కళ్యాణ్ కే కాదు డీమాన్ కి ఆఫర్లు..?
బిగ్ బాస్ సీజన్ 9లో కళ్యాణ్ పడాల విన్నర్ కాగా.. ఆర్మీ నుంచి అగ్నిపరీక్షలో పాల్గొని హౌస్ లోకి వెళ్లి అక్కడ నుంచి అతను విన్నర్ అవ్వడం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.
By: Ramesh Boddu | 28 Dec 2025 7:00 PM ISTబిగ్ బాస్ సీజన్ 9లో కళ్యాణ్ పడాల విన్నర్ కాగా.. ఆర్మీ నుంచి అగ్నిపరీక్షలో పాల్గొని హౌస్ లోకి వెళ్లి అక్కడ నుంచి అతను విన్నర్ అవ్వడం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ విన్నర్ అవ్వడంపై అందరు సూపర్ అనేస్తున్నారు. ఐతే రన్నరప్ అయిన తనూజ కూడా టైటిల్ విన్నర్ కి అర్హత ఉన్నా కళ్యాణ్ మీద కామనర్ అనే ఒక పాజిటివిటీ వర్క్ అవుట్ అవ్వడం వల్ల అతను టైటిల్ గెలిచాడు.
కళ్యాణ్ హీరో అవ్వాలని..
ఐతే కళ్యాణ్ బిగ్ బాస్ కి రావడానికి ముఖ్య కారణం అతనికి సినిమాల మీద ఇంట్రెస్ట్ మాత్రమే. దాదాపు ఏడెనిమిది ఏళ్లుగా అతనికి సినిమాల్లో రావాలని ఉందట. కానీ ఆర్మీలో జాయిన్ అయ్యి ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉంటున్నాడు. ఐతే కళ్యాణ్ ఇప్పుడు హీరో అవ్వాలని అనుకుంటే అదేమంత పెద్ద కష్టం కాదు. ఎలాగు సీజన్ 9 టైటిల్ విన్నర్ అయ్యాడు కాబట్టి అతని క్రేజ్ క్యాష్ చేసుకోవడం కోసం దర్శక నిర్మాతలు ముందుకొస్తారు.
వాటిలో నుంచి కళ్యాణ్ బెస్ట్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఐతే టైటిల్ విన్నర్ అయిన కళ్యాణ్ మాత్రమే కాదు డీమాన్ పవన్ కి కూడా సూపర్ పాపులరిటీ తెచ్చుకున్నాడు. కళ్యాణ్ కి మాత్రమే కాదు డీమాన్ పవన్ కి కూడా సూపర్ క్రేజ్ ఏర్పడింది. సో అతనికి కూడా సినిమా ఛాన్స్ లు వస్తాయని చెప్పొచ్చు.
నెక్స్ట్ స్టెప్ మీదే వాళ్ల కెరీర్ డిపెండ్..
ఐతే బిగ్ బాస్ వల్ల క్రేజ్ వస్తుంది దాన్ని ఎలా ముందుకు కొనసాగించాలి అన్నది వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. కళ్యాణ్ అయినా డీమాన్ పవన్ అయినా ఇద్దరు వాళ్లు వేసే నెక్స్ట్ స్టెప్ మీదే వాళ్ల కెరీర్ డిపెండ్ అయ్యి ఉంటుంది. సీజన్ 9లో వీరిద్దరితో పాటు తనూజ, ఇమ్మాన్యుయెల్, సంజనా కూడా టాప్ 5లో ఉండి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.
కళ్యాణ్, డీమాన్ పవన్ ఇద్దరు అయితే ఇప్పుడున్న ఫాలోయింగ్ తో వెంటనే సినిమాలు చేస్తే క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఐతే సినిమాల్లోకి వచ్చినా కూడా ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే కాస్త లక్ కూడా ఉండాలి. తాము ఎంచుకునే కథలు క్యారెక్టరైజేషన్ ఇలా అన్నీ కూడా సినిమా ఫలితాన్ని డిసైడ్ చేస్తాయి. ఐతే బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ తో ఇదివరకు కొందరు కూడా ఇలానే హీరోగా ప్రయత్నాలు చేశారు కానీ ఎవరు అంతగా క్లిక్ అవ్వలేదు. ఒకవేళ సీజన్ 9 కంటెస్టెంట్స్ అయినా ఆ విషయంలో సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.
