Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. ఎమోషనల్ ఆట మొదలైంది..!

నామినేషన్స్ ఫైట్ ముగిసిన తర్వాత రీతు చౌదరికి ఇష్టమైన చికెన్ కోసం ఆమెను హౌస్ లో ఉన్న అందరి సీక్రెట్ ని అడిగి తెలుసుకోమని బిగ్ బాస్ చెప్పాడు

By:  Ramesh Boddu   |   24 Sept 2025 11:46 AM IST
బిగ్ బాస్ 9.. ఎమోషనల్ ఆట మొదలైంది..!
X

బిగ్ బాస్ సీజన్ 9 లో 3వ వారం కాస్త ఇంట్రెస్టింగ్ గానే సాగుతుంది. నామినేషన్స్ ఫైట్ ముగిసిన తర్వాత రీతు చౌదరికి ఇష్టమైన చికెన్ కోసం ఆమెను హౌస్ లో ఉన్న అందరి సీక్రెట్ ని అడిగి తెలుసుకోమని బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఆ తర్వాత తనూజ కాఫీ పౌడర్ కోసం సంజనాని ఇంప్రెస్ చేయాల్సి రాగా.. సుమన్ శెట్టితో కలిసి ఒక స్కిట్ చేసింది. ఇక బిగ్ బాస్ టెనంట్స్, ఓనర్స్ అందరికీ కూడా ఇన్ని రోజులు వాళ్లు ఆడిన ఆటకు గాను కొన్ని ఫూట్స్ ని ఇచ్చాడు.

ఇమ్మాన్యుయెల్ మిగతా వాళ్లకు..

అందులో పింక్, బ్లూ, బ్లాక్ ఉన్నాయి. ఐతే అవి ఎందుకు అన్నది తర్వాత తెలుస్తుందని అన్నాడు బిగ్ బాస్. ఈలోగా బ్లూ కలర్ సీడ్ వచ్చిన వాళ్లకు బ్యాటరీ పెట్టి దాని చార్జింగ్ డౌన్ అయ్యేలా ఇంటి నుంచి వచ్చిన మెసేజ్ లను ఇచ్చాడు బిగ్ బాస్. 20 రోజుల పైన హౌస్ లోకి వచ్చి ఉన్న వాళ్లు ఇంటి నుంచి మెసేజ్ అనగానే ఎమోషనల్ అయ్యారు. బ్లూ టీం లోని అందరు బజర్ కోసం పోటీ పడగా అందులో ఇమ్మాన్యుయెల్ ముందు బజర్ కొట్టాడు.

ఇమ్మాన్యుయెల్ కి తండ్రి లెటర్.. మదర్ మెసేజ్ తో పాటు ఫ్యామిలీ ఫోటో అని 3 ఆప్షన్ ఇచ్చాడు బిగ్ బాస్. అందుకు 40, 30, 25 పర్సెంటేజ్ లు బ్యాటరీ డౌన్ అవుతుందని అన్నాడు. ఐతే ఇమ్మాన్యుయెల్ మిగతా వాళ్లకు కూడా బ్యాటరీ ఉండాలని ఫోటోకి ఓకే చెప్పాడు. ఇంటి నుంచి మెసేజ్ అనగానే సంజన, తనూజ, రాము రాథోడ్ ఇలా అందరు కాస్త ఎమోషనల్ అయ్యారు. సీజన్ 9 లో 3వ వారమే హౌస్ మెట్స్ అంతా తమ ఫ్యామిలీని మిస్ అవుతున్నారన్న భావన కలుగుతుంది.

హౌస్ లోకి అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్..

బిగ్ బాస్ సీజన్ 9 లో 3వ వారం టాస్కులు ఇంకా ఏమి పెట్టలేదు. ఐతే ఈ వారం హౌస్ లోకి అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ ముగ్గురు లేదా నలుగురు వెళ్తారని టాక్. వాళ్లలో ఒకరు హౌస్ లో వైల్డ్ కార్డ్ గా ఇంట్లో ఉండిపోతారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 ట్విస్ట్ అండ్ టర్న్స్ లో భాగంగా వీకెండ్ లోగా మరో ముగ్గురు కామనర్స్ హౌస్ లో సందడి చేస్తారని టాక్.

సీజన్ 9 ని ఎలాగైనా సూపర్ హిట్ చేయాలనే ఉద్దేశ్యంతో బిగ్ బాస్ టీం కృషి చేస్తుంది. ఇక దసరా రోజు బిగ్ బాస్ సీజన్ 9 2.ఓ అంటూ మరికొంతమందిని హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా తీసుకొస్తారని టాక్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే వారిలో కూడా సెలబ్రిటీస్ పేర్లు వినబడుతున్నాయి.