Begin typing your search above and press return to search.

హీరోయిన్ గా బిగ్ బాస్ బ్యూటీ కొత్త మూవీ!

అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో తలుపు తడుతుందో కష్టం. అయితే ఆ అదృష్టం పట్టినప్పుడే మనల్ని మనం నిరూపించుకోవాలి.

By:  Madhu Reddy   |   25 Oct 2025 3:00 PM IST
హీరోయిన్ గా బిగ్ బాస్ బ్యూటీ కొత్త మూవీ!
X

అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో తలుపు తడుతుందో కష్టం. అయితే ఆ అదృష్టం పట్టినప్పుడే మనల్ని మనం నిరూపించుకోవాలి. ఈ క్రమంలోనే తాజాగా ఒక బిగ్ బాస్ బ్యూటీ కి ఏకంగా హీరోయిన్ గా అవకాశం లభించింది. ఏకంగా మూడు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఆ అదృష్టవంతురాలు ఎవరో కాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో తన పెర్ఫార్మన్స్ తో అందరిని ఆకట్టుకొని.. రెండుసార్లు ఎంట్రీ ఇచ్చిన రతిక రోజ్. ఇకపోతే ఒక వర్గం ఆడియన్స్ ను ఈమె మెప్పించినా.. చాలావరకు ఈమెపై నెగటివిటీ పెరిగిపోయిందనే చెప్పాలి. కారణం ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. అందరికీ చిరాకు తెప్పించింది. అలా హౌస్ లో నెగెటివిటీ మూటగట్టుకుని బయటకు వచ్చిన ఈమె అదే సమయంలో తండ్రిని కోల్పోయి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. ఇకపోతే ఈమధ్య చిన్నచితక పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈమె.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్గా నటించే అవకాశాన్ని అందుకుంది.అదే 'ఎక్స్ వై' చిత్రం. సీవీ కుమార్ దర్శకత్వంలో బ్రానా, అనిజ్ ప్రభాకర్, శ్రీధర్ తదితర లో కీలకపాత్రలు పోషించారు. శ్రీకృష్ణ పిక్చర్స్, శ్రీ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఎంకే సాంబశివం నిర్మించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్ , మలయాళం భాషల్లో కూడా విడుదలకు సిద్ధమవుతోంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా మూవీ పోస్టర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఇరుది సుట్రు, పిజ్జా వంటి ప్రయోగాత్మక చిత్రాలను నిర్మించడంతోపాటు మాయావన్ చిత్రానికి దర్శకుడిగా పనిచేసి మంచి పేరు సొంతం చేసుకున్న సీవీ కుమార్ ఇప్పుడు మరో వైవిధ్యమైన కథాంశంతో ఎక్స్ వై అనే చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు. ఇదొక డిఫరెంట్, న్యూ కంటెంట్ మూవీ అని కచ్చితంగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటుంది అని మేకర్స్ స్పష్టం చేస్తున్నారు.

రతిక రోజ్ కెరియర్ విషయానికి వస్తే.. గతంలో నారప్ప, దృశ్యం 2, నేను స్టూడెంట్ సార్ లాంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె హీరోయిన్ అవ్వాలని ఎప్పటినుంచో కలలు కంది.. అందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్ నుంచి రాగానే రాఘవేంద్రరావు సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది అని ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. దాంతో ఆ న్యూస్ ఇంగ్లీష్ పేపర్ రావడంతో దానిని ఆమె పోస్ట్ చేస్తూ నా డ్రీమ్ నెరవేరింది అంటూ అప్పట్లో పోస్ట్ కూడా పెట్టింది. కానీ ఆ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ రాలేదు. కానీ ఇప్పుడు ఎక్స్ వై అనే కొత్త సినిమాతో హీరోయిన్గా మన ముందుకు రాబోతోంది . మరి హీరోయిన్ గా ఈ సినిమాతో రతిక ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.