బిగ్ బాస్ 9.. నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారంటే..?
బిగ్ బాస్ సీజన్ 9లో 13వ వారం నామినేషన్స్ ప్రక్రియ ఈరోజు జరగబోతుంది. ఐతే చివరి మూడు వారాలే బిగ్ బాస్ సీజన్ 9 ఉంది కాబట్టి ఒక్కొక్కరు కూడా తమ ఆటని స్పీడ్ పెంచారు.
By: Ramesh Boddu | 1 Dec 2025 1:49 PM ISTబిగ్ బాస్ సీజన్ 9లో 13వ వారం నామినేషన్స్ ప్రక్రియ ఈరోజు జరగబోతుంది. ఐతే చివరి మూడు వారాలే బిగ్ బాస్ సీజన్ 9 ఉంది కాబట్టి ఒక్కొక్కరు కూడా తమ ఆటని స్పీడ్ పెంచారు. తమ తోటి హౌస్ మేట్స్ కి టఫ్ ఫైట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. 12వ వారం దివ్యా ఎలిమినేషన్ తో హౌస్ లో కేవలం ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. వీరిలో ఆరుగురు హౌస్ మేట్స్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది. వారిలో భరణి, సుమన్ శెట్టి, సంజన, తనూజ, రీతు, డీమాన్ పవన్ ఉన్నారు.
ఇద్దరు సేఫ్ అవ్వగా మిగిలిన ఆరుగురు నామినేషన్స్ లో..
సంజనని భరణి నామినేట్ చేయగా.. రీతూని ఇమ్మాన్యుయెల్ నామినేట్ చేశాడు. డీమాన్ పవన్ ని కూడా భరణి నామినేట్ చేశాడు. ఐతే ముందు భరణి నామినేషన్స్ లో లేకపోవడంతో కెప్టెన్ కళ్యాణ్ డైరెక్ట్ నామినేషన్ వల్ల అతను నామినేషన్స్ లోకి వచ్చాడని తెలుస్తుంది. సో అలా ఈ వారం హౌస్ లో ఉన్న వారిలో కళ్యాణ్ కెప్టెన్ అవ్వడం వల్ల అతను.. ఇమ్మాన్యుయెల్ ని ఎవరు నామినేట్ చేయకపోవడం వల్ల అతను ఇద్దరు సేఫ్ అవ్వగా మిగిలిన ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు.
సీజన్ 9లో 13వ వారం నామినేషన్స్ ఎవరైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వారి తలపై ఇచ్చిన బాటిల్స్ పగలకొట్టాలి. ఐతే ఈ నామినేషన్స్ లో రీతు వర్సెస్ ఇమ్మాన్యుయెల్ భారీ మాటల యుద్ధం జరిగినట్టు తెలుస్తుంది. సుమన్ శెట్టి కూడా రీతుతో వాదన దిగాడని టాక్. భరణి తన మెడిసిన్స్ దాచిన కారణంతో సంజన మీద ఫైర్ అయ్యాడని తెలుస్తుంది.
టాప్ 8 టాప్ 5 ఎవరు..
మొత్తానికి హౌస్ లో అంతా కూడా ఎవరి టార్గెట్ వారు ఫిక్స్ చేసుకుని ఆట ఆడుతున్నారు. ఇక టాప్ 8 నుంచి మరో ముగ్గురు ఎలిమినేట్ అయితే టాప్ 5 ఉంటారు. ఈ చివరి 3 ఎలిమినేషన్స్ లో తాము ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో హౌస్ మేట్స్ అంతా కూడా ఫైట్ చేస్తున్నారు. ఈ వారం ఎలాగు కెప్టెన్సీ ఫైట్ ఉండదు.. కేవలం టికెట్ టు ఫినాలే ఉంటుంది. అది ఎవరు గెలుస్తారన్నది చూడాలి.
బిగ్ బాస్ సీజన్ 9లో టాప్ 5 ఎవరన్నది ఇప్పటికే ఆడియన్స్ ఒకటి ఫిక్స్ అయ్యారు. దాని ప్రకారంగానే ఓటింగ్ జరుగుతుంది. ఐతే మిగిలిన ముగ్గురిలో కూడా కొంత శాతం పాజిబిలిటీ ఉంది. ఐతే ఈ 3 వారాలు వారు ఆడే ఆటని బట్టి ఆ పొజిషన్స్ మారే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇక ఈ వారం నామినేషన్స్ నుంచే ఆట నెక్స్ట్ లెవెల్ హీటెక్కించే ప్రయత్నం చేశారు.
