Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. ఊహించని డబల్ ఎలిమినేషన్.. అతను ఔట్..!

బిగ్ బాస్ సీజన్ 9లో ఊహించని విధంగా ఈ వారం డబల్ ఎలిమినేషన్ బాంబ్ వేశారు. వీకెండ్ లో భాగంగా శనివారం ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున ఎప్పటిలానే ఎనర్జిటిక్ గా కనిపించాడు.

By:  Ramesh Boddu   |   16 Nov 2025 9:23 AM IST
బిగ్ బాస్ 9.. ఊహించని డబల్ ఎలిమినేషన్.. అతను ఔట్..!
X

బిగ్ బాస్ సీజన్ 9లో ఊహించని విధంగా ఈ వారం డబల్ ఎలిమినేషన్ బాంబ్ వేశారు. వీకెండ్ లో భాగంగా శనివారం ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున ఎప్పటిలానే ఎనర్జిటిక్ గా కనిపించాడు. గత వారం బీబీ రాజ్యం టాస్క్ లో డీమాన్ పవన్, తనూజ మధ్య జరిగిన ఇష్యూపై ప్రస్తావించారు నాగార్జున. తనూజ డీమాన్ పవన్ మీద చేసిన కామెంట్స్ పై నాగ్ క్లాస్ పీకారు. హౌస్ లో ఆడ మగ అన్న తేడా లేదు అందరు సమానమే అని అన్నారు. ఇక రెండు బాంబ్ లను రివీల్ చేసిన నాగార్జున ఒకదానిలో డబల్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఇచ్చాడు.

సంజన, నిఖిల్ మాత్రమే..

ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పిన నాగార్జున ముందు తనూజని సేఫ్ చేశాడు. ఇక మిగిలిన హౌస్ మేట్స్ ని గార్డెన్ ఏరియాకు రమ్మని చెప్పి అక్కడ బౌల్స్ లో వాళ్లకు ఇచ్చిన బాటిల్స్ లోని వాటర్ పోస్తే కలర్ మారకుండా ఉంటే ఎలిమినేట్ అవుతారని.. కలర్ మారితే సేఫ్ అని అన్నారు నాగార్జున. అలా ఒక్కొక్కరిని బౌల్ లో వాటర్ పోయమని చెప్పగా.. ఫైనల్ గా సంజన, నిఖిల్ మాత్రమే మిగిలారు. అలా ఇద్దరిని ఒకేసారి బౌల్ లో వాటర్ పోయమని చెప్పగా అలా చేయగా నిఖిల్ బౌల్ లోని వాటర్ కలర్ అలానే ఉండటంతో నిఖిల్ ఎలిమినేట్ అని నాగార్జున చెప్పారు.

నిఖిల్ ఎలిమినేషన్ తర్వాత స్టేజ్ మీదకు వెళ్లాడు. నాగార్జున అతని జర్నీని చూపించారు. హౌస్ మేట్స్ అందరికీ నిఖిల్ తన సజెషన్స్ ఇచ్చాడు. తనూజ ప్రతి విషయంలో హైప్ అవుతుందని.. ఏడవడం కూడా తగ్గించుకోవాలని చెప్పాడు. అలా ఫైనల్ గా నిఖిల్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. శనివారం ఎపిసోడ్ లోనే హౌస్ లో పడవ ఆట ఆడించారు నాగార్జున.

ఫ్యామిలీ వీక్ ఉండదని బాంబ్..

హౌస్ లో ఎవరి వల్ల తమ పడవ మునగదు.. ఎవరి వల్ల మునుగుతుంది అని టాస్క్ పెట్టాడు. దానిలో ఎక్కువగా సంజనకే ఎక్కువ సింక్ రావడంతో ఆమెకు ఫ్యామిలీ వీక్ ఉండదు అని బాంబ్ పేల్చాడు. దాంతో సంజన చాలా ఎమోషనల్ అయ్యింది. ఆమె ఇక నేను ఉండలేని వెళ్లిపోతానని అన్నది. హౌస్ మేట్స్ ఆమెను కన్ సోల్ చేసే ప్రయత్నం చేశారు. ఐతే కళ్యాణి, భరణి తమ ఫ్యామిలీ వీక్ సాక్రిఫైజ్ చేసి సంజన గారి ఫ్యామిలీని రప్పించడని నాగార్జునకి చెప్పారు. మొత్తానికి శనివారం ఎపిసోడ్ లో నిఖిల్ ఎలిమినేషన్ ఏమాత్రం డ్రామా లేకుండా సైలెంట్ గానే జరిగిపోయింది.

బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చాడు నిఖిల్ నాయర్. హౌస్ లో ఐదు వారాల జర్నీలో ఎక్కడ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. తన ఆట తను ఆడుకుంటూ వెళ్లాడు. ఐతే లాస్ట్ వీక్ మాత్రం అతను టాస్క్ లో బాగానే ఇన్వాల్వ్ అయ్యి బీబీ రాజ్యంలో రాజుగా కూడా గెలిచాడు. ఫైనల్ గా ఈ వీక్ ఆడియన్స్ తక్కువ ఓట్స్ వేయడం వల్ల ఎలిమినేట్ అయ్యాడు.