Begin typing your search above and press return to search.

కళ్యాణ్, తనూజ డ్యూయెట్ డాన్స్.. వాళ్లకి పండగే..!

బిగ్ బాస్ సీజన్ 9లో స్టార్ కంటెస్టెంట్ గా కొనసాగిన కళ్యాణ్ తనూజ ఇద్దరు కూడా తమ ఆటతో ఆడియన్స్ ని మెప్పించారు.

By:  Ramesh Boddu   |   10 Jan 2026 2:39 PM IST
కళ్యాణ్, తనూజ డ్యూయెట్ డాన్స్.. వాళ్లకి పండగే..!
X

బిగ్ బాస్ సీజన్ 9లో స్టార్ కంటెస్టెంట్ గా కొనసాగిన కళ్యాణ్ తనూజ ఇద్దరు కూడా తమ ఆటతో ఆడియన్స్ ని మెప్పించారు. ఈ ఇద్దరిలోనే కళ్యాణ్ సీజన్ విన్నర్ కాగా తనూజ రన్నరప్ గా నిలిచింది. ఐతే హౌస్ లో ఈ ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ కూడా బిగ్ బాస్ ఆడియన్స్ ని మెప్పించింది. తనూజకి బిగ్ బాస్ కి వెళ్లకముందే సీరియల్ పాపులారిటీ ఉండగా కళ్యాణ్ మాత్రం బిగ్ బాస్ వల్లే సూపర్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 9లో ఈ ఇద్దరి జోడీ ఇంప్రెస్ చేసింది.

ఆదివారం స్టార్ మా పరివారం షోలో..

హౌస్ లో వీరిద్దరి మధ్య బాండింగ్ కూడా ఆడియన్స్ ని అలరించింది. ఐతే ఈ ఇద్దరు షో పూర్తైన తర్వాత కలుస్తారా అనే డౌట్ ఉంది. కానీ కళ్యాణ్ తనూజ ఇద్దరు కలిసి డాన్స్ కూడా వేశారు. ఆదివారం స్టార్ మా పరివారం షోలో బీబీ సీజన్ 9 కంటెస్టెంట్స్ అలరించారు. ఈ వారం షోలో కళ్యాణ్, తనూజ పెర్ఫార్మెన్స్ కూడా షోకి క్రేజ్ తీసుకు రానుంది.

బిగ్ బాస్ సీజన్ 9లో క్రేజీగా మారిన కళ్యాణ్, తనూజ ఇద్దరు కూడా మళ్లీ ఇలా ఆఫ్టర్ షో కలిసి డాన్స్ చేయడం ఆ ఇద్దరినీ ఇష్టపడుతున్న ఆడియన్స్ కి పండగ చేసుకునేలా ఉంది. బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ కపుల్ గా వీరిద్దరి పేరు మారుమోగింది. కళ్యాణ్ ఐతే తనూజ మీద చాలా ఇంట్రెస్ట్ చూపించాడు. తనూజకి కళ్యాన్ దగ్గర అయినా ఆమె తనని ఒక ఫ్రెండ్ గా సలహాలు ఇస్తూ ఓ విధంగా కళ్యాణ్ విన్నర్ అయ్యేందుకు సపోర్ట్ గా నిలిచింది.

సీజన్ లో పాల్గొన్న డీమాన్ పవన్, రీతు..

కళ్యాణ్, తనూజ ఇద్దరు కలిసి డాన్స్ చేయడమే ఆదివారం స్టార్ మా పరివారం షోకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. స్టార్ మా లో బిగ్ బాస్ పూర్తైన అనంతరం బీబీ జోడీ సీజన్ 2 స్టార్ట్ అయ్యింది. ఈ సీజన్ లో పాల్గొన్న డీమాన్ పవన్, రీతు చౌదరిలు కూడా బీబీ జోడీ 2లో పాల్గొంటున్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరు బీబీ జోడీలో పార్టిసిపేట్ చేస్తారు.

బిగ్ బాస్ సీజన్ 9లో రన్నరప్ అయిన తనూజకి మంచి పాపులారిటీ వచ్చింది. ఆమె ఆల్రెడీ సీరియల్ స్టార్ గా క్రేజ్ కొనసాగిస్తుండగా సీజన్ 9 రన్నరప్ గా నిలిచి మరింత స్ట్రాంగ్ గా నిలిచింది. ఐతే ఆదివారం స్టార్ మా పరివారం లో బీబీ 9 కి సంబందించిన కంటెస్టెంట్స్ పాల్గొనడం బిగ్ బాస్ లవర్స్ ని సూపర్ ఎగ్జైట్ చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొన్న కంటెస్టెంట్స్ దాదాపు ఆదివారం స్టార్ మా పరివారంలో పాల్గొని సందడి చేశారు. షోలో భాగంగా సుమన్ శెట్టి బావలు సయ్యా డాన్స్ కూడా ప్రేక్షకులను అలరించనుంది.