Begin typing your search above and press return to search.

నేను అతనికి 'యస్' చెప్పాను.. పునర్నవి

బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'ఉయ్యాల జంపాల'తో క్యూట్ నటిగా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది.

By:  M Prashanth   |   5 Dec 2025 6:45 PM IST
నేను అతనికి యస్ చెప్పాను.. పునర్నవి
X

బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'ఉయ్యాల జంపాల'తో క్యూట్ నటిగా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. బిగ్ బాస్ షోతో మరింత క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా రాహుల్ సిప్లిగంజ్ తో నడిపిన ట్రాక్ అప్పట్లో పెద్ద సెన్సేషన్. అయితే షో తర్వాత సినిమాలకు కొంచెం దూరమై, చదువుల కోసం లండన్ వెళ్లిపోయింది. ఇప్పుడు సడెన్ గా ఒక గుడ్ న్యూస్ తో ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసింది.




చాలా కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న పునర్నవి, తన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ పెద్దగా రివీల్ చేయలేదు. కానీ తాజాగా తన ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. "నేను అతనికి యస్ చెప్పాను" అంటూ తన కాబోయే భర్తతో దిగిన రొమాంటిక్ ఫోటోలను పోస్ట్ చేసింది. లండన్ లో ఉన్న ఆమె అక్కడే ఈ విషయాన్ని అఫీషియల్ చేసింది.




ఆమె ఎంగేజ్మెంట్ చేసుకున్న వ్యక్తి పేరు హేమంత్ వర్మ. అయితే ఇక్కడో ట్విస్ట్ ఏంటంటే.. మొదట ప్రపోజ్ చేసింది పునర్నవినే అట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా క్యాప్షన్ లో వెల్లడించింది. "నేను అతనికి యస్ చెప్పాను, అది కూడా ఎక్కువగా అతని కోసమే కావచ్చు, లేదా కాశ్మీర్ చలి నుంచి తప్పించుకోవడానికి కావచ్చు" అంటూ ఫన్నీగా రాసుకొచ్చింది.




హేమంత్ వర్మ కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో స్పందిస్తూ.. "నేను వెతుకుతున్న సబ్జెక్ట్ దొరికేసింది. నా ఫరెవర్ పార్ట్నర్. నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను" అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. వీరిద్దరూ కాశ్మీర్ లోని దాల్ లేక్ వద్ద దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. లండన్ లో ఉంటూనే ఆమె తన లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకున్నట్లు అర్థమవుతోంది.

బిగ్ బాస్ తర్వాత పునర్నవి సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. సైకాలజీలో హయ్యర్ స్టడీస్ కోసం లండన్ వెళ్లిన ఆమె, ఇప్పుడు అక్కడే సెటిల్ అయ్యే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాల కంటే పర్సనల్ లైఫ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ నిర్ణయం చూస్తే అర్థమవుతోంది. బిగ్ బాస్ బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కబోతోందని తెలిసి ఫ్యాన్స్, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిశ్చితార్థం అయితే అయ్యింది కానీ, పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కొత్త జంట ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. చివరగా పునర్నవి 2020లో సైకిల్ అనే సినిమాలో నటించింది. ఆ తరువాత అవకాశాలు వచ్చినా కూడా వాటికి ఓకే చెప్పలేదు.