బిగ్ బాస్ హౌస్ లో స్పృహ కోల్పోయిన కంటెస్టెంట్..!
ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 9లో ఏడవ వారం కెప్టెన్సీ టాస్క్ లో మాస్ మాధురి టీం కు చెందిన కంటెస్టెంట్స్ అందరు పాల్గొన్నారు.
By: Ramesh Boddu | 25 Oct 2025 11:03 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో ఆల్రెడీ ఒక కంటెస్టెంట్ టైఫాయిడ్, డెంగ్యూ వల్ల హౌస్ నుంచి సడెన్ గా బయటకు వెళ్లిపోయింది. సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అయేషా వచ్చినప్పుడు ఎంత యాక్టివ్ గా ఉందో తెలిసిందే. రావడం రావడమే తనూజ, రీతులను ఎటాక్ చేస్తూ ఆమె నామినేషన్స్ వేసింది. జరిగిన రెండు వారాల్లో అయేషా తన మార్క్ చూపించింది. ఐతే హెల్త్ ఇష్యూస్ వల్ల ఆమె హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్లీ హెల్త్ సెట్ అయ్యాక వస్తుందా అంటే చెప్పడం కష్టమే అని తెలుస్తుంది.
సర్కిల్ లో టోపీ.. కెప్టెన్సీ టాస్క్..
ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 9లో ఏడవ వారం కెప్టెన్సీ టాస్క్ లో మాస్ మాధురి టీం కు చెందిన కంటెస్టెంట్స్ అందరు పాల్గొన్నారు. మాధురి తప్ప దాదాపు అందరు కెప్టెన్సీ టాస్క్ లో ఉన్నారు. ఐతే సర్కిల్ లో టోపీ పెట్టి కెప్టెన్సీ కంటెండర్స్ మధ్య పోటీ పెట్టిన బిగ్ బాస్ దాన్ని ఎవరికైతే ఇస్తారో వాళ్లు ఒక కంటెస్టెంట్ ని కెప్టెన్సీ రేసు నుంచి తొలగిస్తారు. అలా ఇమ్మాన్యుయెల్ గెలిచిన రెండు సార్లు మొదటిసారి నిఖిల్, ఆ తర్వాత రీతుని తీయగా నిఖిల్ గెలిచి గౌరవ్ కి క్యాప్ ఇవ్వగా అతను కళ్యాణ్ ని తీశాడు.
ఫైనల్ గా ఇమ్మాన్యుయెల్, తనూజ క్యాప్ కోసం పోటీ పడగా ఇమ్మాన్యుయెల్ క్యాప్ తీసుకుని మాధురికి ఇస్తాడు ఆమె తనూజని రేసు నుంచి తొలగిస్తుంది. ఫైనల్ గా ఇమ్మాన్యుయెల్ ఇంటి కెప్టెన్ అవుతాడు. ఐతే ఈ టాస్క్ లో తనూజ తన శక్తికి మించి కష్టపడటం వల్ల కాస్త అలసట చెందింది. అంతేకాదు కెప్టెన్సీ టాస్క్ ముగియగానే ఆమె స్ప్రుహ కోల్పోయింది. వెంటనే హౌస్ మెట్స్ ఆమెపై నీళ్లు చల్లి కాస్త హెల్ప్ చేశారు.
తనూజ గ్రాఫ్ పైపైకి..
ఇప్పటికే తనూజ గ్రాఫ్ పైపైకి వెళ్తుంది. తన ఎఫర్ట్ చూసి ఆమెను ఈ సీజన్ టాప్ 3 లో ఉంచాలని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. ఇప్పటి నుంచి కాస్త జాగ్రత్తగా ఆడితే మాత్రం ఈ సీజన్ విన్నర్ గా కూడా తనూజ సత్తా చాటే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 9లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా తనూజ ఇంప్రెస్ చేస్తుంది. ఐతే తనూజ స్ప్రుహ కోల్పోవడం చూసి బాత్ రూం లోకి వెళ్లి కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. హౌస్ లో వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉన్న విషయం తెలిసిందే.
