బిగ్ బాస్ 9.. లీడర్ బోర్డ్ లో టాప్ ప్లేస్ ఎవరిదంటే.. వరస్ట్ గా ఆ ముగ్గురు..!
సుమన్ శెట్టి, శ్రీజ.. కళ్యాణ్, తనూజ టీంలు లీస్ట్ పాయింట్స్ తో ఉన్నారు. అందులో కళ్యాణ్, శ్రీజన్, సుమన్ శెట్టి వరస్ట్ ప్లేయర్స్ గా మిగతా టీం మెంబర్స్ అనౌన్స్ చేశారు.
By: Ramesh Boddu | 9 Oct 2025 10:09 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో ప్రస్తుతం వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ కోసం లీడర్ బోర్డ్ టాస్క్ నడుస్తుంది. ఈ టాస్క్ లో ప్రతి రౌండ్ కి ఒక టాస్క్ పెడుతున్న బిగ్ బాస్ అందులో ఫస్ట్ వచ్చిన వారికి 100 సెకండ్ వచ్చిన వారికి 80, థర్డ్ 60, ఫోర్త్ 40 లాస్ట్ 20 పాయింట్స్ ఇస్తున్నాడు. ఆల్రెడీ బుధవారం మొదలైన ఈ టాస్క్ లో రీతు, డీమాన్ పవన్ ముందు ఉన్నారు. బుధవారం జరిగిన బెలూన్ టాస్క్ లో హౌస్ మెట్స్ ఎవరు ఇచ్చిన టాస్క్ ని సరిగా అర్దం చేసుకోకపోవడంతో బిగ్ బాస్ వారి మీద ఫైర్ అయ్యి. ఇప్పటివరకు లీడర్ బోర్డ్ లో అందరికీ ఉన్న పాయింట్స్ లో 50 శాతం కోత పెట్టాడు.
కెప్టెన్ అయిన రాము.. ఇమ్యూనిటీ వచ్చిన ఇమ్మాన్యుయెల్..
ఇక గురువారం ఎపిసోడ్ లో కూడా ఆర్ట్ టాస్క్, ఇంకా బ్యాలెన్సింగ్ టాక్స్ ఒకటి పెట్టారు. అందులో భరణి, దివ్య ఆర్ట్ టాస్క్ గెలిచారు. బ్యాలెన్సింగ్ టాస్క్ లో రీతు, డీమాన్ పవన్ గెలిచారు. ఈ లీడర్ బోర్డ్ టాస్క్ లో భరణి, దివ్య.. కళ్యాణ్, తనూజ.. సుమన్ శెట్టి, శ్రీజ.. డీమాన్ పవన్, రీతు చౌదరి.. సంజన, ఫ్లోరా షైనీ ఒక జంటగా ఉన్నారు. కెప్టెన్ అయిన రాము.. ఇమ్యూనిటీ వచ్చిన ఇమ్మాన్యుయెల్ ఈ టాస్క్ లకు సంచాలకులుగా వ్యవహరించారు.
ఇక బిగ్ బాస్ లీడర్ బోర్డ్ టాస్క్ లో ఇప్పటివరకు జరిగిన టాస్కుల్లో రెండు జంట్లు లీస్ట్ పొజిషన్ లో ఉన్నాయి. సుమన్ శెట్టి, శ్రీజ.. కళ్యాణ్, తనూజ టీంలు లీస్ట్ పాయింట్స్ తో ఉన్నారు. అందులో కళ్యాణ్, శ్రీజన్, సుమన్ శెట్టి వరస్ట్ ప్లేయర్స్ గా మిగతా టీం మెంబర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఈ లీడర్ బోర్డ్ టాస్కుల్లో సంజన, ఫ్లోరా షైనీలు మంచి ప్రదర్శన కనబరిచారు. వారు లీడర్ బోర్డ్ లో రెండో ప్లేస్ లో ఉన్నారు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీలో భాగంగా..
లీడర్ బోర్డ్ లో పాయింట్స్ ప్రకారం భరణి, దివ్య ఫస్త్ ప్లేస్ లో ఉండగా.. సెకండ్ ప్లేస్ లో సంజన, ఫ్లోరా.. థర్డ్ ప్లేస్ లో రీతు, డీమాన్ పవన్.. ఫోర్త్ ప్లేస్ లో కళ్యాణ్, తనూజ.. లాస్ట్ ప్లేస్ లో శ్రీజ, సుమన్ శెట్టి ఉన్నారు. ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలో భాగంగా ఈ లీడర్ బోర్డ్ లో లీస్ట్ ప్లేస్ లో ఉన్న వారు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.
