Begin typing your search above and press return to search.

DCM జోక్యంతో.. బిగ్ బాస్ గేట్లు తెరుచుకున్నాయి..!

స్టూడియోకి మరో అవకాశం ఇవ్వాలని డీ.సీ.ఎం సౌత్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్ ను ఆదేశించారు.

By:  Ramesh Boddu   |   9 Oct 2025 12:09 PM IST
DCM జోక్యంతో.. బిగ్ బాస్ గేట్లు తెరుచుకున్నాయి..!
X

బిగ్ బాస్ రియాలిటీ షో అన్ని భాషల్లో నిర్వహిస్తున్నారు. హిందీతో పాటు మిగతా సౌత్ భాషల కన్నా కన్నడ బిగ్ బాస్ ముందు మొదలైంది. బిగ్ బాస్ హిందీ 19 సీజన్లు పూర్తి చేసుకుంటే.. బిగ్ బాస్ కన్నడ 11 సీజన్లు పూర్తి చేసుకుని 12వ సీజన్ ఈమధ్యనే మొదలు పెట్టారు. బిగ్ బాస్ కన్నడకు కిచ్చ సుదీప్ హోస్ట్ గా చేస్తున్నారు. ఐతే ఈ షోని కర్ణాటకలోని బిడది అమ్యూజ్మెంట్ పార్క్ లో ఉన్న జాలీవుడ్ స్టూడియో లో నిర్వహిస్తున్నారు. అక్కడే బిగ్ బాస్ సెట్ వేసి షో నడిపిస్తున్నారు.

2.5 లక్షల లీటర్ల వేస్ట్ వాటర్..

ఐతే అక్కడ నుంచి రెగ్యులర్ గా రోజు 2.5 లక్షల లీటర్ల వేస్ట్ వాటర్ బయటకు వస్తుంది. దీనిపై కాలుష్య నియంత్రణ మండలి బిగ్ బాస్ టీం కి నోటీసులు పంపించారు. కానీ దాన్ని వాళ్లు పట్టించుకోలేదు. అందుకే బిగ్ బాస్ హౌస్ కు తహసీల్దార్ తేజస్విని అధికారులతో కలిసి వెళ్లి బిగ్ బాస్ హౌస్ ని సీజ్ చేశారు. ఐతే విషయం తెలుసుకున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బిగ్ బాస్ హౌస్ ని మళ్లీ తెరిపించారు.

స్టూడియోకి మరో అవకాశం ఇవ్వాలని డీ.సీ.ఎం సౌత్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్ ను ఆదేశించారు. ఐతే కన్నడ పరిశ్రమకు మద్ధతు ఇస్తున్నాం కానీ పర్యావరణ పరిరక్షణ ముఖ్యమని.. అయినా సరే వారికి ఒక అవకాశం ఇవ్వాలని కోరినట్టు డీకే శివకుమార్ ఈ విషయం గురించి తన సోషల్ మీడియాలో వెల్లడించారు.

థియేటర్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్..

డీసీఎం జోక్యంతో బిగ్ బాస్ కన్నడ హౌస్ గేట్లు తెరుచుకున్నాయి. ఐతే హౌస్ కి లాక్ వేసిన టైం లో బిగ్ బాస్ కన్నడ కంటెస్టెంట్స్ అందరినీ షో నిర్వాహకులు ఒక థియేటర్ లోకి తీసుకెళ్లారని తెలుస్తుంది. కిచ్చ సుదీప్ కూడా ఈ ఇష్యూ తెలిసి షాక్ అయ్యారు. ఐతే డీసీఎం శివ కుమార్ తీసుకున్న చొరవ గురించి ఆయనకు థాంక్స్ చెప్పారు సుదీప్. సో ఎంత పెద్ద షో అయినా అది ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నా సరే.. రూల్స్ అతిక్రమిస్తే అధికారుల రియాక్షన్ ఎలా ఉంటుందో బిగ్ బాస్ కన్నడ హౌస్ కి తగిలిన షాక్ అందరికీ ఒక వార్నింగ్ బెల్ గా మారుతుందని చెప్పొచ్చు.

బిగ్ బాస్ కన్నడ షో జరుగుతున్న జాలీవుడ్ లో మిగతా టీవీ షోస్ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఐతే బిగ్ బాస్ హౌస్ నిర్వాహకులు చేసిన నిర్లక్ష్యం వల్ల హౌస్ గేట్లకు తాళం వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదే బిగ్ బాస్ టీం ముందే అధికారులు పంపించిన నోటీసుల గురించి ముందస్తు జాగ్రత్త వహిస్తే ఇదంతా జరిగుండేది కాదు.