Begin typing your search above and press return to search.

BB అగ్నిపరీక్ష రెండో సీజన్.. వడకట్టేందుకు కొత్త ప్లాన్..?

బిగ్ బాస్ రియాలిటీ షోలో సెలబ్రిటీస్ తో పాటుగా కామన్ మ్యాన్ ని కూడా తీసుకోవడం జరుగుతుంది.

By:  Ramesh Boddu   |   5 Feb 2026 12:00 PM IST
BB అగ్నిపరీక్ష రెండో సీజన్.. వడకట్టేందుకు కొత్త ప్లాన్..?
X

బిగ్ బాస్ రియాలిటీ షోలో సెలబ్రిటీస్ తో పాటుగా కామన్ మ్యాన్ ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఐతే అంతకుముందు సీజన్లలో ఒకరిని మాత్రమే కామన్ మ్యాన్ కేటగిరిలో కంటెస్టెంట్ ఎంపిక జరగ్గా సీజన్ 9లో మాత్రం ఏకంగా సెలబ్రిటీస్ తో ఈక్వల్ గా కామన్ మ్యాన్ ఎంపిక జరిగింది. లాస్ట్ ఇయర్ జరిగిన బిగ్ బాస్ సీజన్ 9లో సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్ అనేలా ప్రోగ్రాం ప్లాన్ చేశారు.

సీజన్ 9 విన్నర్ కూడా కామన్ మ్యాన్..

సీజన్ 9లో ఆరుగురు కామన్ మ్యాన్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. అంతేకాదు లాస్ట్ సీజన్ అదే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కూడా కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల విజేతగా నిలిచాడు. అతనితో పోటీ పడి సెలబ్రిటీ అయిన తనూజ రన్నర్ గా నిలిచింది. ఐతే బిగ్ బాస్ సీజన్ 9లో అగ్ని పరీక్ష ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ తమ సత్తా చాటారు. అందుకే బిగ్ బాస్ అగ్నిపరీక్ష కు మంచి డిమాండ్ పెరిగింది.

ఇక నుంచి ప్రతి బిగ్ బాస్ సీజన్ కి అగ్నిపరీక్ష ద్వారా ఎంపిక చేసే కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపిస్తారని తెలుస్తుంది. సీజన్ 10 కోసం బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 కూడా రాబోతుంది. ఐతే ఈ సీజన్ లో కామన్ మ్యాన్ ని వడకట్టే ప్రాసెస్ ని మరింత కఠినతరం చేస్తున్నారట. ఎందుకంటే బిగ్ బాస్ అగ్నిపరీక్ష 1లో లక్షల కొద్దీ అప్లికేషన్స్ వస్తే అందులో 40 మందిని మాత్రమే ఎంపిక చేసి వాళ్లను అగ్నిపరీక్ష జడ్జిల ముందుకు తీసుకొచ్చారు.

బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2..

ఐతే ఈసారి అలా 40 మందిని కాకుండా ముందే ఫిల్టర్ చేసి హౌస్ లో ఉండేందుకు వీళ్లు పర్ఫెక్ట్ అనుకున్న వారినే అగ్నిపరీక్ష జడ్జిల దగ్గరకు తీసుకు రావాలని అనుకుంటున్నారట. సో బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 అంత సులభతరం అయితే కాదని తెలుస్తుంది. సీజన్ 9లో కామనర్స్ సత్తా చాటారు కాబట్టి సీజన్ 10కి అగ్నిపరీక్ష ద్వారా వచ్చే కంటెస్టెంట్స్ కి మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే అగ్నిపరీక్ష సెలక్షన్ ప్రాసెస్ ని మరింత టఫ్ చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్లకే ఆ అవకాశం ఇవ్వాలని చూస్తున్నారట. సో ఎప్పుడు బిగ్ బాస్ మొదలయ్యాక క్రేజ్ ఉంటుంది. కానీ అగ్నిపరీక్ష ద్వారా షో మొదలవడానికి ముందే ఆడియన్స్ అలర్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది.

బిగ్ బాస్ సీజన్ 10ని కూడా సెలబ్రిటీస్ తో పాటు కామన్ మ్యాన్ సమభాగం అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఐతే లాస్ట్ సీజన్ లా ఓనర్స్, టెనంట్స్ కాన్సెప్ట్ కాకుండా కొత్తగా ట్రై చేస్తున్నారని తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ హౌస్ ని అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వేరే ప్లేస్ కి మార్చేస్తున్నారన్న టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. ఐతే దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే బయటకు రాలేదు.