Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ బ్యూటీ పై కేసు ఫైల్.. అసలేం జరిగిందంటే?

తాజాగా బిగ్ బాస్ బ్యూటీపై కేసు ఫైల్ అవ్వడంతో ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఇంత సడన్ గా ఈమెపై కేసు ఫైల్ అవ్వడం ఏంటి? అంటూ అందరూ చెవులు కోరుకొంటున్నారు.

By:  Madhu Reddy   |   25 Oct 2025 10:23 AM IST
బిగ్ బాస్ బ్యూటీ పై కేసు ఫైల్.. అసలేం జరిగిందంటే?
X

తాజాగా బిగ్ బాస్ బ్యూటీపై కేసు ఫైల్ అవ్వడంతో ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఇంత సడన్ గా ఈమెపై కేసు ఫైల్ అవ్వడం ఏంటి? అంటూ అందరూ చెవులు కోరుకొంటున్నారు. మరి ఆమె ఎవరు? అసలేం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

ఆమె ఎవరో కాదు ప్రముఖ కన్నడ నటి, బిగ్ బాస్ ఫేమ్ దివ్య సురేష్ పై హిట్ అండ్ రన్ కేస్ నమోదయింది. ఈనెల 4వ తేదీన అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో బెంగళూరు బ్యాటరాయనపుర ఎంఎం రోడ్డులో కార్లో వెళ్తుండగా.. అదే సమయంలో.. కిరణ్, అనూష, అనిత కలసి బైకుపై హాస్పిటల్ కి వెళ్తున్నారు. కుక్కలు మొరగడంతో భయపడిన కిరణ్ బైకును కొద్దిగా కుడి వైపుకు తిప్పగా.. వెనుక వేగంగా వస్తున్న దివ్య సురేష్ కారు వెంటనే వీరి బైకును ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు ఒక్కసారిగా కింద పడిపోయారు. అయితే బైక్ ను ఢీ కొట్టిన తర్వాత ఆమె దిగి ఏం జరిగింది అని ఆరా తీయకుండా అలాగే వెళ్ళిపోయింది. అయితే ఈ ప్రమాదంలో అనిత మోకాలు వద్ద ఫ్రాక్చర్ అవ్వగా.. మిగిలిన ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

బాధితులు అరుస్తున్నప్పటికీ కారు ఆపకుండానే దివ్య అక్కడినుంచి ఉడాయించింది. ఇక ఈ విషయం అంతా అక్కడున్న సీసీ కెమెరాలలో రికార్డు అయింది. హాస్పిటల్ నుంచి కోలుకున్న తర్వాత కిరణ్ ఈనెల 7న కారు హిట్ అండ్ రన్ పై బ్యాటరాయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజా నిజాల కోసం ఆరా తీసి.. ఆ సీసీ ఫుటేజ్ లను పరిశీలించిన పోలీసులు దివ్యా సురేష్ కారుగానే గుర్తించారు ఇక ఆమెను విచారించి ఆమె పై కేసు ఫైల్ చేసి, ఆమె కారును కూడా సీజ్ చేశారు. ప్రస్తుతం కేసు నమోదు అయింది. దీనికి ఆమె ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.

దివ్య సురేష్ విషయానికి వస్తే.. కన్నడ నటి అయిన ఈమె తెలుగు చిత్రాలలో కూడా నటించింది. మోడల్ గా కెరియర్ ఆరంభించి.. ఆ తర్వాతే సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఇకపోతే 'నన్ను హెండ్తి ఎంబీబీఎస్', 'జోడి హక్కి' వంటి కన్నడ సీరియల్స్ లో నటించింది. వృత్తిరీత్యా మోడల్ అయిన ఈమె 2017లో మిస్ ఇండియా సౌత్ టైటిల్ ని కూడా సొంతం చేసుకుంది. కబడ్డీ క్రీడాకారిని ఆయన ఈమె కర్ణాటక రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా పాల్గొనింది . అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 8 కన్నడలో నటించి టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలిచింది. కలర్స్ కన్నడ ఛానల్ లో ప్రసారమైన త్రిపుర సుందరి సీరియల్ లో నటించిన ఈమె డిగ్రీ కాలేజ్, టెన్త్ రాజా వంటి చిత్రాలలో కూడా నటించింది.