Begin typing your search above and press return to search.

అగ్నిపరీక్షలో మహా పరీక్ష.. ఆ ఇద్దరి మధ్య సూపర్ ఫైట్..!

ఐతే బిగ్ బాస్ సీజన్ 9 లో ప్రస్తుతం అగ్నిపరీక్ష లో ఉన్న 13మందిలో ఐదుగురు మాత్రం కన్ఫర్మ్ గా హౌస్ లోకి వెళ్తారని తెలుస్తుంది.

By:  Ramesh Boddu   |   4 Sept 2025 3:48 PM IST
అగ్నిపరీక్షలో మహా పరీక్ష.. ఆ ఇద్దరి మధ్య సూపర్ ఫైట్..!
X

బిగ్ బాస్ అగ్నిపరీక్ష చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ 7 నుంచి షో స్టార్ట్ అవుతున్న సందర్భంగా బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ఫైనల్ గా హౌస్ కి వెళ్లే వాళ్లెవరన్నది డిసైడ్ చేసే టైం దగ్గరకు వచ్చింది. ఐతే బిగ్ బాస్ సీజన్ 9 లో ప్రస్తుతం అగ్నిపరీక్ష లో ఉన్న 13మందిలో ఐదుగురు మాత్రం కన్ఫర్మ్ గా హౌస్ లోకి వెళ్తారని తెలుస్తుంది.

అగ్నిపరీక్షలో 13 మందికి ఫజిల్స్..

బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఈరోజు ఎపిసోడ్ లో మహా పరీక్ష అంటూ ఒక టాస్క్ పెట్టారు. అందులో ఉన్న 13 మందికి ఫజిల్స్ ఇచ్చి ఎవరితో అయితే టాస్క్ తెలుస్తారో వాళ్ల ప్లేస్ ని ఆక్యుపై చేస్తారు. ఓడిన వారు మహా పరీక్ష నుంచి బయటకు వెళ్తారు. అలా దివ్య నిన్న ఎపిసోడ్ లో స్టార్ ప్లేయర్ అవ్వడం వల్ల ఆమెతో టాస్క్ ప్రారంభించారు. ఆమె తన అపోనెంట్ గా ప్రియని ఎంచుకుంది. ప్రియతో గ్లాస్ లతో పిరమిడ్ ఎరేంజ్ చేసే టాస్క్ లో గెలిచింది విద్య. ఆ నెక్స్ట్ శ్రీయ తో కూడా బిగ్ బాస్ 9 పజిల్ ఆత ఆడి గెలిచింది దివ్య.

ఇక ఆటలో ఆమె కొంత విరామం తీసుకోగా షాకీబ్, హరీష్ ల మధ్య మహా పరీక్షలో భాగంగా తలపై బాస్కెట్ పెట్టి బాల్స్ వేసుకోవాలని అన్నారు. ఈ టాస్క్ లో హరీష్ గెలిచాడు. ఇక నెక్స్ట్ హరీష్ నాగ ప్రశాంత్ తో బౌల్ లో కలర్ వాటర్ ఆట ఆడి గెలిచాడు. అలా దివ్య, హరీష్ మహా పరీక్ష లో రెండు ఆటలు ఆడి గెలిచారు. ఇక నెక్స్ట్ ఆట వారిద్దరే పోటీ పడ్డారు. ఐతే దాని రిజల్ట్ రేపు తెలుస్తుంది.

మహాపరీక్ష లో నువ్వా నేనా అనేట్టుగా..

బిగ్ బాస్ అగ్నిపరీక్షలో దివ్య, హరీష్ ఇద్దరు టాస్క్ ల విషయంలో అదరగొట్టేస్తున్నారు. మహా పరీక్ష లో నువ్వా నేనా అనేట్టుగా ఇద్దరు ఆడుతున్నారు. హరీష్ కి ఈ ఎపిసోడ్ బాగా కలిసి వచ్చేలా ఉంది. దివ్య కూడా టాస్కుల్లో తన పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. మొత్తానికి అగ్నిపరీక్షలో మహా పరీక్ష అంటూ చేస్తున్న ఈ టాస్క్ లో హరీష్, దివ్య ముందున్నారు. మిగతా కంటెస్టెంట్స్ ఇంకా టాస్క్ లు ఆడాల్సి ఉంది. ఆల్రెడీ ప్రియ, శ్రీయ, నాగ ఈ టాస్క్ నుంచి తప్పుకున్నారు.

బిగ్ బాస్ అగ్నిపరీక్ష లో భాగంగా శుక్రవారం చివరి ఎపిసోడ్ అని తెలుస్తుంది. సండే రోజు బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవుతుంది. ఇక ఇప్పటికే బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ఉన్న 13 మెంబర్స్ ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఐతే ఓటింగ్ తో పాటు అగ్నిపరీక్ష జ్యూరీ మెంబర్స్ ఇచ్చిన రిపోర్ట్ తో టాప్ 5 ఎవరన్నది తెలుస్తుంది.