Begin typing your search above and press return to search.

ఊరునుంచి వచ్చేస్తారు.. ఆ ఇష్యూపై నవదీప్ కామెంట్..!

ఐతే ఈ బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో కోసం ముగ్గురు జ్యూరీ మెంబర్స్ ని బిగ్ బాస్ టీం తీసుకున్నారు. అందులో నవదీప్, బిందు మాధవి, అభిజిత్ ఉన్నారు.

By:  Ramesh Boddu   |   28 Aug 2025 10:09 AM IST
ఊరునుంచి వచ్చేస్తారు.. ఆ ఇష్యూపై నవదీప్ కామెంట్..!
X

బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోకి కామన్ మ్యాన్ నుంచి అవకాశం ఇవ్వాలని బిగ్ బాస్ ముందు ప్లానింగ్ తో ఈ షో ఏర్పాటు చేశారు. ఈ సోలో ఫైనల్ గా సెలెక్ట్ అయిన 15 మందిలో నుంచి ఐదుగురు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే ఈ 15 మెంబర్స్ కి ఆడియన్స్ ఎవరిని హౌస్ లోకి పంపించాలనుకుంటున్నారో ఓటింగ్ లైన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఒక్కొక్కరు రోజుకి ఒక ఓట్ వేసి కంటెస్టెంట్స్ కి సపోర్ట్ చేయొచ్చు.

ముగ్గురు జ్యూరీ మెంబర్స్.

ఐతే ఈ బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో కోసం ముగ్గురు జ్యూరీ మెంబర్స్ ని బిగ్ బాస్ టీం తీసుకున్నారు. అందులో నవదీప్, బిందు మాధవి, అభిజిత్ ఉన్నారు. ఐతే నవదీప్ రీసెంట్ గా షోలో భాగంగా దమ్ము శ్రీజని ఊరు నుంచి వస్తారు అంటూ ఫైర్ అయ్యాడు. ఐతే దీని గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తుంది. శ్రీజని నవదీప్ అలా అనడం పట్ల నవదీప్ ని సోషల్ మీడియాలో ఎటాక్ చేస్తున్నారు. జడ్జిగా నవదీప్ చేసింది తప్పని అంటూ హడావిడి చేస్తున్నారు.

ఐతే ఈ మ్యాటర్ తన దాకా రావడంతో నవదీప్ ఈ ఇష్యూపై స్పందించాడు. హౌస్ లోకి వెళ్తే ఇంత కన్నా ఎక్కువ గొడవలు ఉంటాయి. వాటికి సిద్ధం చేసేందుకే బిగ్ బాస్ అగ్నిపరీక్ష పెట్టాడు. అంతేకాదు తను పల్లెటూరు అనలేదు ఊరు నుంచి వచ్చారు అన్నాను. ఐతే దానికి సారీ కానీ నేనేమీ సంజాయిషీ ఇచ్చుకోవట్లేదని అన్నాడు నవదీప్. ఇక్కడితో ఈ మ్యాటర్ వదిలేస్తే బెటర్ అని అన్నాడు నవదీప్.

ఎవరు అన్ని విధాలుగా ఫిట్..

బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోలో నవదీప్, అభిజిత్, బిందు మాధవి ఇలా ముగ్గురు జడ్జిలుగా చేస్తున్నారు. హోస్ట్ గా శ్రీముఖి కూడా తన మార్క్ చూపిస్తుంది. ప్రెజెంట్ హౌస్ లోకి వెళ్లేందుకు సెలెక్ట్ అయిన 15 మందిలో ఎవరు అన్ని విధాలుగా ఫిట్ అని తెలుసుకునేందుకు టాస్కులు ఇస్తున్నారు. అంతేకాదు ఓటింగ్ లైన్స్ లో కూడా ఎవరికి వారు తమ సత్తా చాటుతున్నారు. హౌస్ లోకి వెళ్లకముందే ఓటింగ్ ని తెచ్చుకుంటూ ఈసారి సెలబ్రిటీస్ కి కామన్ మ్యాన్ కూడా ఏమి తక్కువ కాదని అనిపించేలా చేస్తున్నారు.

బిగ్ బాస్ అగ్నిపరీక్ష సెప్టెంబర్ 5 తో పూర్తి అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7న స్టార్ట్ అవుతుంది. సో హౌస్ లోకి ఈసారి కామన్ మ్యాన్ గా వెళ్లే వాళ్లు కూడా ఆల్రెడీ బిగ్ బాస్ టాస్కులు, ఓటింగ్ పర్సెంటేజ్ సంపాదించి హౌస్ లోకి వెళ్తున్నారని చెప్పొచ్చు.