బిగ్ బాస్ 9.. టాప్ 5 దాదాపు ఫిక్స్ అయినట్టేనా..?
టాప్ 1, 2, 3 ఆర్డర్ ఏదైనా టాప్ 3 స్థానాల్లో మాత్రం కళ్యాణ్, ఇమ్మాన్యుయెల్, తనూజ ఈ ముగ్గురు కన్ఫర్మ్ అన్నట్టే లెక్క.
By: Ramesh Boddu | 30 Nov 2025 10:50 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో మరో 3 వారాలు మాత్రమే ఉంది. ఐతే ఈ 3 వారాల్లో ఎవరెవరు తమ ఆటని మరింత పెంచుకోవాలి.. ఎవరు ఇంకాస్త పట్టు బిగించాలి అన్నది తెలియాల్సి ఉంది. ఐతే ఇప్పటికే ఆడియన్స్ ఎవరిని టాప్ 5లో ఉండాలి అన్నది డిసైడ్ అయ్యారు. ఈసారి హౌస్ లో టాప్ 5కి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండానే వెళ్లే ఛాన్స్ ఉందనిపిస్తుంది. సీజన్ 9లో ఇప్పటివరకు ఆడిన ఆట, హౌస్ మేట్స్ బిహేవియర్ ఇంకా మిగతా విషయాలు అన్నీ చూసి టాప్ 5 దాదాపు ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. వారికే ఓట్లు వేసి మరీ ఎంకరేజ్ చేస్తున్నారు.
టాప్ 1, 2, 3 ఆర్డర్ ఏదైనా టాప్ 3 స్థానాల్లో మాత్రం..
టాప్ 1, 2, 3 ఆర్డర్ ఏదైనా టాప్ 3 స్థానాల్లో మాత్రం కళ్యాణ్, ఇమ్మాన్యుయెల్, తనూజ ఈ ముగ్గురు కన్ఫర్మ్ అన్నట్టే లెక్క. ఈ ముగ్గురిలోనే దాదాపు టైటిల్ విన్నర్ ఉన్నాడు. హౌస్ మేట్స్ అంతా ఇమ్మాన్యుయెల్, కళ్యాణ్ టఫ్ ఫైటర్ అనుకుంటున్నారు. కానీ ఆడియన్స్ లో మారం తనూజ, కళ్యాణ్ మధ్య టైటిల్ ఫైట్ ఉండేలా కనిపిస్తుంది. ఇక టాప్ 3 తర్వాత మిగతా రెండు స్థానాల్లో డీమాన్ పవన్ కచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది. ఐతే చివరి స్థానంలో అది ఎవరన్నది చెప్పడం కష్టమవుతుంది.
దివ్య ఈరోజు ఎలిమినేట్ అవుతుంది. సుమన్, భరణి, సంజనాలో నెక్స్ట్ రెండు వారాల్లో ఈ ముగ్గురిలో సంజనా, సుమన్ దాదాపు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి. సో భరణి, రీతు మధ్యలోనే టాప్ 5 ఒకరికి ఛాన్స్ అనే టాక్ ఉంది. ఐతే భరణి ఆల్రెడీ ఒకసారి ఎలిమినేట్ అయ్యి బయట ఆట చూసి వచ్చాడు కాబట్టి ఆ అవకాశం ఆడియన్స్ ఇస్తారో లేదో చూడాలి. అలా ఆలోచిస్తే రీతూకి టాప్ 5 ఛాన్స్ ఉంటుంది.
భరణికి కూడా ఫైనల్ వీక్ దాకా ఉండే అవకాశం..
ఒకవేళ సీజన్ 6లో లాగా టాప్ 6 ఏదైనా పెడితే మాత్రం భరణికి కూడా ఫైనల్ వీక్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఆడియన్స్ తమ టాప్ 5 విషయంలో చాలా క్లారిటీతో ఉన్నారు. ఐతే ఈ టాప్ 5 ఆర్డర్ అటు ఇటు అవ్వొచ్చేమో కానీ కచ్చితంగా వీళ్లే ఉండొచ్చని గట్టిగా చెబుతున్నారు ఆడియన్స్.
బిగ్ బాస్ సీజన్ 9లో ఎవరి ఆట వారికి అనే టాక్ వినిపిస్తుంది. ఐతే హౌస్ లో వారు ఆడే ఆటని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అన్నదే పాయింట్. సో టాప్ 5లో ఆడియన్స్ లిస్ట్ దాదాపు కన్ ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉన్నా చివరి నిమిషంలో ఏదైనా మార్పులు ఉంటాయేమో చూడాలి.
