బిగ్ బాస్ 9.. డబల్ ఎలిమినేషన్ కి ఫిక్స్ అవ్వొచ్చా..?
ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న వారిలో డేంజర్ జోన్ లో అంటే లీస్ట్ ఓటింగ్ తో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు వస్తారు. సీజన్ మొత్తం లో ఒకసారి ఈ డబల్ ఎలిమినేషన్ అనేది సర్ ప్రైజ్ చేస్తుంది.
By: Ramesh Boddu | 9 Oct 2025 10:09 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ప్రతి సీజన్ లో లాగానే సీజన్ మొదలైన ఐదు వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని హౌస్ లోకి పంపిస్తారు. సీజన్ 9 కూడా ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకోగా ప్రస్తుతం ఐదో వారం నడుస్తుంది. ఈ వీకెండ్ లో సీజన్ 9 సెకండ్ వెర్షన్ అంటే 2.ఓ ని మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు బిగ్ బాస్ టీం. బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ వారం చాలా ట్విస్ట్ లు ఉంటాయని టాక్. అందులో భాగంగా లీడర్ బోర్డ్ టాస్క్ ఒకటి నడుస్తుంది. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్న ఈ టైం లో హౌస్ లో ఉన్న వాళ్లలో ఎవరు వాళ్లను రీప్లేస్ చేసే అవకాశం ఉంటుందో ఇది నిర్ణయిస్తుంది.
ఇద్దరు హౌస్ నుంచి బయటకు వస్తారని..
అంతేకాదు ఈ వారం నామినేషన్స్ లో దాదాపు 10 మంది ఉన్నారు. కెప్టెన్ రాము, ఇమ్యూనిటీ సాధించిన ఇమాన్యుయెల్ తప్ప అందరు కూడా నామినేషన్స్ లో ఉన్నారు. ఐతే వీరిలో ఈ వారం ఒకరు కాదు ఇద్దరు హౌస్ నుంచి బయటకు వస్తారని టాక్. ప్రతి వారం హౌస్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయడం కామన్.. కానీ ఈ వారం డబల్ ఎలిమినేషన్ కి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం జరుగుతున్న లీడర్ బోర్డ్ టాస్క్ కూడా అందులో భాగమే అని తెలుస్తుంది.
ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న వారిలో డేంజర్ జోన్ లో అంటే లీస్ట్ ఓటింగ్ తో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు వస్తారు. సీజన్ మొత్తం లో ఒకసారి ఈ డబల్ ఎలిమినేషన్ అనేది సర్ ప్రైజ్ చేస్తుంది. ఆడియన్స్ అంతా కూడా ఈసారి ఎలిమినేషన్ ప్రక్రియకు షాక్ అయ్యేలా ప్లాన్ చేశారట బిగ్ బాస్ టీం. సీజన్ 9 లో అంత స్టఫ్ ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు కనిపించట్లేదు.
సీజన్ 9లో రిలేషన్స్ షిప్స్ అది ఒరిజినలా ఫేకా అన్నది..
కేవలం రిలేషన్స్ షిప్స్ అది ఒరిజినలా ఫేకా అన్నది తెలియదు కానీ అందరు అదే పనిలో ఉన్నారు. ఆల్రెడీ ఈ సీజన్ లో బిగ్ బాస్ రెండోసారి టాస్క్ విషయంలో కంటెస్టెంట్స్ కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏ సీజన్ లో కూడా ఇలా బిగ్ బాస్ తో వార్నింగ్ ఇప్పించిన సందర్భాలు చాలా తక్కువ. కానీ ఈ సీజన్ లో అది రిపీట్ అవుతూనే ఉంది. అందుకే ఆడియన్స్ కూడా వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఆట మారుతుందని భావిస్తున్నారు.
