బిగ్ బాస్ హౌస్ సీజ్.. థియేటర్లో కంటెస్టెంట్స్..!
రెండు నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా బిగ్ బాస్ టీం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఏకంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి అధికారులు హౌస్ ని సీజ్ చేశారు.
By: Ramesh Boddu | 9 Oct 2025 10:22 AM ISTబిగ్ బాస్ సీజన్ మధ్యలో ఉన్న టైం లో ఊహించని షాక్ తగిలింది. బిగ్ బాస్ కన్నడ 12వ సీజన్ జరుగుతున్న టైం లో అధికారులు వచ్చి హౌస్ కి సీజ్ వేసి షాక్ ఇచ్చారు. కర్ణాటకలోని సౌత్ ఏరియాలో ఉన్న జాలీవుడ్ లో బిగ్ బాస్ సెట్ వేశారు. ఐతే ఆ హౌస్ నుంచి వచ్చే వ్యర్ధాల వల్ల తీవ్ర నష్టం ఉందని తెలుసుకున్న అధికారులు వెంటనే షోని ఆపేయాలని నోటీసులు ఇచ్చారు. రెండు నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా బిగ్ బాస్ టీం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఏకంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి అధికారులు హౌస్ ని సీజ్ చేశారు.
బిగ్ బాస్ కన్నడ టీం లైట్ తీసుకోవడం వల్ల..
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోస్ వైరల్ అయ్యాయి. షో నిర్వాహకులు ముందే పర్యావరణానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు సంబంధిత అధికారుల నుంచి పర్మిషన్ కూడా తీసుకోవాలి అలాంటిది ఏమి చేయకుండా అధికారులు నోటీసులు ఇచ్చినా కూడా బిగ్ బాస్ కన్నడ టీం లైట్ తీసుకోవడం వల్ల ఏకంగా అధికారుల ప్రకటనతో పోలీసులు వచ్చి హౌస్ ని సీజ్ చేశారు. అంతేకాదు బిగ్ బాస్ కన్నడలో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా ఒక థియేటర్ లో ఉంచారు.
బిగ్ బాస్ కన్నడ 12వ సీజన్ సెప్టెంబర్ 28న మొదలైంది. సీజన్ మొదలు పెట్టడానికి ముందే పర్యావరణ అధికారుల నుంచి సంబంధింత పర్మిషన్స్ అన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అది చేయలేదు.. పైగా అధికారులు నోటీసులు ఇచ్చినా కూడా దాన్ని పట్టించుకోలేదు. ముందు పబ్లిక్ ఆ తర్వాతే ఎంటర్టైన్మెంట్.. అందుకే బిగ్ బాస్ హౌస్ కి సీల్ వేసి షాక్ ఇచ్చారు. బిగ్ బాస్ కన్నడను అక్కడ స్టార్ కిచ్చ సుదీప్ హోస్ట్ చేస్తున్నారు. జరిగిన ఇన్సిడెంట్ వల్ల సుదీప్ కూడా షాక్ అయ్యాడని చెప్పొచ్చు.
బిగ్ బాస్ హిందీతో పాటు మిగతా సౌత్ భాషల్లో..
ఐతే బిగ్ బాస్ హిందీతో పాటు మిగతా సౌత్ భాషల్లో వస్తుంది. తెలుగులో సీజన్ 9 నడుస్తుంది. ఎక్కడ కూడా ఇలా బిగ్ బాస్ హౌస్ ని అధికారులు సీజ్ చేసే పరిస్థితి రాలేదు. కానీ కన్నడ బిగ్ బాస్ హౌస్ ని అధికారులు సీజ్ చేయడంతో ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఒక షో మీద అధికారులు ఇలా చేయడం పట్ల కొందరు ఆడియన్స్ అసంతృప్తిగా ఉన్నారు. ఐతే మెజారిటీ ఆడియన్స్ అయితే అధికారులు చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె శివ కుమార్ ఆదేశాల మేరకే బిగ్ బాస్ హౌస్ సీజ్ చేశారన్న టాక్ నడుస్తుంది. ముందు ప్రజల క్షేమం ఆ తర్వాతే ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం అయినా అంటూ అధికారులు చెబుతున్నారు.
