బిగ్ బాస్ 10 వాళ్లకి ఛాన్స్ ఇస్తారా..?
బిగ్ బాస్ సీజన్ 9లో కామనర్స్ అదరగొట్టారు. సీజన్ ని ఎలాగైతే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ప్లాన్ చేశారో అలానే కామనర్, సెలబ్రిటీ మధ్య టఫ్ ఫైట్ ఏర్పడింది.
By: Ramesh Boddu | 23 Dec 2025 1:16 PM ISTబిగ్ బాస్ సీజన్ 9లో కామనర్స్ అదరగొట్టారు. సీజన్ ని ఎలాగైతే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ప్లాన్ చేశారో అలానే కామనర్, సెలబ్రిటీ మధ్య టఫ్ ఫైట్ ఏర్పడింది. ఫైనల్ గా కామనర్ కళ్యాణ్ పడాల సీజన్ విన్నర్ అయ్యి సత్తా చాటాడు. ఐతే బిగ్ బాస్ సీజన్ 9లో కామనర్స్ ఎంపికని బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో ద్వారా నిర్వహించారు. ఆ షో ద్వారా కామనర్స్ ఎంట్రీ నుంచి ఒక 15 మందిని ఫైనల్ చేసి అందులో నుంచి ఆరుగురిని ఈ సీజన్ కామనర్స్ గా హౌస్ లోకి పంపించారు. ఐతే సీజన్ 9లో కామనర్స్ లో మిగిలిన తొమ్మిది మందిలో కొందరికి నెక్స్ట్ సీజన్ లో ఛాన్స్ ఇస్తారా అన్న డిస్కషన్ నడుస్తుంది.
అగ్నిపరీక్షలో టాప్ 13లో..
ముఖ్యంగా బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ఆడియన్స్ మనసులు గెలిచిన మరో ముగ్గురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో నాగ ప్రశాంత్, అనూష, షాకిబ్ కూడా ఉన్నాడు. వీళ్లు అగ్నిపరీక్ష టైం లోనే షోకి వెళ్లాలన్న ఆసక్తి చూపించారు. అంతేకాదు అగ్నిపరీక్షలో టాప్ 13లో కూడా వీరు ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ గా మరో ఛాన్స్ కోసం దివ్యతో పాటు ఈ ముగ్గురు హౌస్ లోకి వెళ్లారు.
ఐతే నాగ ప్రశాంత్, దివ్య, అనూష, షాకిబ్ లలో దివ్యాని హౌస్ లోకి తీసుకొచ్చేందుకు ఓటింగ్ వేశారు. ఐతే దివ్య కూడా తన ఆట తీరుతో ఆకట్టుకుంది. ఇక మరోపక్క సీజన్ 9లో ఛాన్స్ మిస్సైన షాకిబ్, అనూష, నాగ ప్రశాంత్ కి బిగ్ బాస్ 10లో సెలబ్రిటీ హోదాలో ఛాన్స్ ఇవ్వకపోయినా కనీసం కామన్ మ్యాన్ కేటగిరిలో అయినా హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ ఇవ్వాలని ఆడియన్స్ కోరుతున్నారు.
బిగ్ బాస్ 10లో అనూష, నాగ ప్రశాంత్, షాకిబ్..
బిగ్ బాస్ కి ఎలాగు సోషల్ మీడియాలో పాపులర్ ఉన్న వాళ్లే కావాలి కాబట్టి ఈ సీజన్ లో మిస్సైన కొందరిని ముఖ్యంగా ఆల్రెడీ బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా ఆడియన్స్ కు పరిచయమైన వాళ్లను నెక్స్ట్ సీజన్ లో తీసుకునే అవకాశం ఉంది. మరి బిగ్ బాస్ టీం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కానీ బిగ్ బాస్ 10లో అనూష, నాగ ప్రశాంత్, షాకీబ్ వస్తే సీజన్ 9 లో మిస్సైన ఈ ఛాన్స్ సీజన్ 10లో పొందినట్టు అవుతుంది.
బిగ్ బాస్ సీజన్ 10ని ఈసారి మరీ లేట్ గా కాకుండా త్వరగా మొదలు పెట్టాలని చూస్తున్నారు. అంతేకాదు బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 కూడా ఉంటుందని తెలుస్తుంది. అందులో కూడా కామనర్స్ ని కొంతమందిని వడకట్టి సీజన్ 10కి సెలెక్ట్ చేస్తారట బిగ్ బాస్ టీం.
