బిగ్ బాస్ 9.. డబల్ కాదు సోలోనే.. ఈ ఎలిమినేట్ ఊహించిందేనా..?
బిగ్ బాస్ సీజన్ 9లో 12వ వారం ఎలిమినేషన్ లీక్ బయటకు వచ్చింది. శనివారం లీక్స్ ప్రకారం ఈ వారం కూడా డబల్ ఎలిమినేషన్ ఉంటుంది అన్నట్టుగా వార్తలు వచ్చాయి.
By: Ramesh Boddu | 30 Nov 2025 1:23 PM ISTబిగ్ బాస్ సీజన్ 9లో 12వ వారం ఎలిమినేషన్ లీక్ బయటకు వచ్చింది. శనివారం లీక్స్ ప్రకారం ఈ వారం కూడా డబల్ ఎలిమినేషన్ ఉంటుంది అన్నట్టుగా వార్తలు వచ్చాయి. లాస్ట్ వీక్ ఇమ్మాన్యుయెల్ దగ్గర ఉన్న పవర్ అస్త్ర వల్ల ఎలిమినేషన్ లేకుండా చేశాడు. అందుకే ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ ఈ వారం డబల్ ఎలిమినేషన్ కాదు సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే అని తెలిసింది. డబల్ ఎలిమినేషన్ అయితే శనివారం ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. కానీ అలా జరగలేదు అంటే ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ అన్నట్టే లెక్క.
రెండు వారాలుగా లీస్ట్ పొజిషన్ లో ఉన్నా లక్ ఫేవర్ చేస్తూ..
బిగ్ బాస్ సీజన్ 9లో 12వ వారం లాస్ట్ వీక్ కెప్టెన్ రీతు తప్ప అందరు నామినేషన్స్ లో ఉన్నారు. ఐతే వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఐతే గత రెండు వారాలుగా లీస్ట్ పొజిషన్ లో ఉన్నా లక్ ఫేవర్ చేస్తూ ఉండటంతో దివ్యా హౌస్ లో కొనసాగుతూ వచ్చింది. గౌరవ్ ఎలిమినేషన్ టైం లోనే ఆడియన్స్ ఓట్ గౌరవ్ ని ఎలిమినేట్ చేయాలని అనుకోగా తనూజ దగ్గర ఉన్న డైమండ్ పవర్ ఉపయోగించకపోవడం వల్ల ఆమె సేఫ్ అయ్యింది.
అలా రెండు వారాలు దివ్య హౌస్ లో ఉన్నది. ఐతే ఫైనల్ గా ఈ వారం ఆమెను హౌస్ నుంచి బయటకు పంపించారు ఆడియన్స్. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా కామనర్ కేటగిరిలో హౌస్ లోకి షో స్టార్ట్ అయిన 3వ వారం హౌస్ లోకి వచ్చింది దివ్య. ఐతే భరణితో క్లోజ్ అవ్వడంతో పాటు అతని ఆట కూడా సరిగా ఆడకుండా చేసింది ఆమె. తనూజతో ఎప్పుడూ ఏదో ఒక విధంగా రైవల్రీ కొనసాగించింది. తనూజ కెప్టెన్ కాకుండా పావులు కదిలించింది దివ్య.
దివ్య ఎలిమినేషన్ కన్ఫర్మ్..
సో దివ్య కూడా రెండు వారాలుగా తను వెళ్లడం గ్యారెంటీ అని ఫిక్స్ అయ్యింది. ఏదో అలా లక్ కలిసి వచ్చి కొనసాగుతూ వచ్చింది. ఫైనల్ గా ఈరోజు దివ్య ఎలిమినేషన్ కన్ఫర్మ్ అవుతుంది. ఆల్రెడీ ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేసిందట. ఈరోజు ఎపిసోడ్ లో అది చూపిస్తారు. ఇక దివ్య ఎగ్జిట్ తో ఈ సీజన్ లో కేవలం ఇద్దరు కామనర్స్ మాత్రమే ఉన్నారు.
వాళ్లిద్దరి కూడా టాప్ 5కి వెళ్లే అర్హత ఉందని అనిపిస్తుంది. టాప్ 5 కాదు ఒక కామనర్ ఈ సీజన్ విన్ అవుతాడన్న విధంగా బజ్ కనిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9లో ఇంకా మిగిలి ఉంది 3 వారాలు మాత్రమే ఇప్పుడు ఇక అందరు తమ ఆటని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలి. టాప్ 5 కాదు టైటిల్ విజేత కోసం టాప్ గేర్ వేయాల్సి ఉంది.
