బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 కి సూపర్ డిమాండ్..!
బిగ్ బాస్ సీజన్ 9 ముగిసింది. బిగ్ బాస్ ఆడియన్స్ కి ఈ సీజన్ ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అందించింది.
By: Ramesh Boddu | 23 Dec 2025 1:05 PM ISTబిగ్ బాస్ సీజన్ 9 ముగిసింది. బిగ్ బాస్ ఆడియన్స్ కి ఈ సీజన్ ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అందించింది. ముఖ్యంగా ప్రతి బిగ్ బాస్ సీజన్ లో ఒక కామనర్ కి ఛాన్స్ ఇస్తూ వచ్చారు. కానీ సీజన్ 9లో బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా ఎంపిక చేసి అందులో ఒక ఆరుగురిని సీజన్ 9లో కామనర్స్ గా పంపించారు. బిగ్ బాస్ సీజన్ 9 కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ గా డిజైన్ చేశారు. ఐతే బిగ్ బాస్ సీజన్ 9లో టైటిల్ గెలిచిన కళ్యాణ్ పడాల ఒక కామనర్ అవ్వడంతో అగ్నిపరీక్షకి క్రేజ్ ఏర్పడింది. అక్కడ సెలెక్ట్ అయ్యి టైటిల్ విజేత అయ్యాడంటే అది మామూలు విషయం కాదు.
బిగ్ బాస్ అగ్నిపరీక్ష ని మరో సీజన్ కూడా..
బిగ్ బాస్ సీజన్ 9 కోసం మొదలు పెట్టిన బిగ్ బాస్ అగ్నిపరీక్ష ని ఇప్పుడు మరో సీజన్ కూడా కొనసాగించబోతున్నారని తెలుస్తుంది. కామనర్స్ లో కూడా టాలెంట్ ఉన్న వాళ్లకి బిగ్ బాస్ ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేశారు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ని కూడా సీజన్ల వారిగా దాని ద్వారా బిగ్ బాస్ కి ప్రతి సీజన్ కి కంటెస్టెంట్స్ ని పంపించేలా చూస్తున్నారు.
బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 1 నుంచి సెలెక్ట్ అయిన ఆరుగురిలో ఒకరు టాప్ 3 దాకా రాగా.. మరొకరు బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ అయ్యాడు. ఐతే ఇలా సెలబ్రిటీస్ తో పాటు కామనర్స్ కి ఛాన్స్ ఇవ్వడం వల్ల వాళ్లు కూడా సెలబ్రిటీస్ గా మారే ఛాన్స్ ఉంటుంది. ఐతే బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా వచ్చి టైటిల్ విన్ అవ్వొచ్చు అని కళ్యాణ్ పడాల ప్రూవ్ చేశాడు కాబట్టి రాబోయే బిగ్ బాస్ సీజన్ 10 కోసం మొదలయ్యే బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2కి భారీ డిమాండ్ ఏర్పడుతుంది.
బిగ్ బాస్ అగ్నిపరీక్షకు హైప్..
బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 1 ని శ్రీముఖి హోస్ట్ చేయగా అభిజిత్, నవదీప్, బింధు మాధవి జడ్జులుగా వ్యవహరించారు. నెక్స్ట్ సీజన్ కి వీళ్లనే తీసుకుంటారా లేదా మరో ముగ్గురిని దించుతారా అన్నది తెలియదు కానీ బిగ్ బాస్ షోకి ఎంత క్రేజ్ వచ్చిందో బిగ్ బాస్ అగ్నిపరీక్షకు కూడా అదే రేంజ్ హైప్ వచ్చేలా ఉంది. మరి అగ్నిపరీక్ష 2 ఎలా ఉంటుంది.. దాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు అన్నది చూడాలి.
బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 ని మొదటి సీజన్ లా బిగ్ బాస్ షోకి 10 రోజుల ముందు అన్నట్టు కాకుండా ఈసారి రెండు నెలల ముందే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. సో 2026 సెకండ్ హాఫ్ లో ఈసారి చాలా గ్రాండ్ గా బిగ్ బాస్ అగ్నిపరీక్ష జరగనుంది.
