నారు.
కచ్చితంగా ఈ ఇష్యూపై హోస్ట్ నాగార్జున కళ్యాణ్, డీమాన్ పవన్ మీద సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాదు మరోపక్క సంజన కూడా రీతు, డీమాన్ పవన్ ను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ పై కూడా నాగార్జున ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది.
మొత్తానికి సీజన్ 9లో చివరి వారాలకు వచ్చే సరికి కావాల్సినంత గొడవలు జరుగుతున్నాయి. ఐతే ఆడియన్స్ వీటి ద్వారానే ఎవరు విన్నర్ మెటీరియల్ ఎవరు సేఫ్ గేమర్ అన్న విషయాన్ని చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 ఈ వారం నామినేషన్స్ లో కెప్టెన్ రీతు తప్ప అందరు నామినేట్ అయ్యారు.
