బిగ్ బాస్ అగ్నిపరీక్ష.. రియల్, ఫేక్ ఆటలో గెలిచింది ఎవరు..?
బిగ్ బాస్ అగ్నిపరీక్ష లో నిన్న సంచాలకులుగా పెద్దగా ప్రభావం చూపించని షాకీబ్, మనీష్, పవన్ లతో ఈరోజు టాస్క్ మొదలు పెట్టారు.
By: Ramesh Boddu | 31 Aug 2025 10:00 AM ISTబిగ్ బాస్ అగ్నిపరీక్ష నేటి ఎపిసోడ్ కూడా అంతంత మాత్రంగానే సాగింది. అదేంటో టాప్ 15 మెంబర్స్ లో రోజు రోజుకి ఎవరు బిగ్ బాస్ హౌస్ కి వెళ్తారా అనే ఆసక్తి కన్నా ఇదేం సోదిరా బాబు అనిపించేలా ఉంది. అసలేమాత్రం ఎంగేజింగ్ గా అనిపించట్లేదు. కంటెస్టెంట్స్ సరిగా ఆడట్లేదా లేదా జ్యూరీ మెంబర్స్ సరిగా వాళ్లతో చేయించట్లేదా అన్నది తెలియదు కానీ షో మాత్రం అంత ఆసక్తికరంగా అనిపించట్లేదు. టాస్కులు కూడా బోరింగ్ అనిపిస్తున్నాయి.
ఐదుగురు లీడర్స్ 5 టీంలు..
బిగ్ బాస్ అగ్నిపరీక్ష లో నిన్న సంచాలకులుగా పెద్దగా ప్రభావం చూపించని షాకీబ్, మనీష్, పవన్ లతో ఈరోజు టాస్క్ మొదలు పెట్టారు. వళ్ల ముగ్గురిలో లీడర్ ఎవరు తీసుకుంటారంటే.. మనీష్, షాకీబ్ పవన్ ని చేశారు. పవన్ నెక్స్ట్ ముగ్గురిని ఎంపిక చేశాడు. వారిలో లీడర్ ఎవరన్నది వాళ్లు డిస్కస్ చేయాలి. ఇలా ఉన్న 15 మెంబర్స్ ని 5 టీం లుగా చేసి. ఐదుగురు లీడర్స్ ని పెట్టారు. వాళ్లను బ్లూ, రెడ్, గ్రీన్, బ్లాక్ అండ్ వైట్, ఎల్లో టీం లుగా విడగొట్టారు.
ఐతే ఈసారి టాస్కులు అందరికీ ఒకేసారి ఇచ్చారు. రియల్ ఆర్ ఫేక్ టాస్క్ పెట్టి అందులో పాయింట్స్ ఇచ్చారు. అలా రెడ్ అండ్ గ్రీన్ టీం లు చేరో రెండు పాయింట్స్ తో లీడ్ లో ఉన్నారు. మిగతా ఎల్లో, బ్లూ టీం లు చెరో పాయింట్ తెచ్చుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ టీం జీరో పాయింట్స్ తో ఉంది. ఐతే బ్లూ, రెడ్ టీం లు టై అవ్వడంతో మరో అడిషనల్ టాస్క్ ఇచ్చారు. దానిలో బ్లూ టీం గెలిచింది.
టాస్కులు ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా..
బ్లూ టీం లీడర్ గా అనూషన్ ఉంది. ఆమె ఈసారి ఓట్ అప్పీల్ ఛాన్స్ ని హరీష్ కి ఇచ్చింది. ఇక స్టార్ ప్లేయర్ గా అదే టీం నుంచి ప్రియా శెట్టిని ఎంపిక చేశారు జ్యూరీ. ఆమె కూడా ఓటింగ్ అప్పీల్ చేశాడు. ఈరోజు ఎపిసోడ్ లో టాస్కులు ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా కంటెస్టెంట్స్ కన్ ఫ్యూజన్ వల్ల పెద్దగా ఎంటర్టైన్మెంట్ అయితే రాలేదు.
టాప్ 15 గా వచ్చిన వీళ్లు రోజు రోజుకి ఆట మీద ఆసక్తి పెరిగి హౌస్ లోకి వెళ్లాలన్న కసి కనిపించట్లేదు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష బిగ్ బాస్ సీజన్ 9 మొదలు పెట్టకముందే ఆసక్తికరంగా ఉంటుందని అనుకుంటే ఆ షో మీద కూడా ఆసక్తి కోల్పోయేలా చేస్తుంది.
