Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. వాళ్లిద్దరి మధ్య టైటిల్ ఫైట్ ఫిక్స్ అవ్వొచ్చా..?

బిగ్ బాస్ సీజన్ 9 9 వారాలు ముగిసింది. మరో ఐదారు వారల్లో సీజన్ ముగుస్తుంది. ఈ సీజన్ 70 శాతం ఆట ముగిసినట్టే.

By:  Ramesh Boddu   |   4 Nov 2025 11:30 AM IST
బిగ్ బాస్ 9.. వాళ్లిద్దరి మధ్య టైటిల్ ఫైట్ ఫిక్స్ అవ్వొచ్చా..?
X

బిగ్ బాస్ సీజన్ 9 9 వారాలు ముగిసింది. మరో ఐదారు వారల్లో సీజన్ ముగుస్తుంది. ఈ సీజన్ 70 శాతం ఆట ముగిసినట్టే. హౌస్ లో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఆడియన్స్ కూడా హౌస్ లో ఎవరు స్ట్రాంగ్.. ఎవరు వీక్ అన్నది డిసైడ్ అవుతున్నారు. ఐతే ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారిలో టాప్ 5 కన్ ఫర్మ్ అనిపించిన పేర్లు మాత్రం కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఆ ముగ్గురు ఎవరన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఐతే టాప్ 2ల్లో ఆల్రెడీ తనూజ, ఇమ్మాన్యుయెల్ ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇద్దరు బయట కూడా తెలిసినా కూడా హౌస్ లో మాత్రం ఇద్దరు కామెడీ చేసే టైం లో కామెడీ చేస్తూ.. టాస్క్ లు, నామినేషన్స్ టైం లో గొడవలు పడుతున్నారు.

తనూజ మైలేజ్ పెరగడానికి రీజన్ ఇమ్మాన్యుయెల్..

ఓ విధంగా హౌస్ లో తనూజ మైలేజ్ పెరగడానికి రీజన్ ఇమ్మాన్యుయెల్ ఆమెను తరచు టార్గెట్ చేయడమే అని చెప్పొచ్చు. ఐతే తనూజ కూడా తన మైనస్ లను గుర్తించి ముందుకెళ్తే మాత్రం మంచి ఫైట్ ఇస్తుంది. ఈ సీజన్ లో ఇమ్మాన్యుయెల్, తనూజ మధ్య టైటిల్ ఫైట్ జరిగే ఛాన్స్ కనిపిస్తుంది. ఇమ్మాన్యుయెల్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. టాస్క్ లు ఆడుతూ అవసరమైన టైం లో ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు.

ఐతే వీరిద్దరితో పాటు డీమాన్ పవన్ కూడా ఫిజికల్ గా మంచి స్ట్రెంగ్ తో ఉన్నాడు. అతనికి కూడా ఈ సీజన్ టాప్ 5కి ఛాన్స్ ఉంది. రీతూని దూరం పెట్టి ఈ చివరి నాలుగైదు వారాలు డీమాన్ పవన్ టాస్క్ ల మీద ఫోకస్ చేస్తే మాత్రం కచ్చితంగా అతను టాప్ 5కి వెళ్తాడని చెప్పొచ్చు.

ఇద్దరికీ హౌస్ లోకి వెళ్లకముందు నుంచే మంచి ఫాలోయింగ్..

ఐతే టైటిల్ పోరు మాత్రం ఇమ్మాన్యుయెల్, తనూజ మధ్యలోనే అని గట్టిగా చెబుతున్నారు. ఐతే ఈ ఇద్దరికీ హౌస్ లోకి వెళ్లకముందు నుంచే మంచి ఫాలోయింగ్ ఉంది. సో అది కూడా బిగ్ బాస్ హౌస్ లో వీళ్లను టాప్ 5కి తీసుకెళ్లేలా చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9లో హౌస్ మెట్స్ అంతా కూడా గెలవడానికే ట్రై చేస్తారు కనీసం టాప్ 5లో అంటే ఫైనల్ వీక్ దాకా వెళ్లాలని చూస్తారు. ఐతే టాస్కులు మాత్రమే కాదు మాట తీరు.. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వాళ్లు ప్రవర్తించే తీరుని బట్టి కూడా ఆడియన్స్ ఓటింగ్ ఉంటుంది. మరి బిగ్ బాస్ సీజన్ 9లో రాబోయే వారాల్లో టాప్ 2 గా ఇప్పుడు చెబుతున్న వారిని దాటి మరెవరైనా వస్తారా.. వీరిద్దరే ఇంకా గట్టి ఫైట్ ఇస్తారా అన్నది చూడాలి.