Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ నామినేషన్స్.. అందరు పోట్లాడుకున్నాక ట్విస్ట్ ఏంటంటే..?

బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం నామినేషన్స్ ఇంట్రెస్టింగ్ గా సాగాయి.

By:  Ramesh Boddu   |   11 Nov 2025 11:15 AM IST
బిగ్ బాస్ నామినేషన్స్.. అందరు పోట్లాడుకున్నాక ట్విస్ట్ ఏంటంటే..?
X

బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం నామినేషన్స్ ఇంట్రెస్టింగ్ గా సాగాయి. ముఖ్యంగా హౌస్ లో కొందరు ఓపెన్ అవ్వట్లేదు అని ఆడియన్స్ భావిస్తుండగా వారు కూడా ఈ నామినేషన్స్ లో ఓపెన్ అయ్యి ప్రక్రియని మరింత రసవత్తరంగా మార్చారు. బిగ్ బాస్ సీజన్ 9 నామినేషన్స్ లో ఈ వారం భరణి, దివ్యల మధ్య ఫైట్ ఆసక్తికరంగా మారింది. భరణి దివ్యని నామినేట్ చేయడం షాకింగ్ అనిపించింది. ఐతే ఇద్దరి మధ్య లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ గురించి డిస్కషన్ నడిచింది. దివ్య పెద్దగా అరిస్తే తనకన్నా పెద్దగా భరణి అరిచాడు.

కెప్టెన్ ఇమ్మాన్యుయెల్ భరణిని నామినేట్..

సుమన్ శెట్టి తనని కప్టెన్సీ రేసు నుంచి తప్పించిన కారణంగా నిఖిల్ ని నామినేట్ చేశాడు. గౌరవ్ హౌస్ లో ఎమోషనల్ డ్రామా, సేఫ్ ప్లే ఆడుతుందని సంజనని నామినేట్ చేశాడు. రీతు గౌరవ్ ని నామినేట్ చేసింది. తనూజ కూడా కొన్ని విషయాల్లో మాత్రమే యాక్టివ్ గా ఉంటున్నాడు మిగతా విషయాలు పట్టించుకోవట్లేదని గౌరవ్ ని నామినేట్ చేసింది. దివ్య కూడా గౌరవ్ నే నామినేట్ చేసింది.

ఇంటి కెప్టెన్ గా ఉన్న ఇమ్మాన్యుయెల్ భరణిని నామినేట్ చేశాడు. రెండో ఛాన్స్ వచ్చినా దాన్ని సరిగా వాడుకోవట్లేదని.. మళ్లీ ఇదివరకులానే ఉంటున్నారని.. కొంత ఓపెన్ అయితే బాగుంటుందని భరణిని నామినేట్ చేస్తూ చెప్పాడు ఇమ్మాన్యుయెల్. అలా హౌస్ లో తనూజ, కళ్యాణ్ లను నామినేట్ చేయకుండా కెప్టెన్ గా ఇమ్మాన్యుయెల్ ని వదిలి అందరినీ నామినేట్ చేశారు. ఐతే బిగ్ బాస్ చివర్లో ట్విస్ట్ ఇస్తూ ఈ వారం అందరు నామినేషన్స్ లో ఉంటారని అన్నాడు. ముందు కెప్టెన్ కూడా నామినేషన్స్ లో ఉంటాడని చెప్పి.. ఇమ్మాన్యుయెల్ రిక్వెస్ట్ తో కెప్టెన్ మినాహించి మిగతా హౌస్ మెట్స్ అంతా కూడా నామినేషన్స్ లో ఉంటారని చెప్పాడు.

10 వారం 10 మంది నామినేషన్స్ లో..

సో ఫైనల్ గా 10 వారం 10 మంది నామినేషన్స్ లో ఉన్నారు. తనూజ, రీతు, డీమాన్ పవన్, కళ్యాణ్, సంజన, నిఖిల్, గౌరవ్, భరణి, దివ్య, సుమన్ శెట్టి ఇలా అందరు ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. ఐతే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో రిస్క్ ఎవరన్నది చూస్తే.. కచ్చితంగా దివ్య, నిఖిల్, గౌరవ్ ఈ ముగ్గురే డేంజర్ జోన్ లో ఉండే అవకాశం ఉంది.

బిగ్ బాస్ సీజన్ 9 తొమ్మిది వారాల తర్వాత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరు.. టాప్ 5 రేసులో ఉన్నది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టాప్ 3 ఆల్రెడీ ఫిక్స్ అయినట్టు తెలుస్తున్నా రాబోయే ఐదు వారాల ఆటలో ఆ స్థానాలు మారే ఛాన్స్ ఉన్నా ఉంటుందని అంటున్నారు.