బిగ్ బాస్ 9.. మళ్లీ కెప్టెన్ అయిన స్ట్రాంగ్ ప్లేయర్..!
ఐతే ఆడియన్స్ అతని నుంచి కామెడీ కోరుతున్నారని తెలుసుకున్న అతను మళ్లీ తన ఫన్ యాంగిల్ మొదలు పెట్టాడు. ఫైనల్ గా ఏడవ వారం ఇంటి కెప్టెన్ అయ్యాడు.
By: Ramesh Boddu | 24 Oct 2025 11:53 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో ఫైనల్ గా గెలిచి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కెప్టెన్ అయ్యాడు. ఈ సీజన్ లో ఆ కంటెస్టెంట్ కి అన్నీ బాగా కలిసి వస్తున్నాయి. ముఖ్యంగా హౌస్ లో ఎంటర్టైన్ చేస్తూనే టాస్కుల్లో తన సత్తా చాటుతున్న అతను ఈమధ్య ఆటని సీరియస్ మోడ్ లోకి తీసుకెళ్లాడు. ఐతే ఆడియన్స్ అతని నుంచి కామెడీ కోరుతున్నారని తెలుసుకున్న అతను మళ్లీ తన ఫన్ యాంగిల్ మొదలు పెట్టాడు. ఫైనల్ గా ఏడవ వారం ఇంటి కెప్టెన్ అయ్యాడు.
ఇమ్మాన్యుయెల్ చివరి వరకు ఆ బోన్ పట్టుకుని..
బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం కెప్టెన్ గా ఇమ్మాన్యుయెల్ గెలిచాడు. దొంగల టాస్క్ లో భాగంగా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వారితో పాటుగా టాస్కుల్లో గెలుస్తూ వచ్చిన వారి మధ్య మరో టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. సీజన్ 7లో ఏదైతే సర్కిల్ లో బోన్ పెట్టి ఎవరైతే దాన్ని పట్టుకుని చివరి దాకా ఉంటారో అలాంటి టాస్కే మళ్లీ ఈ వారం పెట్టారు. ఫైనల్ గా ఇమ్మాన్యుయెల్ చివరి వరకు ఆ బోన్ పట్టుకుని కెప్టెన్ గా నిలిచాడు.
ఈ సీజన్ ఇమ్మాన్యుయెల్ లక్ బాగుంది. ఎందుకంటే ఆల్రెడీ అతని దగ్గర పవర్ అస్త్ర ఉంది. ఈసారి పవర్ అస్త్రాకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మొన్న రాము కోసం పవర్ అస్త్రని వాడి సేఫ్ చేయాలని అనుకున్నాడు. ఐతే ఆ పవర్ ఇమ్మాన్యుయెల్ వాడాక తెలిసింది ఏంటంటే రాము ఆల్రెడీ సేఫ్ అని. ఐతే ఇంకా ఆ పవర్ అస్త్రాకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయట.
ఈ వారం టాస్కులో తన పర్ఫార్మెన్స్ తో..
మరోపక్క ఇమ్మాన్యుయెల్ ఆటలో కూడా అదరగొడుతున్నాడు. ఈ వారం టాస్కులో తన పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. ఇక శుక్రవారం అతను కెప్టెన్ గా గెలుస్తాడు. ఐతే ఆల్రెడీ హౌస్ లో ఒకసారి కెప్టెన్ అయిన ఇమ్మాన్యుయెల్ రెండోసారి కూడా కెప్టెన్ గా నిలిచాడు. కెప్టెన్ గా ఇమ్మాన్యుయెల్ తన ఆట తీరుని ఎలా ఇంకాస్త మెరుగుపరుచుకుంటాడో చూడాలి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో తొలి వారం నుంచి ఇమ్మాన్యుయెల్ ఆట మీద మంచి పట్టు సాధించాడు. ఆట ఆడుతూనే అవసరమైన టైంలో తన కామెడీతో ఎంటర్టైన్ చేస్తున్నాడు. తప్పకుండా ఆడియన్స్ అంతా కూడా ఇమ్మాన్యుయెల్ ని టాప్ 5కి ప్రమోట్ చేసేలా ఉన్నారు. సో ఈ సీజన్ టాప్ 5లో ఒకరు పక్కా అని తెలుస్తుంది. మిగిలిన వారిలో టాప్ 5కి కావాల్సిన నలుగురు ఎవరన్నది పోటీ జరుగుతుంది.
