బిగ్ బాస్ అగ్నిపరీక్ష.. నవదీప్ ఫైర్ అవ్వడం వెనక రీజన్ ఏంటి..?
బిగ్ బాస్ అగ్నిపరీక్షలో కంటెస్టెంట్స్ ఎంపిక కోసం స్పెషల్ జ్యూరీ మెంబర్స్ ముగ్గురిని ఫిక్స్ చేశారు.
By: Ramesh Boddu | 26 Aug 2025 1:50 PM ISTబిగ్ బాస్ అగ్నిపరీక్ష షో మొదలైన 3 రోజుల్లోనే కావాల్సిన వాడి వేడి స్టార్ట్ అయ్యింది. బిగ్ బాస్ షో సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది పక్కన పెడితే సోషల్ మీడియాలో ఈ షో గురించి మాత్రం కచ్చితంగా ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. బిగ్ బాస్ ఈసారి సీజన్ కు ముందే బిగ్ బాస్ అగ్నిపరీక్ష అంటూ ఒకటి మొదలు పెట్టారు. ఈసారి కామన్ మ్యాన్ కి బిగ్ బాస్ షో ఛాన్స్ అంటూ అప్లికేషన్స్ ఇన్వైట్ చేసి. వాళ్లలో నుంచి 45 మందిని ఫైనల్ చేసి.. ఆ 45 నుంచి 15 మెంబర్స్ ని ఫైనల్ చేశారు. ఈ క్రమంలో కొన్ని ఎంపికలు జడ్జిల నిర్ణయాన్ని తప్పుపడుతూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా మొదలయ్యాయి.
అగ్నిపరీక్షలో కంటెస్టెంట్స్ ఎంపిక..
బిగ్ బాస్ అగ్నిపరీక్షలో కంటెస్టెంట్స్ ఎంపిక కోసం స్పెషల్ జ్యూరీ మెంబర్స్ ముగ్గురిని ఫిక్స్ చేశారు. అందులో సీజన్ 1 నుంచి టాప్ 3గా నిలిచిన నవదీప్, సీజన్ 4 విన్న అయిన అభిజిత్, బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ సీజన్ విన్నర్ అయిన బిందు మాధవిని తీసుకున్నారు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోకి హోస్ట్ గా శ్రీముఖి చేస్తుంది. శ్రీముఖి కూడా బిగ్ బాస్ సీజన్ 3 లో రన్నరప్ గా నిలిచింది.
ఐతే రీసెంట్ ఎపిసోడ్ లో డేర్ ఆర్ డై అనే రౌండ్ లో లెవెల్ 2 లో టాప్ 15 కి వెళ్లేందుకు షకీబ్, కల్కి పోటీ పడ్డారు. ఒకరికి తెలియకుండా మరొకరికి మీకు తెలిసిన వాళ్లకి ఫోన్ చేసి కొంత అమౌంట్ మీ అకౌంట్ లోకి కొట్టించుకోండని చెప్పారు. ఐతే కల్కి అలా 90 తౌసండ్ అకౌంట్ లోకి వచ్చేలా చేసుకుంది. నెక్స్ట్ షకీబ్ 60 తౌసండ్ వచ్చేలా చేసుకున్నాడు. ఐతే హోస్ట్ శ్రీముఖి కల్కికి మాక్సిమం అమౌంట్ చెప్పింది.. కానీ షకీబ్ కి అంత డీటైల్డ్ గా చెప్పలేదు.
నవదీప్ శ్రీముఖి తప్పుని కవర్ చేయాలని..
ఈ విషయంపై నవదీప్ మాట్లాడుతూ షకీబ్ కన్ ఫ్యూజ్ అయ్యావా.. అన్ ఫెయిర్ అనిపించిందా అంటే.. కన్ ఫ్యూజ్ అని చెప్పి వెళ్లాడు. కానీ అతనికి సపోర్ట్ గా మరో కంటెస్టెంట్ శ్రీజ మాత్రం అన్ ఫెయిర్ అన్నది. ఐతే ఆమెకు క్లారిటీ ఇవ్వాల్సిన నవదీప్ ఊపుకుంటూ వస్తారంటూ కాస్త అతి చేశాడు. ఐతే నవదీప్ శ్రీముఖి తప్పుని కవర్ చేయాలని అలా అన్నాడా లేదో తెలియదు కానీ చాలా కూల్ గా ఉంటూ ఎప్పుడు ఎంటర్టైనింగ్ గా ఉండే నవదీప్ తన కూల్ నెస్ మిస్ అవ్వడం షాకింగ్ అనిపించింది.
ఐతే నవదీప్ అక్కడ శ్రీజ ని కావాలని కాదు గత 3 డేస్ నుంచి ఎంతోమంది కంటెస్టెంట్ ని చూసి ఆ విసుగుతో అలా అని ఉండొచ్చని అంటున్నారు. ఏది ఏమైనా వాళ్లు కామన్ మ్యాన్ అయినా కూడా అలా డిస్ రెస్పెక్టబుల్ గా మాట్లాడటం తప్పని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు.
