బిగ్ బాస్ అగ్నిపరీక్ష.. రేసు నుంచి ఇద్దరు ఔట్..?
బిగ్ బాస్ అగ్నిపరీక్ష లో ఇద్దరి కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చారు జ్యూరీ మెంబర్స్. బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్లేందుకు కామన్ మ్యాన్ కేటగిరి నుంచి 15 మందిని సెలెక్ట్ చేసి వాళ్లతో బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో నడిపిస్తున్నారు.
By: Ramesh Boddu | 3 Sept 2025 10:06 AM ISTబిగ్ బాస్ అగ్నిపరీక్ష లో ఇద్దరి కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చారు జ్యూరీ మెంబర్స్. బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్లేందుకు కామన్ మ్యాన్ కేటగిరి నుంచి 15 మందిని సెలెక్ట్ చేసి వాళ్లతో బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో నడిపిస్తున్నారు. ఈ 15 మెంబర్స్ నుంచి 5 లేదా 9 మంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారు. ఐతే వెళ్లేది ఎంతమంది అన్నది సస్పెన్స్ గా ఉంది. ఇదిలాఉంటే బిగ్ బాస్ అగ్నిపరీక్షలో లేటెస్ట్ ఎపిసోడ్ లో ఇద్దరు కంటెస్టెంట్స్ కి షాక్ తగిలింది.
బిగ్ బాస్ కోసమే ఫారిన్ నుంచి..
అగ్నిపరీక్షలో పాల్గొన్న 15 మెంబర్స్ లో ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఆ ఇద్దరిలో ప్రసన్న కుమార్, శ్వేత ఉన్నారు. బిగ్ బాస్ కోసమే ఫారిన్ నుంచి వచ్చింది శ్వేత. ఆమె స్ట్రాంగ్ గా కనిపించే సరికి జ్యూరీ మెంబర్స్ ఆమెను టాప్ 15 కి సెలెక్ట్ చేశారు. ఐతే ఆమె టాస్కుల్లోనూ.. ఇంకా మిగతా విషయాల్లో అంత యాక్టివ్ గా అనిపించలేదు. ముఖ్యంగా నిన్న జరిగిన బెలూన్ టాస్క్ లో ఆమె తన టీం ని గెలిపించుకోలేదు. దాని వల్ల ఆమెకు ఎఫెక్ట్ పడింది.
ఇక ప్రసన్న కుమార్ కూడా టాప్ 15 లో సెలెక్ట్ అవ్వడం బాగానే ఉంది కానీ ఆ తర్వాత అతను టాస్కులు సరిగా ఆడలేదు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష లో అతను ఎందుకో వెనకపడ్డాడు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష లో మొదటి రెండు ఎలిమినేషన్స్ లో శ్వేత ప్రసన్న కుమార్ లు ఉన్నారు. ఇక మరో మూడు రోజుల్లో ఇలానే ఎలిమినేట్ చేసి మిగిలిన వారిలో నుంచి ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం హౌస్ లోకి ఎవరిని పంపించాలన్నది డిసైడ్ చేస్తారు.
ప్రసన్నని ఉంచాల్సింది అని..
ఐతే బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి ప్రసన్న, శ్వేత ఎలిమినేషన్ పై ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. ప్రసన్నని ఉంచాల్సింది అని కొందరు చెబుతున్నారు.
బిగ్ బాస్ సీజన్ 9 లో సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కి ఈక్వల్ గా ఈ కామన్ మ్యాన్ క్రేజ్ ఉండబోతుంది. వాళ్లు ఆల్రెడీ బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా ఆడియన్స్ కు అలవాటు పడ్డారు కాబట్టి కచ్చితంగా ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 9 లో ఈసారి అందరు సెలబ్రిటీస్ లానే ఆడియన్స్ ని అలరించే ఛాన్స్ ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి రణరంగమే అనుకుంటూ ఆడియన్స్ కి హైప్ ఎక్కిస్తున్నారు హోస్ట్ నాగార్జున.
బిగ్ బాస్ సీజన్ 9 లో పాల్గొంటున్న సెలబ్రిటీ కంటెస్టెంట్ గురించి కూడా లిస్ట్ కన్ఫర్మ్ అయ్యింది. ముందు నుంచి చెబుతున్న 8,9 మెంబర్స్ ఈసారి హౌస్ లో saసందడి చేయనున్నారు.
