బిగ్ బాస్ 9.. హౌస్ లోకి దమ్ము శ్రీజ రీ ఎంట్రీ..?
బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా ఎంపికై హౌస్ లో దాదాపు ఐదో వారం దాకా ఉంది శ్రీజ. అంతేకాదు ఆమె ఎలిమినేషన్ కూడా కేవలం వైల్డ్ కార్డ్స్ వచ్చి చేశారు.
By: Ramesh Boddu | 25 Oct 2025 10:47 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో ఎక్స్ పెక్ట్ అన్ ఎక్స్ పెక్టెడ్ అన్నట్టుగా ఎన్నో సర్ ప్రైజ్ లు జరుగుతున్నాయి. ముఖ్యంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎక్స్ పెక్ట్ చేసిన రేంజ్ లో ఆట సరిగా ఆడలేకపోతున్నారు. అందుకే మళ్లీ ఆటని సరైన ట్రాక్ లోకి పెట్టేందుకు కొంతమందిని హౌస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి తీసుకొస్తారని టాక్ నడుస్తుంది. ముఖ్యంగా దమ్ము శ్రీజని హౌస్ లోకి తీసుకు రాబోతున్నారట.
అన్ ఫెయిర్ ఎలిమినేషన్..
బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా ఎంపికై హౌస్ లో దాదాపు ఐదో వారం దాకా ఉంది శ్రీజ. అంతేకాదు ఆమె ఎలిమినేషన్ కూడా కేవలం వైల్డ్ కార్డ్స్ వచ్చి చేశారు. అందుకే ఆమె ఎలిమినేషన్ టైం లో అన్ ఫెయిర్ అని ఆడియన్స్ ఫీల్ అయ్యారు. ఐతే దమ్ము శ్రీజ రీ ఎంట్రీ అనగానే ఆడియన్స్ లో ఒక పాజిటివ్ ఫీల్ వచ్చింది. శ్రీజ మాత్రమే కాదు హౌస్ లోకి మరోసారి హరీష్, ప్రియ, శ్రీజ, మనీష్ లను పంపించి వారిలో ఒకరిని హౌస్ లో కొనసాగించేలా చేస్తారని తెలుస్తుంది.
మొత్తానికి ఈ సీజన్ లో హౌస్ మెంట్స్ ఎంట్రీ ఇది నాలుగోసారి అవుతుంది. మొదట సీజన్ స్టార్టింగ్ తో పాటు రెండు వారాల తర్వాత దివ్య హౌస్ లోకి వచ్చింది. ఇక ఆ తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చారు. ఇప్పుడు మళ్లీ శ్రీజ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. అదీగాక హౌస్ లో యాక్టివ్ గా ఉన్న అయేషా హెల్త్ ఇష్యూస్ వల్ల హౌస్ నుంచి బయటకు వచ్చింది.
శ్రీజ ఎంట్రీ గెలుపు ఓటములను కూడా డిసైడ్..
ఆమెకు టైఫాయిడ్, డెంగ్యూ రావడంతో కచ్చితంగా ట్రీట్ మెంట్ అవసరం అని డాక్టర్స్ చెప్పడంతో బిగ్ బాస్ ఆమెను మెయిన్ డోర్ నుంచి బయటకు పంపించేశాడు. బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ గా వచ్చిన అయేషా ఇలా రెండు వారాల్లోనే బయటకు వెళ్లడం షాకింగ్ గానే ఉంది. ఐతే ఆమె ఇక ఫైనల్ వీక్ లోనే కనిపించే ఛాన్స్ ఉంది. హౌస్ లో ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వడం.. టాస్క్ లను ఎవరు సరిగా ఆడకపోవడం వల్ల ఆల్రెడీ ఎలిమినేట్ అయిన దమ్ము శ్రీజని మళ్లీ హౌస్ లోకి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయట. మొత్తానికి ఈ సీజన్ లో బిగ్ బాస్ ప్లానింగ్ అంతా రివర్స్ అయ్యిందని చెప్పొచ్చు. అయినా కూడా ఎత్తుకు పైఎత్తు అనేలా రకరకాల ప్లానింగ్స్ తో వస్తున్నారు.
బిగ్ బాస్ హౌస్ లోకి శ్రీజ వస్తే కచ్చితంగా మళ్లీ ఆమె ఎనర్జీ షోకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐతే ఈసారి శ్రీజ ఎవరికి సపోర్ట్ చేస్తుంది. ఎలా ఎటాక్ చేస్తుంది అన్నది చూడాలి. కచ్చితంగా సీజన్ 9లో శ్రీజ ఎంట్రీ గెలుపు ఓటములను కూడా డిసైడ్ చేస్తుందని చెప్పొచ్చు.
