Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హోస్ట్ ఎవరు? ఎంతో తెలుసా?

అయితే ఆ షో అక్కడ భారీ పాపులారిటీ సొంతం చేసుకోవడంతో అదే షోని హిందీలో బిగ్ బాస్ పేరిట తొలిసారి ప్రారంభించి, దేశ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు

By:  Madhu Reddy   |   7 Sept 2026 10:38 AM IST
బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హోస్ట్ ఎవరు? ఎంతో తెలుసా?
X

విదేశాలలో తొలిసారి బిగ్ బ్రదర్ పేరిట ఒక రియాలిటీ షో ని నిర్వహించారు. అయితే ఆ షో అక్కడ భారీ పాపులారిటీ సొంతం చేసుకోవడంతో అదే షోని హిందీలో బిగ్ బాస్ పేరిట తొలిసారి ప్రారంభించి, దేశ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ షోకి ఆదరణ లభించడంతో ఇప్పుడు ప్రతి భాషలో కూడా బిగ్ బాస్ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.తెలుగు , తమిళ్, మలయాళం, కన్నడ , బెంగాలీ, హిందీ అంటూ పలు భాషలలో ఈ షో ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇదిలా ఉండగా మరొకవైపు సెప్టెంబర్ 6వ తేదీన సాయంత్రం 7 :00 గంటలకు ఏకంగా 5 భాషలలో ఒకేసారి కొత్త సీజన్ లు ప్రారంభం అయ్యాయి. తెలుగు, తమిళ్, కన్నడ ,హిందీ, మలయాళం భాషలలో ఒకేసారి కొత్త సీజన్స్ ఘనంగా ప్రారంభించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఈ బిగ్ బాస్ చరిత్రలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హోస్ట్ ఎవరు? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 10 ఘనంగా సెప్టెంబర్ 6 సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభం అయింది. స్టార్ మా, జియో హాట్ స్టార్ వంటి వేదికలపై ఈ షోని చూడవచ్చు. గత ఆరు సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున సీజన్ 10 కి కూడా బాధ్యతలు చేపట్టారు. ఇక ఈయన సుమారుగా రూ.35 నుండి రూ.40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే తమిళంలో కూడా బిగ్ బాస్ సీజన్ 10 ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కూడా ఎప్పటిలాగే విజయ్ సేతుపతి హోస్ట్ గా బాధ్యతలు చేపట్టారు. ఈయన ఏకంగా రూ.75 నుండి రూ.80 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

మలయాళం లో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాగా.. ఈ కార్యక్రమానికి మోహన్ లాల్ హోస్ట్ గా బాధ్యతలు చేపట్టారు. ఈయన సుమారుగా రూ.30 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.. అలాగే కన్నడలో సీజన్ 13 ప్రారంభం కాగా, కిచ్చా సుదీప్ హోస్ట్ గా బాధ్యతలు చేపట్టారు..ఈయన సుమారుగా 20 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

హిందీలో ఏకంగా 20వ సీజన్ ఘనంగా ప్రారంభం అయింది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు రూ.125 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరిచారు . అంతేకాదు ఇండియా బిగ్ బాస్ హిస్టరీలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హోస్ట్గా సంచలనం సృష్టించారు సల్మాన్ ఖాన్.

చివరిగా బెంగాలీ విషయానికి వస్తే.. మూడవ సీజన్ ఘనంగా ప్రారంభమైంది.. అయితే ఆగస్టు 30వ తేదీనే ఈ సీజన్ ప్రారంభం కావడం గమనార్హం . అయితే నాలుగు సంవత్సరాల ఒప్పందంతో ప్రముఖ భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ సీజన్ కి హోస్ట్ గా బాధ్యతలు చేపట్టారు. ఇక మొత్తం నాలుగు సంవత్సరాలకు గాను రూ.120 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం.