బిగ్ బాస్ 9.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వాళ్లకు ఛాన్స్ లేదా..?
బిగ్ బాస్ సీజన్ 9లో నాలుగు వారాల ఆట పూర్తైంది. ఐతే ఈ ఫోర్ వీక్స్ లో ఎవరి ఆట ఎలా మారుతుంది అన్నది చూడాలి.
By: Ramesh Boddu | 5 Oct 2025 1:42 PM ISTబిగ్ బాస్ సీజన్ 9లో నాలుగు వారాల ఆట పూర్తైంది. ఐతే ఈ ఫోర్ వీక్స్ లో ఎవరి ఆట ఎలా మారుతుంది అన్నది చూడాలి. బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కి ఎవరెవరు వస్తున్నారా అన్న డిస్కషన్స్ నడుస్తున్నాయి. సెలబ్రిటీస్ కొందరు బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ గా వస్తుండగా కామనర్స్ నుంచి అగ్నిపరీక్షలో పాల్గొన్న మరికొందరు కూడా హౌస్ లోకి వస్తారన్న డిస్కషన్ నడుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9లో కామనర్స్ అగ్నిపరీక్ష షోలో పాల్గొన్నారు. వారిలో 13 మంది డిజర్వింగ్ క్యాండిడేట్స్ కాగా.. వారిలో నుంచి ముగ్గురు ఆడియన్స్ ఓటింగ్ తో.. మరో ముగ్గురు జడ్జిలు ఎంపికతో హౌస్ లోకి వచ్చారు.
బిగ్ బాస్ హౌస్ లోకి దివ్య ఎంట్రీ..
బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో భాగంగా కామనర్స్ లో మరో ముగ్గురు హౌస్ లోకి వస్తారన్న డిస్కషన్ నడుస్తుంది. ముగ్గురు వస్తారా లేదా ఒకరిద్దరు మాత్రమే వస్తారా అన్నది తెలియదు. ఐతే బిగ్ బాస్ హౌస్ లోకి దివ్య ఎంట్రీకి ముందు అనూష, షాకీబ్, నాగ ప్రశాంత్, దివ్య హౌస్ లోకి వచ్చారు. వారిలో నుంచి ఎవరు హౌస్ లోకి రావాలన్నది హౌస్ మెట్స్ చేతిలో పెట్టారు. ఐతే వారంతా కూడా అనూషకి ఎక్కువ ఓటింగ్ వేయగా లీస్ట్ ఓటింగ్ దివ్యాకి వచ్చింది.
అలా దివ్య హౌస్ లోకి వచ్చింది. ఇక మిగిలిన ముగ్గురు షకీబ్, నాగ ప్రశాంత్, అనూషలో ఒకరిద్దరికైనా ఈ సీజన్ వైల్డ్ కార్డ్ గా వెళ్లే ఛాన్స్ ఉంటుందా అన్న డిస్కషన్ నడుస్తుంది. వైల్డ్ కార్డ్ గా సీజన్ మొదలైన ఐదు వారాల తర్వాత హౌస్ లోకి వస్తారు. బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా సుహాసిని, రమ్య, మాధురి లాంటి వారు వస్తున్నారట.
సీజన్ 9ని ప్రత్యేకంగా ప్లాన్..
తప్పకుండా హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత ఆట తీరు మారుతుందని అంటున్నారు. సీజన్ 9ని ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం. అందుకే ఈ సీజన్ లో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఆడియన్స్ సర్ ప్రైజ్ ఫీల్ అవుతున్నారు. నాగార్జున హోస్టింగ్ కూడా ఇంప్రెస్ చేస్తుంది. మొత్తానికి సీజన్ 9లో ఆడియన్స్ అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ అందించేలా బిగ్ బాస్ టీం టాస్కులు ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఇప్పటివరకు జరిగిన 4 వారాల ఆటలో బిగ్ బాస్ హౌస్ లో ఆడియన్స్ ఇప్పటికే ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్ అన్నది ఒక నిర్ణయానికి వచ్చారు. వీక్ గా ఉన్న వాళ్లు ఎలాగు ఎలిమినేట్ అవుతారు. స్ట్రాంగ్ గా మరికొంతమంది తయారయ్యి ఫైనల్ ఫైటింగ్ కి సిద్ధమవుతున్నారు.
