Begin typing your search above and press return to search.

బిగ్‌బాస్‌ షో ను వెంటనే ఆపేయండి..!

బిగ్‌బాస్‌ షో వల్ల పొల్యూషన్ ఏంటా అని అంతా కూడా అవాక్కవుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. బిగ్‌బాస్‌ షో షూటింగ్‌ జరుగుతున్న జాలీవుడ్‌ స్టూడియో పరిసర ప్రాంతాలు అత్యంత దుర్గంధంతో నిడిపోయిందట.

By:  Ramesh Palla   |   7 Oct 2025 11:04 PM IST
బిగ్‌బాస్‌ షో ను వెంటనే ఆపేయండి..!
X

ఒక వైపు హిందీ బిగ్‌బాస్‌ నెపొటిజం కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ వెంటనే నిలిపి వేయాలంటూ డిమాండ్ వినిపిస్తూ ఉంటే, మరో వైపు తెలుగు బిగ్‌బాస్ విషయంలో చాలా కాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు సామాజిక కార్యకర్తలు తెలుగు బిగ్‌బాస్‌ను నిలిపి వేయాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా కన్నడ బిగ్‌బాస్ చాలా పెద్ద సమస్యలో చిక్కుకుంది. బెంగళూరులో జాలీవుడ్‌ స్టూడియోస్‌లో జరుగుతున్న బిగ్‌బాస్ కన్నడ షూటింగ్‌ వెంటనే ఆపేయాలంటూ కర్ణాటక స్టేట్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాలను వెంటనే అమలు చేయకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, చట్టపరమైన చర్యలకు సైతం రెడీ కావాలంటూ హెచ్చరించారు. పొల్యూషన్ కంట్రోల్‌ బోర్డ్‌ నుంచి ఈ ప్రకటన ప్రస్తుతం కన్నడ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

కాలుష్యం కారణంగా బిగ్‌బాస్‌ షో రద్దు..!

బిగ్‌బాస్‌ షో వల్ల పొల్యూషన్ ఏంటా అని అంతా కూడా అవాక్కవుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. బిగ్‌బాస్‌ షో షూటింగ్‌ జరుగుతున్న జాలీవుడ్‌ స్టూడియో పరిసర ప్రాంతాలు అత్యంత దుర్గంధంతో నిడిపోయిందట. అంతే కాకుండా వాతావరణ సమస్యలు, కాలుష్యం తదితర విషయాల కారణంగా బిగ్‌బాస్‌ నిర్వాహకులకు పొల్యూషన్ కంట్రోల్‌ బోర్డ్‌ నుంచి ఇప్పటికే నోటీసులు అందినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌ హౌస్‌ నిర్వాహణ సరిగా లేని కారణంగానే ఈ సమస్య అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. కొందరు మాత్రం కావాలని ఇలా చేస్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు. బిగ్‌బాస్‌ హౌస్ వల్ల కాలుష్యం కలగడం ఏంటో విడ్డూరంగా ఉందని పలువురు బిగ్‌బాస్ అభిమానులు సోషల్‌ మీడియాలో ఈ విషయమై చర్చించుకుంటూ తమ మద్దతును బిగ్‌బాస్ నిర్వాహకులకు చెబుతున్నారు.

జాలీవుడ్‌ స్టూడియోస్‌ పై చర్యలు..!

జాలీవుడ్‌ స్టూడియోస్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలుష్యం కారణంగా వెంటనే అక్కడ జరుగుతున్న షూటింగ్ అన్నింటిని నిలిపి వేయాలని కాలుష్య నియంత్రన బోర్డ్‌ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు షో నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే తక్షణమే స్టూడియో చుట్టు పక్కల, స్టూడియోలో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టేందుకు షో నిర్వాహకులు రెడీ అయ్యారని తెలుస్తోంది. స్టూడియో నిర్వహణ సరిగ్గా లేని కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. బిగ్‌బాస్‌ షో ను అర్థాంతరంగా ఆపేస్తారా అనే చర్చ తీవ్రంగా నడుస్తోంది. ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు. కాని కొన్ని మీడియా సంస్థలు ఇప్పటికే షో ని నిలిపి వేశారు, షూటింగ్‌ చేయడం లేదు, కంటెస్టెంట్స్ ను బయటకు పంపించేస్తారు అంటూ ప్రచారం జరుగుతోంది.

కన్నడ సూపర్‌ స్టార్‌ సుదీప్ హోస్ట్‌గా..

కన్నడ బిగ్‌బాస్‌ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కుతున్న విషయం తెల్సిందే. హిందీ బిగ్‌ బాస్ ప్రారంభం అయిన కొన్నాళ్లకే కన్నడ బిగ్‌ బాస్‌ ప్రారంభం అయింది. తెలుగు, తమిళ బిగ్‌ బాస్‌ కంటే చాలా ముందు ప్రారంభం అయిన కన్నడ బిగ్‌బాస్‌ ప్రస్తుతం 12వ సీజన్ నడుస్తోంది. ప్రస్తుత సీజన్‌కి కన్నడ సూపర్‌ స్టార్‌ కిచ్చా సుదీప్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఈ షో ను సుదీర్ఘ కాలంగా హోస్టింగ్‌ చేస్తున్న విషయం తెల్సిందే. ఆయన వల్ల షో కి మంచి రేటింగ్‌ వస్తోంది. అంతే కాకుండా ఆయన కి సైతం స్టార్‌ డం పెరిగింది. అందుకే సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా ఆయన బిగ్‌ బాస్ షో ను విడిచి పెట్టడు అనే టాక్‌ ఉంది. ఇప్పుడు బిగ్‌ బాస్ షో అర్థాంతరంగా నిలిచి పోయింది అంటూ వస్తున్న వార్తలపై ఆయన ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.