ఈ వారం డేంజర్ జోన్ లో ఎవరెవరు.. రిస్క్ ఎవరికి..?
బిగ్ బాస్ సీజన్ 9లో 10వ వారం బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తూ హౌస్ మేట్స్ అందరినీ నామినేట్ చేశాడు.
By: Ramesh Boddu | 11 Nov 2025 12:05 PM ISTబిగ్ బాస్ సీజన్ 9లో 10వ వారం బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తూ హౌస్ మేట్స్ అందరినీ నామినేట్ చేశాడు. ముందు నామినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టిన బిగ్ బాస్ ఎవరు ఎవరిని నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వారిని ఏర్పాటు చేసిన సీట్ లో కూర్చోబెట్టి కలర్ వాటర్ పడేలా చేయాలి. ఐతే అవి చల్లగా ఉన్నాయనుకుంటా ఒక్కో కంటెస్టెంట్ ఒణికినట్టు ఫీల్ అయ్యారు. ఐతే చివర్లో బిగ్ బాస్ కెప్టెన్ మినహా హౌస్ మెట్స్ అంతా నామినేట్ అయ్యారని చెప్పడంతో అందరు షాక్ అయ్యారు.
స్ట్రాంగ్ గా రేసులో దూసుకెళ్తున్నారు..
సో ఈ వారం నామినేషన్స్ లో కెప్టెన్ ఇమ్మాన్యుయెల్ మినహా అందరు నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో స్ట్రాంగ్ గా ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు వీక్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. హౌస్ లో ఇప్పటికే కొందరు తమ స్ట్రాంగ్ నెస్ తో రేసులో దూసుకెళ్తున్నారు. అలాంటి వారిలో ఇమ్మాన్యుయెల్, తనూజ, కళ్యాణ్, డీమాన్ పవన్ ఉన్నారు. వీరిలో ఇమ్మాన్యుయెల్ కెప్టెన్ కాబట్టి ఈ వారం నామినేషన్స్ లో లేడు. తనూజ, పవన్, కళ్యాణ్, నామినేషన్స్ లో ఉన్నా సేఫ్ అనే ఫిక్స్ అవ్వొచ్చు.
మరోపక్క సుమన్ శెట్టి, సంజన, రీతు కూడా రేసులో మిడిల్ లో ఉన్నారు. అంటే అటు టాప్ రేంజ్ లో కాకుండా ఇటు కిందకు కాకుండా మిడిల్ లో ఉన్నారు. ఐతే సంజన ఈమధ్య టాస్క్ లు సరిగా పర్ఫార్మ్ చేయక గ్రాఫ్ పడిపోతుంది. ఇక బాటం లో నిఖిల్, గౌరవ్, భరణి, దివ్య ఉన్నారు. భరణి రీ ఎంట్రీ తర్వాత కూడా పెద్దగా పర్ఫార్మ్ చేయట్లేదు. దివ్య హౌస్ లో తను గెలవడం కోసం ఆట ఆడితే సరిపోతుంది కానీ భరణిని కంట్రోల్ లో పెట్టుకోవడం.. తనూజని ఎలాగైనా వెనక్కి లాగాలని చేయడం లాంటివి ఆమెకు బ్యాడ్ అవుతున్నాయి.
బాటంలో ఒకరిద్దరు కాదు నలుగురు కంటెస్టెంట్స్..
నిఖిల్ ఇంకా ఆటలో వేగం పెంచాలి. గౌరవ్ కి ఎంకరేజ్ మెంట్ ఎక్కువయ్యే సరికి ఓవర్ కాన్ ఫిడెంట్ అయినట్టు ఉన్నాడు. అందుకే ప్రతి చిన్న విషయాన్ని పెద్ద సీన్ చేస్తూ వస్తున్నాడు. సో ఈ వారం నామినేషన్స్ లో బాటంలో ఒకరిద్దరు కాదు నలుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో దివ్య, నిఖిల్, గౌరవ్ లతో పాటు భరణి కూడా ఉండేలా ఉన్నాడు. వీరిలోనే ఒకరు ఈ వీకెండ్ ఎలిమినేట్ అవుతారు.
ఐతే ఇచ్చిన టాస్క్ లో పర్ఫార్మ్ చేసి ఆడియన్స్ మనసులు గెలిస్తే మాత్రం సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాదు ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న వాళ్లకి ఇమ్యునిటీ కోసం బిగ్ బాస్ ఈరోజు నుంచి ఒక టాస్క్ ఇస్తున్నాడు. అందులో కళ్యాణ్ రాజుగా దివ్య, రీతు రాణిలుగా చేస్తున్నారు. మిగతా ఎనిమిది మందిలో ప్రజలు నలుగురు, కమాండర్స్ నలుగురు ఉంటారు. మరి ఈ టాస్క్ లో పర్ఫార్మ్ చేసి ఎవరు హౌస్ లో కొనసాగేలా ఆడియన్స్ చేత సూపర్ అనిపించుకుంటారో చూడాలి.
