Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 10.. విన్నర్ రన్నర్స్ మధ్య టైటిల్ ఫైట్..?

బిగ్ బాస్ సీజన్ 9 ముగిసింది.. ఐతే ఎప్పుడు లేనిది ఈసారి సీజన్ 10 మొదలవడానికి ఇంకా చాలా టైం ఉండగా ఇప్పుడే ఆ సీజన్ ఎలా ఉంటుంది.. ఎలా ఉండబోతుంది అన్న డిస్కషన్స్ నడుస్తున్నాయి.

By:  Ramesh Boddu   |   23 Dec 2025 8:00 PM IST
బిగ్ బాస్ 10.. విన్నర్ రన్నర్స్ మధ్య టైటిల్ ఫైట్..?
X

బిగ్ బాస్ సీజన్ 9 ముగిసింది.. ఐతే ఎప్పుడు లేనిది ఈసారి సీజన్ 10 మొదలవడానికి ఇంకా చాలా టైం ఉండగా ఇప్పుడే ఆ సీజన్ ఎలా ఉంటుంది.. ఎలా ఉండబోతుంది అన్న డిస్కషన్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి సీజన్ లో బిగ్ బాస్ ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నారు. హౌస్ మేట్స్ ని రకరకాలుగా వారి టాలెంట్ చూపించేలా టాస్క్ లు పెడతారు. ఐతే అంతకుముందు సీజన్ల వరకు కామనర్ ఒకరిద్దరు హౌస్ లోకి వస్తే మిగతా వాళ్లంతా కూడా సెలబ్రిటీస్ వచ్చారు. ఐతే సీజన్ 9లో మాత్రం కామనర్స్ ని ఆరుగురిని తీసుకోగా సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ ఫైట్ గా డిజైన్ చేశారు.

మరోసారి హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా..

ఐతే సీజన్ 10 ని ఎలా ప్లాన్ చేస్తారన్నది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ సీజన్ 10లో ఇప్పటివరకు జరిగిన 9 సీజన్లలో టైటిల్ విన్నర్స్, రన్నర్స్ గా నిలిచిన వాళ్లను మరోసారి హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా తెస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అంటే 9 సీజన్లు 9 మంది టైటిల్ విన్నర్స్, 9 మంది రన్నరప్స్ అంటే టోటల్ 18 మంది అన్నమాట. ఈ 18 మెంబర్స్ బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ గా వస్తారని చెబుతున్నారు.

ఆల్రెడీ బిగ్ బాస్ కి వచ్చి టైటిల్ విన్నర్ అయిన వాళ్లు.. చివరి దాకా అంటే ఒక్క అడుగులో టైటిల్ మిస్సైన రన్నరప్స్ మళ్లీ బిగ్ బాస్ కి వస్తారా అంటే.. వారానికి రెగ్యులర్ గా ఇచ్చే రెమ్యునరేషన్ కన్నా డబల్ ఇస్తే వాళ్లు కూడా ఆసక్తి చూపించే ఛాన్స్ ఉంటుంది. సీజన్ 10 ఎలా ఉంటుందో తెలియదు కానీ అప్పుడే అందులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరైతే బాగుంటుంది అన్నది చర్చ మొదలైంది.

బిగ్ బాస్ 1 నుంచి 9 సీజన్లు విన్నర్స్..

ఐతే బిగ్ బాస్ 1 నుంచి 9 సీజన్లు విన్నర్స్ గా అయిన వాళ్లు కెరీర్ లో కొందరు దూసుకెళ్తుండగా కొందరు అంత పాపులర్ అవ్వలేదు. ఐతే మరోసారి వాళ్లని తెచ్చి బిగ్ బాస్ హౌస్ లో ఉంచాలన్న ప్లాన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఆల్రెడీ విన్నర్ అయ్యారు కాబట్టి వాళ్లకి చాలా తేలిక అవుతుంది. కానీ పోటీగా ఉంది కూడా విన్నర్స్, రన్నర్స్ కాబట్టి కచ్చితంగా టఫ్ ఫైట్ జరుగుతుంది.

మరి బిగ్ బాస్ సీజన్ 10లో ఏం జరగబోతుంది. ఎలాంటి కాన్సెప్ట్ తో బిగ్ బాస్ టీం వస్తారన్నది ఆసక్తిగా మారింది. సీజన్ 9 ఈమధ్యనే పూర్తి కాగా బిగ్ బాస్ ఆడియన్స్ ఇంకా ఆ షో ట్రాన్స్ లోనే ఉన్నారు. షోని ఎంత ఓన్ చేసుకున్నారు అన్నది ఆడియన్స్ ఇంట్రెస్ట్ ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.