బిగ్ బాస్ 9.. ఫైర్ స్టోర్మ్ అగ్గి రాజేశారు..!
బిగ్ బాస్ సీజన్ 9లో ఆదివారం ఎపిసోడ్ లో ఫైర్ స్టోర్మ్ ఎపిసోడ్ ఇంప్రెస్ చేసింది. బిగ్ బాస్ ఆడియన్స్ కి ఈ వీకెండ్ ఎపిసోడ్ మంచి ఎంటర్టైన్మెంట్ అందించింది.
By: Ramesh Boddu | 13 Oct 2025 9:43 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో ఆదివారం ఎపిసోడ్ లో ఫైర్ స్టోర్మ్ ఎపిసోడ్ ఇంప్రెస్ చేసింది. బిగ్ బాస్ ఆడియన్స్ కి ఈ వీకెండ్ ఎపిసోడ్ మంచి ఎంటర్టైన్మెంట్ అందించింది. ముఖ్యంగా డబల్ ఎలిమినేషన్ ఉంటుందని ఏదైతే చెప్పారో అది ఎవరెవరా అన్న ఎగ్జైట్ మెంట్ కలిగించింది. ఫ్లోరా షైనీ ఎలిమినేషన్ ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే జరగ్గా.. శ్రీజ ఎలిమినేషన్ మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వల్ల జరిగింది. శ్రీజ ఎలిమినేషన్ పై కొంత అసంతృప్తి ఉన్నా కూడా సీజన్ 9 లో ఊహించని ఇలాంటి ట్విస్టులు జరుగుతాయని ముందే హింట్ ఇస్తూ వచ్చారు నాగార్జున.
ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్..
బిగ్ బాస్ సీజన్ 9 ఫైర్ స్టోర్మ్ లో భాగంగా ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరిగాయి. అందులో అలేఖ్య పికిల్స్ రమ్య, దువ్వాడ మాధురి, శ్రీనివాస్ సాయి, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, అయేషా వచ్చారు. సీజన్ 9లో ఇప్పటివరకు ఉన్న ఆట తీరుని ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చాక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారన్న నమ్మకం కలిగింది. ఎందుకంటే వచ్చీ రాగానే హౌస్ లో నుంచి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేశారు వైల్డ్ కార్డ్స్.
అదంతా వాళ్ల స్ట్రాటజీలో భాగం కావొచ్చు. శ్రీజ ఎలిమినేషన్ పై ఆడియన్స్ లో నెగిటివిటీ ఉంది. మళ్లీ ఆమెను హౌస్ లోకి తీసుకొస్తారా అన్న డిస్కషన్స్ నడుస్తున్నాయి. శ్రీజ ప్రతి విషయాన్ని పెద్ద గొడవ చేస్తుంది. ఆమె వాయిస్ ఇరిటేటింగ్ అని అంటారు కానీ ఆమె పెట్టే పాయింట్స్ మాత్రం చాలా బాగుంటాయని అంటున్నారు.
ఇన్నాళ్లు సేఫ్ గా ఆట ఆడుతూ వచ్చిన కంటెస్టెంట్స్..
వైల్డ్ కార్డ్స్ వచ్చీ రాగానే దువ్వాడ మాధురి తనకు తెలియదు అంటూ పేరు విషయంలో మాధురి, శ్రీజ కాస్త వాదన చేసుకున్నారు. ఒకవేళ అదే ఆమె ఎలిమినేషన్ కు దారి తీసి ఉండొచ్చు. బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత పాత కంటెస్టెంట్స్ కి భయం మొదలైంది. ఇన్నాళ్లు సేఫ్ గా ఆట ఆడుతూ వచ్చిన కంటెస్టెంట్స్ అంతా కూడా ఇక మీదట ఆ ఆటలు చెల్లవని ఫిక్స్ అయ్యారు. ఇక వచ్చిన కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్న వాళ్ల ఆట తీరు గురించి వాళ్లతో మాట్లాడుతూ కలిసిపోతున్నారు.
సో బిగ్ బాస్ సీజన్ 9 లో సెకండ్ వెర్షన్ మొదలైంది. ఆరుగురు వైల్డ్ కార్డ్స్ తో ఈ సీజన్ పాత, కొత్త కంటెస్టెంట్స్ తో ఈ వారం నుంచి మరింత ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. లాస్ట్ వీక్ ఐదో వారం ఫ్లోరా, శ్రీజ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. మరి ఈ వారం ఎవరు నామినేషన్స్ లో ఉంటారు. ఆ ప్రక్రియ ఎలా జరుగుతుంది అన్నది ఈరోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది.
