స్టన్నింగ్ లుక్ లో దివి హొయలు.. చూపు తిప్పుకోలేని అందంతో!
బ్లాక్ కలర్ సింగిల్ సైడ్ షోల్డర్ బాడీ కాన్ డ్రెస్ ధరించిన ఈమె ఒకవైపు బాటమ్ చీలిక లాంటి డ్రెస్ ధరించి తన ఫ్యాషన్ సెన్స్ ను చూపించుకుంది .
By: Madhu Reddy | 19 Oct 2026 10:40 AM IST
ప్రముఖ బ్యూటీ దివి గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న ఈమె.. సినిమాల కంటే కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో కంటెస్టెంట్గా పాల్గొని అందరి దృష్టిని ఆకట్టుకుంది. అప్పటినుంచి పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తూనే.. మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఒలకబోస్తున్న ఈ చిన్నది తాజాగా షేర్ చేసిన మరో ఫోటోషూట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. స్టన్నింగ్ లుక్ లో ఆమె ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఒకసారి సాంప్రదాయంగా కనిపిస్తూ.. అందర్నీ ఆకట్టుకుంటుంది. మరొకసారి గ్లామర్ వలకబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. ఇలా తాజాగా మరోసారి మరో ఔట్ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ చిన్నది . చూపు తిప్పుకోలేని అందంతో స్టన్నింగ్ లుక్ లో శరీరానికి అతుక్కుపోయేలా దుస్తులు ధరించి చిల్ అవుతూ పార్టీ వైబ్ ను తెగ ఎంజాయ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా దివి ధరించిన దుస్తుల విషయానికి వస్తే.. బ్లాక్ కలర్ సింగిల్ సైడ్ షోల్డర్ బాడీ కాన్ డ్రెస్ ధరించిన ఈమె ఒకవైపు బాటమ్ చీలిక లాంటి డ్రెస్ ధరించి తన ఫ్యాషన్ సెన్స్ ను చూపించుకుంది . వన్ షోల్డర్ డిజైన్ ఈమె లుక్ కి అదనపు హుందాతనాన్ని అందించింది. ముఖ్యంగా ఈమె రూపానికి అధునాతనమైన గ్లామర్ ఆకర్షణను తీసుకొచ్చింది. ఈ ట్రెండీ అవుట్ ఫిట్ సెలబ్రిటీ ఫ్యాషన్ లుక్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్ ధరించడమే కాకుండా దానికి తగ్గట్టు అసలైన ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తూ తిరుగులేని స్టార్ పవర్ ను నిరూపించింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి అయితే ఈ లేటెస్ట్ బ్లాక్ అవుట్ ఫిట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
వెకేషన్ లో భాగంగా పబ్ కి వెళ్లిన ఈమె అక్కడ ఇలాంటి అందంతో మెస్మరైజ్ చేసింది. పైగా ఈ ఫోటోలకు క్యాప్షన్ గా మేకప్ లేదు.. ఎలాంటి ఫిల్టర్ లేదు.. మాస్క్ అసలే లేదు.. పిచ్చి చేష్టలు.. నవ్వులు.. డాన్స్.. సుదీర్ఘ సంభాషణల మధ్య కొత్త స్నేహితులతో గడిపిన ఒక రాత్రి నన్ను మరింత సంతోషానికి గురి చేసింది . ఢిల్లీ నిన్ను జీవితాంతం ఇలాగే గుర్తించుకుంటాం ..అంటూ ఢిల్లీ వెకేషన్ లో భాగంగా పొందిన ఎంజాయ్మెంట్ మూమెంట్స్ ని అభిమానులతో పంచుకుంది దివి.
దివి సినిమాల విషయానికి వస్తే.. పుష్ప 2: ది రూల్, డాకు మహారాజ్, హనీ, ద్రౌపది 2 వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ్ , కన్నడ, మలయాళం భాషలలో ఒక్కో ప్రాజెక్టును ప్రకటిస్తూ ఆడియన్స్ ను అలరించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం కర్మస్థలం, నెపోలియన్ రిటర్న్స్, మవుటా (కన్నడ), భీష్మర్ (మలయాళం), గిల్లి మాప్పిలై(తమిళం) వంటి భాషా చిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తోంది.
