బిగ్ బాస్ 9.. వాళ్ల ఎంట్రీతో హౌస్ మెట్స్ షాక్..!
బిగ్ బాస్ సీజన్ 7కి చెందిన ఇద్దరు కంటెస్టెంట్స్ సీజన్ 9లో సర్ ప్రైజ్ చేశారు. సీజన్ 7 టాప్ 2 అమర్ తో పాటు టాప్ 6 అయిన అర్జున్ ఇద్దరు పోలీస్ గెటప్స్ లో హౌస్ లోకి వచ్చారు.
By: Ramesh Boddu | 24 Oct 2025 9:58 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో ప్రస్తుతం దొంగల టాస్క్ నడుస్తుంది. మాధురి, సంజన టీం లీడర్స్ గా కొనసాగుతున్న ఈ టాస్క్ లో ఎవరికి వారు సొంత ఆట తీరుతో ఆకట్టుకుంటున్నారు. ఐతే ఫైనల్ గా ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే ఆ టీం విన్ అవుతారని తెలుస్తుంది. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్ లు ఇచ్చి డబ్బు పొందే అవకాశం ఇస్తున్నాడు బిగ్ బాస్. గురువారం ఎపిసోడ్ లో వాటర్ టాస్క్ ఒకటి పెట్టాడు బిగ్ బాస్. ఇక హౌస్ లోకి మరో ఇద్దరు కొత్త పర్సన్ ఎంట్రీ కంటెస్టెంట్స్ ని షాక్ అయ్యేలా చేసింది.
సీజన్ 7కి చెందిన ఇద్దరు కంటెస్టెంట్స్ సీజన్ 9లో సర్ ప్రైజ్..
బిగ్ బాస్ సీజన్ 7కి చెందిన ఇద్దరు కంటెస్టెంట్స్ సీజన్ 9లో సర్ ప్రైజ్ చేశారు. సీజన్ 7 టాప్ 2 అమర్ తో పాటు టాప్ 6 అయిన అర్జున్ ఇద్దరు పోలీస్ గెటప్స్ లో హౌస్ లోకి వచ్చారు. వాళ్లు దొంగలను పట్టుకోవడం కోసమే హౌస్ లోకి వచ్చారు. వాళ్లు వచ్చినప్పుడు ఇద్దరు టీం లీడర్స్ దాక్కున్నారు. మాధురిని వెంటనే కనిపెట్టారు. సంజనాని కూడా ఫైనల్ గా కనిపెట్టేశారు. బిగ్ బాస్ సీజన్ 9లో సీజన్ 7కి సంబందించిన అమర్, అర్జున్ ఎంట్రీ కూడా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.
అమర్ దొంగలను వెతికే క్రమంలో కంటెస్టెంట్స్ బెడ్ రూమ్ లో వాళ్లు దాచుకున్న వస్తువులను చూపించి షాక్ ఇచ్చాడు. ఫ్రూట్స్, ఎగ్స్ ఒకటి రెండు కాదు కిచెన్ సామానంతా కూడా బెడ్ రూం లోనే ఉంచేశారు. అది ఈ టాస్క్ కోసమే అనుకున్నా కూడా పండ్లు, ఎగ్స్ అన్నీ కూడా బయట పెట్టాడు అమర్.
ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఒకరు ఎలిమినేట్..
ఇదిలాఉంటే ఈ వారం నామినేషన్స్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్లలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకోగా అయేషా హెల్త్ సహకరించకపోవడం వల్ల తాను డాక్టర్స్ రూం లోనే ఎక్కువ ఉంటుంది. ఆమె బయటకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఈ వారం అయేషాని బయటకు పంపించి నామినేషన్స్ లో ఉన్న వారందరిని సేఫ్ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అయేషా వెళ్లినా సరే నామినేషన్స్ లో ఉన్న ఒకరిని ఆడియన్స్ ఓటింగ్ ద్వారా లీస్ట్ వచ్చిన వారిని ఎలిమిఏట్ చేస్తారా లేదా అన్నది ఆదివారం తెలుస్తుంది.
బిగ్ బాస్ టీం అయితే దేనికైనా రెడీ అన్నట్టుగా కనిపిస్తున్నారు. ఐతే అయేషా తిరిగి హౌస్ లోకి వచ్చే ఛాన్స్ ఉంటే మాత్రం అయేషాతో పాటు ఈ వారం మరో కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎగ్జిట్ అవుతారని తెలుస్తుంది.
