బిగ్ బాస్ 9 : ప్రైజ్ మనీ + రెమ్యునరేషన్ టోటల్ కళ్యాణ్ కి ఎంత వచ్చింది..?
బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ గా కామనర్ కళ్యాణ్ పడాల విజయం బిగ్ బాస్ ఆడియన్స్ ని ఖుషి చేసింది.
By: Ramesh Boddu | 22 Dec 2025 10:43 AM ISTబిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ గా కామనర్ కళ్యాణ్ పడాల విజయం బిగ్ బాస్ ఆడియన్స్ ని ఖుషి చేసింది. బిగ్ బాస్ సీజన్ 9 ని కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ గా డిజైన్ చేసిన బిగ్ బాస్ టీం కామనర్స్ ని బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా ఎంపిక చేశారు. ఇక కామనర్ గా ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ పడాల ఆటలో తన చురుకుదనంతో పాటు హౌస్ మేట్స్ అందరితో అతను మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఫైనల్ గా తన ఫ్రెండ్ తనూజ పైనే పైచేయి సాధించి ఈ సీజన్ విన్నర్ గా నిలిచాడు కళ్యాణ్ పడాల.
సీజన్ 9లో గెలిచిన కంటెస్టెంట్ కి 50 లక్షల ప్రైజ్ మనీ..
ఐతే సీజన్ 9లో గెలిచిన కంటెస్టెంట్ కి 50 లక్షల ప్రైజ్ మనీ ఉంటుందని హోస్ట్ నాగార్జున అనౌన్స్ చేశారు. ఐతే టాప్ 3లో ఉన్న డీమాన్ పవన్ 15 లక్షల క్యాష్ తో బయటకు వచ్చేశాడు. తాను ఎలాగు టాప్ 2లో ఉండనని తెలుసుకున్న డీమాన్ పవన్ టాప్ 3గా ఉన్నప్పుడే బిగ్ బాస్ ఇచ్చిన సిల్వర్ సూట్ కేస్ ఆఫర్ తో బయటకు వచ్చాడు. దాని వల్ల విజేత గెలుచుకునే క్యాష్ ప్రైజ్ లో 15 లక్షలు లాస్ అయ్యింది.
ఫైనల్ గా కళ్యాణ్ టైటిల్ విజేత అయినందుకు 35 లక్షల ప్రైజ్ మనీతో పాటు రోఫ్ట్ నుంచి మరో 5 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు. అంతేకాదు మారుతి సుజుకి నుంచి కొత్త విక్టోరిస్ లగ్జరీ కారుని కూడా సొంతం చేసుకున్నాడు. ఐతే బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి హౌస్ లోకి వెళ్లిన కళ్యాణ్ రెమ్యునరేషన్ గా వారానికి 70 లక్షల దాకా అగ్రిమెంట్ చేసుకున్నాడట. అలా 15 వారాలకు గాను 10.50 లక్షలు రెమ్యునరేషన్ గా పొందుతున్నాడు.
కామనర్ గా బిగ్ బాస్ కి వచ్చి..
సో టోటల్ గా 40 లక్షలు ప్రైజ్ మనీ మరో పది లక్షల రెమ్యునరేషన్ అంటే మొత్తం 50 లక్షలు ప్లస్ ఒక కారుని కూడా సొంతం చేసుకున్నాడు కళ్యాణ్ పడాల. కామనర్ గా బిగ్ బాస్ కి వచ్చి అతను సాధించిన ఈ టైటిల్ ని ఎంతోమందికి స్పూర్తి అందిస్తుంది. ఐతే అతని గెలుపులో హౌస్ లో అతని ఆటతో పాటు బయట సపోర్టర్స్ కూడా కాలేజీలు, స్కూల్స్, బయట పబ్లిక్ అందరితో అతనికి సపోర్ట్ చేసేలా చేశారు.
కళ్యాణ్ గెలుపుకి రన్నరప్ తనూజ కూడా ఒక సపోర్ట్ అని చెప్పొచ్చు. హౌస్ లో వీరి ఫ్రెండ్ షిప్ ఆడియన్స్ ని అలరించింది. కళ్యాణ్ టైటిల్ విన్నర్ అవ్వడానికి ఆమెతో క్లోజ్ అవ్వడం ఆమె టైటిల్ రేసులో ఉండటంతో పాటు కళ్యాణ్ ని కూడా టైటిల్ విజేతని చేసింది.
