Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ విన్నర్ ఇంటిపై కాల్పుల వర్షం.. ఏం జరిగిందో తెలిస్తే షాక్!

వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా పేరు సొంతం చేసుకున్న బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ 2 విన్నర్ ఇంటిపై గుర్తుతెలియని దుండగులు కాల్పుల వర్షం కురిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది.

By:  Madhu Reddy   |   17 Aug 2025 1:29 PM IST
బిగ్ బాస్ విన్నర్ ఇంటిపై కాల్పుల వర్షం.. ఏం జరిగిందో తెలిస్తే షాక్!
X

వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా పేరు సొంతం చేసుకున్న బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ 2 విన్నర్ ఇంటిపై గుర్తుతెలియని దుండగులు కాల్పుల వర్షం కురిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏకంగా 24 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ప్రముఖ యూట్యూబర్ గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు ఎల్విష్ యాదవ్ . ఈయన బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 విజేతగా కూడా పేరు దక్కించుకున్నారు. ఇకపోతే ఈయన ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు 24 రౌండ్లకు పైగా కాల్పులు జరిపినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే అక్కడ పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గురుగ్రామ్ సెక్టార్ 57లో ఎల్విష్ గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. అయితే నేడు తెల్లవారుజామున 5:30 - 6:00 గంటల మధ్య వ్యవధిలో కాల్పులు జరిగాయి. బైకుల పైన వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు.. ఈ కాల్పులు జరిపి అక్కడి నుండి పరారయ్యారు. ముఖ్యంగా ఆ సమయంలో వారు ముఖానికి ముసుగు వేసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వెళ్లడయ్యింది.

ఇకపోతే ఈ కాల్పులు జరిపిన సమయంలో ఎల్విష్ ఇంట్లో లేడని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం జరగలేదు కానీ దాదాపు తుపాకీ గుండ్లు గోడలపై స్పష్టంగా కనిపిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఆకస్మిక ఘటనతో ఆ ప్రాంత వాసులు కూడా భయాందోళనలకు గురి అవుతున్నారు. మరోవైపు ఇప్పటివరకు దాడి చేసిన వారు ఎవరు అనే విషయం ఇంకా తెలియలేదు.

ఇకపోతే సెలబ్రిటీలపై దుండగులు కాల్పులు జరపడం ఇదేం తొలిసారి కాదు. ఎల్విష్ ఇంటిపై దాడి జరగకముందు హర్యానాకు చెందిన బాలీవుడ్ సింగర్ రాహుల్ ఫాజిల్ పూరియా పై జూలై 14 సాయంత్రం కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. గురు గ్రామ్ లోని ఎస్పిఆర్ రోడ్డులో గుర్తుతెలియని దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత అలాంటి గటన ఏదీ జరగలేదని పోలీసులు స్పష్టం చేసినా.. ఇప్పుడు మళ్లీ ఇలాంటి ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇకపోతే ఎల్విష్ పై గతంలో పోలీస్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఒక రెస్టారెంట్లో గుర్తు తెలియని వ్యక్తిపై చేయి చేసుకున్నారు. ఈ విషయంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఒక రేవు పార్టీలో రెడ్ హ్యాండెడ్ గా ఈయనను పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఈయన నుంచి తొమ్మిది పాములు , 20 ఎంఎల్ఏ విషం స్వాధీనం చేసుకొని.. పాముల విషాన్ని అమ్ముతున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాదు పలుమార్లు గొడవలు, రాజస్థాన్ పోలీసులు తప్పుడు ఆరోపణలు, బెదిరింపులకు పాల్పడినట్లు ఈయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ వివాదాలే ఇప్పుడు కాల్పులకు కారణమై ఉండవచ్చని పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంటిపై దాడి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు.