బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 జనవరిలోనే ఎంట్రీస్..?
ఈ క్రమంలో బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 1 ని కేవలం సీజన్ మొదలయ్యే రెండు వారాల ముందు మాత్రమే స్టార్ట్ చేశారు.
By: Ramesh Boddu | 30 Dec 2025 3:00 PM ISTబిగ్ బాస్ సీజన్ 9 సూపర్ హిట్ అవ్వడంతో అందులోనూ బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా సెలెక్ట్ అయిన కంటెస్టెంట్ సీజన్ 9 టైటిల్ విన్నర్ అవ్వడంతో బిగ్ బాస్ అగ్నిపరీక్షకి డిమాండ్ పెరిగింది. బిగ్ బాస్ సీజన్స్ లానే బిగ్ బాస్ అగ్నిపరీక్ష ను కూడా కొనసాగించే ప్లానింగ్ లో ఉన్నారు బీబీ టీం. ఈ క్రమంలో బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 1 ని కేవలం సీజన్ మొదలయ్యే రెండు వారాల ముందు మాత్రమే స్టార్ట్ చేశారు. మొత్తం 40 మందిని ఫైనల్ చేసి వారిలో 15 మందిని ఫిల్టర్ చేసి అందులో కూడా ఇద్దరిని ఎలిమినేట్ చేసి ఫైనల్ గా టాప్ 13లో ఆరుగురికి సీజన్ 9 ఛాన్స్ ఇచ్చారు.
బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 1 సూపర్ హిట్..
ఐతే బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 1 ఎలాగు సూపర్ హిట్ అయ్యింది కాబట్టి సీజన్ 2 ని త్వరగా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. కామనర్స్ ఎంట్రీస్ ని తీసుకుని వారిలో నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్లను బిగ్ బాస్ సీజన్ 10కి ఎంపిక చేసే ప్రాసెస్ జరుగుతుంది. ఐతే సీజన్ 9లా మొదలయ్యే 3 వారాల ముందు కాకుండా బిగ్ బాస్ సీజన్ 10కి త్వరగానే అగ్నిపరీక్ష షో మొదలు పెట్టే ప్లానింగ్ లో ఉన్నారట.
తెలుస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 కి సంబంధించిన ఎంట్రీస్ ని 2026 జనవరి సెకండ్ హాఫ్ నుంచి అప్లికేషన్స్ తీసుకుంటారట. ఐతే వచ్చిన వేల కొద్దీ అప్లికేషన్స్ లో కొందరిని సెలెక్ట్ చేసి వారితో ముందు ఫోన్ సంభాషణలు జరిపి అక్కడ కొందరిని ఫిల్టర్ చేసి మరికొంతమందిని షోకి పిలిచి ఫైనల్ గా అగ్నిపరీక్ష సీజన్ 2 లో కొంతమందిని తీసుకుంటారు.
సీజన్ 2 మార్చిలో మొదలయ్యే ఛాన్స్..
బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 మార్చిలో మొదలయ్యే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. ఐతే ఈసారి సీజన్ 10 కూడా సెప్టెంబర్ దాకా లేట్ చేయకుండా జూలైలో అలా మొదలు పెట్టే ప్లానింగ్ లో ఉన్నారట. బిగ్ బాస్ సీజన్ 10లో ఈసారి అగ్నిపరీక్ష ద్వారా ఎవరెవరు సెలెక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా ఉంది.
ఐతే బిగ్ బాస్ ఇదివరకు సీజన్లలో ఒకరు మాత్రమే కామనర్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఈ అగ్నిపరీక్ష షో ద్వారా కామనర్స్ కూడా సెలబ్రిటీస్ కి ఈక్వెల్ గా హౌస్ లో వెళ్లే అవకాశం వస్తుంది. సో ఇక నుంచి బిగ్ బాస్ సీజన్ కి మాత్రమే కాదు బిగ్ బాస్ అగ్నిపరీక్షకు కూడా మంచి డిమాండ్ ఏర్పడుతుందని చెప్పొచ్చు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా ఎంతోమంది కామనర్స్ వాళ్ల బిగ్ బాస్ కలని నెరవేర్చుకునే అవకాశం వస్తుంది.
