బిగ్ బాస్ 9.. నాగ్ సర్ ఈసారి గట్టిగానే..?
బిగ్ బాస్ సీజన్ 9 లో కింగ్ నాగార్జున హోస్ట్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ లో ఓకే ఓకే అనేలా ఉన్నా అసలు స్టోరీ వీకెండ్ ఎపిసోడ్ లో తెలుస్తుందని తెలిసిందే.
By: Ramesh Boddu | 14 Sept 2025 2:01 PM ISTబిగ్ బాస్ సీజన్ 9 లో కింగ్ నాగార్జున హోస్ట్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ లో ఓకే ఓకే అనేలా ఉన్నా అసలు స్టోరీ వీకెండ్ ఎపిసోడ్ లో తెలుస్తుందని తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 9 తొలి వారాంతరం శనివారం ఎపిసోడ్ లో నాగార్జున కూల్ కూల్ గా కనిపిస్తూనే అందరి మీద పంచ్ లు వేశాడు. శనివారం ఎపిసోడ్ లో హౌస్ మెట్స్ తో మాట్లాడే ముందు శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూపించాడు. ఆ తర్వాత హౌస్ లోకి వెళ్లి ఒక్కొక్కరి ఆట గురించి మాట్లాడుతూ వాళ్ల బాక్సులు బద్ధలు కొట్టేశాడు.
సంజన మీద హౌస్ లో రభస..
ముందు సంజన మీద హౌస్ లో వారం మొత్తం రభస జరగ్గా ఆమెతో ఇష్యూలో ఉన్న అందరిని అడిగి తెలుసుకున్నారు నాగార్జున. ఆ తర్వాత హరీష్, ఇమ్మాన్యుయెల్ మధ్య గుండు అంకుల్ ఇష్యూని కూడా తీసుకొచ్చిన నాగార్జున ఒక వీడియో క్లిప్ చూపించి అందులో ఇమ్మాన్యుయెల్ ని అతను రెడ్ ఫ్లవర్ అనడం గురించి ప్రస్తావించాడు. ఇక ఫైనల్ గా హరీష్ కామెంట్స్ రైటా రాంగా అన్నది హౌస్ మెట్స్ నే హ్యాండ్స్ రేజ్ చేయమంటే ఆ ఇష్యూలో అందరు హరీష్ దే తప్పన్నట్టు చెప్పారు.
ఇక ఫ్లోరా, సంజన ఇష్యూతో పాటు తనూజ ఇష్యూని కూడా ప్రస్తావించారు నాగార్జున. రీతు, తనూజ మధ్య జరిగిన చిన్న డిస్టబన్స్ ని క్లియర్ చేసి వాళ్లను హగ్ చేసుకునేలా చేశారు. ఐతే శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ఫోకస్ అంతా కూడా హరీష్ మీద ఉన్నట్టు అనిపించింది. అతను తన పాయింట్ చెబుతున్నా కూడా ఆడియన్స్ తో చెప్పించి మరీ అతను ఫ్లిప్ అవుతున్నాడని చెప్పించారు.
నాగార్జున బాక్సులు బద్ధలు..
ఫైనల్ గా మొదటి వీకెండ్ సాటర్డే ఎపిసోడ్ ఇంప్రెస్ చేసింది. ఈసారి నాగార్జున కూడా ఏదో వాళ్లు ఇచ్చిన స్క్రిప్ట్ చదవకుండా తను కూడా కొంత రష్ చూస్తున్నట్టు ఉన్నాడు. బిగ్ బాస్ సీజన్ 9 లో ఈరోజు ఎపిసోడ్ లో కూడా నాగార్జున కొందరి బాక్సులు బద్ధలు కొట్టబోతున్నాడు. ఇక నేడు ఒక ఎలిమినేషన్ జరుగుతుంది. బిగ్ బాస్ సీజన్ 9లో ఈరోజు శ్రష్టి వర్మ ఎలిమినేట్ అవుతుందన్న విషయం తెలిసిందే.
సీజన్ 9 లో ఓనర్స్ వర్సెస్ టెనంట్స్ మధ్య వారం మొత్తం హడావిడి జరిగింది. ఐతే ఈ సండే ఒకరిని ఓనర్స్ బ్యాచ్ లోకి టెనంట్స్ నుంచి ఒకరిని కలుపుతారని తెలుస్తుంది. తప్పకుండా బిగ్ బాస్ ఆడియన్స్ కు ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేలా ఉంది.
