Begin typing your search above and press return to search.

ఛీ.. ఛీ.. బిగ్ బాస్ హౌస్ లో ఏంటా పనులు..?

లేటెస్ట్ గా బిగ్ బాస్ హిందీలో ఒక మేల్ కంటెస్టెంట్ ఫిమేల్ కంటెస్టెంట్ ని బలవంతంగా హగ్ చేసుకోవాలని ప్రయత్నించాడు.

By:  Ramesh Boddu   |   24 Sept 2025 3:19 PM IST
ఛీ.. ఛీ.. బిగ్ బాస్ హౌస్ లో ఏంటా పనులు..?
X

బిగ్ బాస్ రియాలిటీ షోలో ఒకే హౌస్ లో దాదాపు 15 మెంబర్స్ దాకా ఉంటారు. హిందీలో మొదలైన ఈ బిగ్ బాస్ షో సౌత్ అన్ని భాషలకు కూడా పాకింది. బిగ్ బాస్ హిందీలో ప్రస్తుతం 19వ సీజన్ నడుస్తుంది. ఆ తర్వాత తెలుగులో 9వ సీజన్, మలయాళం 7, కన్నడ 12, తమిళ్ 9 ఇలా సీజన్లు కొనసాగుతున్నాయి. ఐతే బిగ్ బాస్ అన్ని భాషల్లో వస్తున్నా కూడా హిందీ బిగ్ బాస్ వేరే లెవెల్ లో ఉంటుంది. అంటే అక్కడ హౌస్ మెట్స్ ఏదైనా చేసుకుంటారు. కొన్ని బోల్డ్ థింగ్స్ కూడా అక్కడ జరుగుతుంటాయి.

రియాలిటీ షోలో ఇలా చేయడం..

లేటెస్ట్ గా బిగ్ బాస్ హిందీలో ఒక మేల్ కంటెస్టెంట్ ఫిమేల్ కంటెస్టెంట్ ని బలవంతంగా హగ్ చేసుకోవాలని ప్రయత్నించాడు. అతను చేసింది ఎందుకు వాళ్లిద్దరి మధ్య అంత ర్యాపో ఉందా అన్నది పక్కన పెడితే ఒక రియాలిటీ షోలో ఇలా చేయడం ఆడియన్స్ ని షాక్ అయ్యేలా చేస్తుంది. ఐతే బిగ్ బాస్ హిందీలో ఇవన్నీ కామనే అని కొట్టిపారేసే వాళ్లు ఉన్నారు. బిగ్ బాస్ హిందీలో కొన్ని ఘోరాలు జరుగుతుంటాయి.

ఈ సీజన్ లో కూడా అలాంటివి కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హౌస్ లో ఆ మేల్ కంటెస్టెంట్ ఫిమేల్ కంటెస్టెంట్ ని అలా బలవంతం చేయడం ఆడియన్స్ కి నచ్చలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐతే సౌత్ లో మరీ ఈ రేంజ్ లో కంటెస్టెంట్స్ మధ్య ర్యాపో ఉండదు. జస్ట్ ఏమన్నా ఉంటే ఫ్రెండ్ షిప్, హగ్స్ ఓకే కానీ మరీ ఇలా మీద మీదకు వచ్చి బలవంతంగా హగ్ చేసుకునే పరిస్థితి అయితే ఉండదు.

బిగ్ బాస్ హౌస్ లో జంటలు..

బిగ్ బాస్ హౌస్ లో కొన్ని జంటలు ఏర్పడటం కామనే. ఐతే వాళ్లు మనం ఒక షొలో ఉన్నామన్న ఆలోచనతో ఉంటే బెటర్. ఎందుకంటే దాదాపు హౌస్ లో 70 కెమెరాలు వాళ్లను క్యాప్చర్ చేస్తుంటాయి. అలాంటిది వాళ్లు ఏం చేస్తున్నారు అన్నది చూస్తారు.

ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ కి వస్తే 9వ సీజన్ కామనర్స్, సెలబ్రిటీస్ అంటూ ఏదో హడావిడి చేశారు. కానీ షో జరిగిన రెండు వారాలు అంత ఆసక్తికరంగా లేదు. జరిగిన రెండు వారాల్లో ఇద్దరు వ్యక్తులు ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 9లో మరొక కామనర్ తో పాటు మరో నలుగురు సెలబ్రిటీస్ వైల్డ్ కార్డ్ గా వెళ్తారని టాక్. సీజన్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ దసరా కానుకగా హౌస్ లోకి వెళ్తారని తెలుస్తుంది.