బిగ్ బాస్ 9.. కెప్టెన్ గా గెలిచింది ఎవరంటే..?
బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. ఐతే ఈ టాస్క్ లో నలుగురు కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు. అందులో కళ్యాణ్, ఇమ్మాన్యుయెల్, రీతు చౌదరి, రాము రాథోడ్ ఉన్నారు.
By: Ramesh Boddu | 3 Oct 2025 1:52 PM ISTబిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. ఐతే ఈ టాస్క్ లో నలుగురు కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు. అందులో కళ్యాణ్, ఇమ్మాన్యుయెల్, రీతు చౌదరి, రాము రాథోడ్ ఉన్నారు. ఐతే ఈసారి కెప్టెన్ ఎవరన్నది వారి స్వశక్తితో పాటు మిగిలిన కంటెండర్స్ యొక్క ఎంపిక కూడా ప్రాధాన్యం అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 9లో నాలుగో వారం కెప్టెన్ గా గెలవాలంటే కెప్టెన్సీ కంటెండర్స్ అందరు ఒక ప్రాపర్టీని పట్టుకుని ఉండాలి. అందులో ఎవరైతే ఫస్ట్ వదులుతారు వాళ్లు కెప్టెన్ రేసు నుంచి తప్పుకుంటారు.
భరణి రీతు చౌదరిని తప్పిస్తాడు..
ఐతే అందరు పట్టుకుంటే మిగిలిన కంటెండర్స్ నుంచి ఒకరు బెల్ కొట్టి రెయిన్ డ్యాన్స్ చేసి వారిలో నుంచి ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. అలా డీమాన్ పవన్ మొదట కళ్యాణ్ ని కెప్టెన్ కాకుండా తప్పిస్తాడు.. నెక్స్ట్ శ్రీజ ఇమ్మాన్యుయెల్ ని తప్పిస్తుంది. ఇక ఫైనల్ గా భరణి రెయిన్ డ్యాన్స్ చేసి రీతు చౌదరిని తప్పిస్తాడు. సో నాలుగో వారంలో కెప్టెన్ గా రాము రాథోడ్ నిలిచాడు.
ఇన్నాళ్లు తన ఆటలో చురుకుగా లేని రాము ఈ వీక్ చాలా గట్టిగా ఆడటం మొదలు పెట్టాడు. ఈ వారం జరిగిన నామినేషన్స్ లో కూడా రాము రాథోడ్ సంజనని నామినేట్ చేస్తూ చేసిన ఫైట్ తెలిసిందే. సో ఇప్పుడిప్పుడే అతను ఆటల్లో మెరుగు పడుతున్నాడు. ఐతే హౌస్ లో కెప్టెన్ ఎవరన్నది ఈరోజు నైట్ ఎపిసోడ్ లో తెలుస్తుంది. ఐతే బిగ్ బాస్ లీక్స్ ద్వారా నేడు కెప్టెన్ అయ్యేది ఎవరన్నది ముందే లీక్ అయ్యింది.
కెప్టెన్ కాకుండా చేసిన వాళ్లకి పే బ్యాక్..
ఐతే చివరి దాకా వచ్చిన తనని కెప్టెన్స్ కాకుండా చేశారని కళ్యాణ్, ఇమ్మాన్యుయెల్ బాగా అప్సెట్ అయ్యారు. తప్పకుండా ఈ ఇద్దరు నెక్స్ట్ గేం ప్లాన్ లో వాళ్లను కెప్టెన్ కాకుండా చేసిన వాళ్ల కి పే బ్యాక్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 9లో కొత్త ట్విస్టులు, టర్న్ జరుగుతున్నాయి. ఈ వారం రీతు కోసం డీమాన్ పవన్ తన ఫ్రెండ్ అయిన కళ్యాణ్ ని కెప్టెన్సీ రేసు నుంచి తప్పించాడు. దానికి కళ్యాణ్ రీతుని నువ్వే చెప్పావా కళ్యాణి తీసేయమని అంటే అవునని అన్నది.
పవన్, రీతు క్లోజ్ అవ్వడం వల్ల రీతు చెప్పిందని డీమాన్ పవన్ ఆమె కోసం కళ్యాణ్ ని తొలగించడంపై అతను చాలా అప్సెట్ అయ్యాడు. డీమాన్ పవన్ కెప్టెన్ గా ఈ వారం కూడా సేఫ్ అయ్యాడు. మరి అతను రీతు కోసం ఆట ఆడుతున్నాడా ఏంటంటూ ఆడియన్స్ భావిస్తున్నారు.
