Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ అగ్నిపరీక్ష.. అసలు ట్విస్ట్ అదేనా..?

బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా సీజన్ 9 లోకి కామన్ మ్యాన్ పంపించాలన్న ఆలోచన బాగుంది. ఎంతోమంది బిగ్ బాస్ లోకి రావాలని అనుకోగా వేల కొద్దీ అప్లికేషన్స్ వచ్చాయి.

By:  Ramesh Boddu   |   1 Sept 2025 9:16 AM IST
బిగ్ బాస్ అగ్నిపరీక్ష.. అసలు ట్విస్ట్ అదేనా..?
X

బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా సీజన్ 9 లోకి కామన్ మ్యాన్ పంపించాలన్న ఆలోచన బాగుంది. ఎంతోమంది బిగ్ బాస్ లోకి రావాలని అనుకోగా వేల కొద్దీ అప్లికేషన్స్ వచ్చాయి. వాటిల్లోనుంచి 45 మందిని స్క్రూట్నైజ్ చేసి అందులో నుంచి ఒక 15 మందిని వడకట్టారు జ్యూరీ మెంబర్స్. ఈ బిగ్ బాస్ అగ్నిపరీక్షకు జ్యూరీ మెంబర్స్ గా నవదీప్, అభిజిత్, బిందు మాధవి ఉన్నారు. శ్రీముఖి హోస్టింగ్ లో బిగ్ బాస్ అగ్నిపరీక్ష జరుగుతుంది. ఐతే బిగ్ బాస్ అగ్నిపరీక్ష మొదలై 9 రోజుల దాకా అవుతుంది. ఈ నైన్ డేస్ లో ఎల్లో కార్డ్ లు కేవలం రెండే వచ్చాయి.

15 మెంబర్స్ లో నుంచి డైరెక్ట్ హౌస్ లోకి..

అందులో ఒకటి మనీష్ కి రాగా.. మరొకటి డాలియాకు వచ్చింది. ఈ ఎల్లో కార్డ్ రెండు సార్లు వస్తే ఆట నుంచి క్విట్ అయినట్టే అని జ్యూరీ మెంబర్స్ చెప్పారు. ఐతే ఈ బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా 15 మెంబర్స్ లో నుంచి డైరెక్ట్ గా ఐదుగురిని హౌస్ లోకి పంపిస్తారని అనుకున్నారు. 15 మందికి టాస్కులు ఇస్తూ వారిని అన్న్ని విధాలుగా రెడీ చేస్తున్నారు. ఐతే మొదలైన దగ్గర నుంచి ఇప్పటివరకు టాస్కులు జరుగుతున్నాయి కానీ ఎవరిని ఎలిమినేట్ చేయట్లేదు.

ఐతే తెలుస్తున్న సమాచారం బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో సెప్టెంబర్ 5 దాకా ఇలానే కొనసాగుతుందట. బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7న మొదలవుతుంది. ఐతే ఈసారి సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కూడా హేమాహేమీలే దిగుతున్నారని తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ అగ్నిపరీక్ష లో పాల్గొన్న 15 మందిలో ఎవరు ఫైనల్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారన్నది కూడా సస్పెన్స్ గానే ఉంటుందట. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ని షూట్ కంప్లీట్ చేశారు. దానిలో టాప్ 5 ని డిసైడ్ చేస్తారని అనుకోగా జ్యూరీ మెంబర్స్ ఎవరు టాప్ 5 ని కన్ఫర్మ్ చేయరట.

హౌస్ లోకి వెళ్లాలన్నది డిసైడ్..

అది ఆడియన్స్ చేతుల్లోనే పెడుతున్నారట. సో 15 మెంబర్స్ కి ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేశారు. వారిలో టాప్ ఓటింగ్ వచ్చిన మొదటి ఐదుగురు బిగ్ బాస్ అగ్నిపరీక్షలో జ్యూరీ మెంబర్స్ సజెస్ట్ చేసిన ఐదుగురిని చూసి వారిలో ఎవరు హౌస్ లోకి వెళ్లాలన్నది డిసైడ్ చేస్తారట. అందుకే బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ఉన్న ప్రతి ఒక్కరు బయట ఇంటర్వ్యూస్ ఇస్తూ కనిపిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకముందే వీళ్లంతా బయట ఇంటర్వ్యూస్ ఇవ్వడం విచిత్రంగా ఉంది.

బిగ్ బాస్ సీజన్ మొదలవడానికి ముందే కామన్ మ్యాన్ కే సెలబ్రిటీ హోదా వచ్చేలా ఉంది. సో ఈ సీజన్ సెలబ్రిటీ వర్సెస్ కామన్ మ్యాన్ అన్నారు కానీ.. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా కామన్ మ్యాన్ కి సెలబ్రిటీ హోదా వచ్చేలా చేశారు. సో ఈ సీజన్ అంతా కూడా సరైన కాంపిటీటర్స్ పోటీ పడుతున్నారని చెప్పొచ్చు.