Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. ఆ కంటెస్టెంట్ ఎలిమినేషన్ పక్కానా..?

బిగ్ బాస్ సీజన్ 9 రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ సండే జరుగుతుంది. అఫ్కోర్స్ సాటర్డేనే ఆ షూట్ అవుతుంది.

By:  Ramesh Boddu   |   19 Sept 2025 9:30 AM IST
బిగ్ బాస్ 9.. ఆ కంటెస్టెంట్ ఎలిమినేషన్ పక్కానా..?
X

బిగ్ బాస్ సీజన్ 9 రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ సండే జరుగుతుంది. అఫ్కోర్స్ సాటర్డేనే ఆ షూట్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ పూర్తయ్యే వరకు ఓటింగ్ లైన్స్ ఉంటాయి. ఈ సీజన్ సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అంటూ కొత్తగా ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీం. ఐతే కామనర్స్ బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా సెలెక్ట్ చేసి హౌస్ లోకి పంపించారు. ఐతే ఓనర్స్ గా కామనర్స్ చేస్తున్న అతి ఆడియన్స్ కి విసుగు తెప్పిస్తుంది. టాస్క్ లను సరిగా అర్ధం చేసుకోకుండా ప్రతి విషయాన్ని నానా రచ్చ చేస్తున్నారు. ఆఖరికి బిగ్ బాస్ సీరియస్ అయ్యే దాకా తెచ్చుకున్నారు.

నామినేషన్స్ లో ఏడుగురు కంటెస్టెంట్స్..

బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ వారం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. అందులో డేంజర్ జోన్ లో ఇద్దరు ఉన్నారని తెలుస్తుంది. స్ట్రాంగ్ గా ఉన్న వాళ్లు కొంతమంది అయితే అసలు హౌస్ లో ఉండనని చెప్పే వాళ్లు మరికొందరు. ఈ వారం నామినేషన్స్ లో హరీష్, భరణి, ప్రియా శెట్టి, డీమాన్ పవన్, సుమన్ శెట్టి, మనీష్, ఫ్లోరా షైనీ ఉన్నారు. వీరిలో ప్రియా శెట్టి, డీమాన్ పవన్ ఓటింగ్ లో లీస్ట్ పొజిషన్ ఉన్నారని తెలుస్తుంది.

ఐతే గురువారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ సీజన్ 9 లో సెకండ్ కెప్టెన్ గా డీమాన్ పవన్ అయ్యాడు. కెప్టెన్సీ టాస్క్ లో అతని ఆటతో పాటు రీతు చౌదరి సపోర్ట్ తో డీమాన్ పవన్ కెప్టెన్ అయ్యాడు. సో అతను డేంజర్ జోన్ నుంచి తప్పించుకున్నట్టే అని చెప్పొచ్చు. ఇక హౌస్ లో ఆటని సరిగా అర్ధం చేసుకోకుండా 3 రోజులు నిరాహార దీక్ష చేశాడు హరీష్. దానికి ఆయన్నే బయటకు పంపిస్తారా అన్న డౌట్ వచ్చింది. ఐతే ఎలాగోలా మళ్లీ ఆయనే అందరితో కలుస్తున్నారు. దీక్ష విరమించి తింటున్నాడు.

బిగ్ బాస్ హౌస్ లో కామనర్స్..

సో హరీష్ ఈ వారం బయటకు వెళ్లే ఛాన్స్ లు ఉన్నా అతను వెళ్తానంటే బిగ్ బాస్ కాదనడు.. ఆ సందర్భంలో ప్రియా శెట్టి ఎలిమినేట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అలా కాకుండా ఆడియన్స్ తనను ఇంట్లో ఉండాలని కోరుతున్నారు కాబట్టి అని హరీష్ మనసు మార్చుకుని హౌస్ లో కొనసాగాలని అనుకుంటే మాత్రం ప్రియా శెట్టి పెట్టా బేడా సర్ధేయాల్సిందే. కామనర్స్ గా బిగ్ బాస్ హౌస్ లో ఛాన్స్ వచ్చినప్పుడు లేనిపోని గొడవలతో అనవసరమైన స్టఫ్ కాకుండా కాస్త మంచి ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్లి ఉంటే కాస్త ఎక్కువ వారాలు ఉంచే ఛాన్స్ ఉండేది.

బిగ్ బాస్ సీజన్ 9 లో మొదటి వారం నామినేషన్స్ లోకి రాలేదు ప్రియా శెట్టి. రెండో వారం మాత్రమే ఆమె నామినేషన్స్ లో ఉన్నారు. సో నామినేషన్స్ లేకి వచ్చిన తొలి వారమే ఆమె ఎలిమినేట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఐతే ఎలిమినేషన్ లో ఏదైనా ట్విస్ట్ ఉంటే మాత్రం ముందే రివీల్ అవుతుంది.