Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. టాప్, లీస్ట్ కంటెస్టెంట్స్ ఎవరు..?

3 వారాల బిగ్ బాస్ జర్నీలో ఎవరు స్ట్రాంగ్, ఎవరు వీక్ ఎవరు ఇంకా తమ ఒరిజినాలిటీ చూపించట్లేదు అన్నది అర్ధమవుతుంది.

By:  Ramesh Boddu   |   29 Sept 2025 10:40 AM IST
బిగ్ బాస్ 9.. టాప్, లీస్ట్ కంటెస్టెంట్స్ ఎవరు..?
X

బిగ్ బాస్ సీజన్ 9లో సక్సెస్ ఫుల్ గా 3 వారాలు పూర్తయింది. ఈ త్రీ వీక్స్ లోనే కంటెస్టెంట్స్ మీద ఆడియన్స్ ఒక ఒపీనియన్ కి వచ్చారు. 3 వారాలు 21 రోజులు ఆట ఆడుతూ ఆడియన్స్ కి దగ్గరైన వాళ్లు కొందరైతే.. ఆట పక్కన పెట్టి మిగతా విషయాల్లో బిజీ అయిన వారు మరికొందరు. ఇంకొంతమంది అటు ఆటలోనూ ఇటు కంటెస్టెంట్స్ ర్యాపోలోనూ డిజప్పాయింట్ చేస్తున్నారు. 3 వారాల బిగ్ బాస్ జర్నీలో ఎవరు స్ట్రాంగ్, ఎవరు వీక్ ఎవరు ఇంకా తమ ఒరిజినాలిటీ చూపించట్లేదు అన్నది అర్ధమవుతుంది.

అతను జెన్యూన్ అనిపిస్తున్నాడు..

బిగ్ బాస్ సీజన్ 9లో ఇప్పటివరకు జరిగిన 3 వారాల ఆట ప్రకారం చూస్తే ఇమ్మాన్యుయెల్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. తన కమెడియన్ ఇమేజ్ ని కొనసాగిస్తూ కూడా కొన్ని చోట్ల సీరియస్ ఎమోషన్ చూపిస్తూ ఆడియన్స్ కి అతను జెన్యూన్ అనిపిస్తున్నాడు. ఇక మరోపక్క కొందరు తమ స్ట్రైట్ ఫార్వర్డ్ నెస్ తో కాస్త ఇబ్బంది కలిగిస్తున్నా అదే ఎలాంటి ముసుగు లేకుండా చేస్తున్నారన్నట్టు ఉంది. ఇక సంజన ఆటలో ప్రతిది ఫన్ అంటూ అవతల వాళ్లని ఇరిటేట్ చేస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఇమ్మాన్యుయెల్ తర్వాత భరణి కాస్త టఫ్ ఫైటర్ గా కనిపిస్తున్నాడు. ఇక లీస్ట్ గురించి చెప్పుకుంటే ఫ్లోరా షైనీ వస్తుంది. ఆమె చాలా ఇన్ యాక్టివ్ గా ఉంటున్నారు. టాస్క్ లు ఏమో కానీ హౌస్ లో ఆమె ఒకరు ఉన్నారు అనేలా ఏమి చేయట్లేదు. ఇక కళ్యాణ్ ఆల్మోస్ట్ నిన్న ఎలిమినేషన్ దాకా వెళ్లొచ్చాడు. అతను ఆట మార్చుకోకపోతే అతను బై బై చెప్పేస్తాడు.

హరీష్ కూడా ప్రతీది ఇష్యూ..

శ్రీజ మాట్లాడితే గొడవపడినట్టు కాకుండా కాస్త వాయిస్ తగ్గించుకుని కూల్ గా ఆడితే బెటర్.. హరీష్ కూడా ప్రతీది ఇష్యూ చేయకుండా ఉంటే బెటర్. తనూజ అవతల వాళ్ల మీద అరవడం కాస్త తగ్గించాలి. పవన్, రీతు ట్రాక్ ఆడియన్స్ కంటెంట్ కోసమే అని కనిపెట్టారు. వాళ్లు నిజంగా ఎమోషనల్ ఫీలైనా అది అలానే వెళ్తుంది. ఇక సుమన్ శెట్టి ఏదో ఉన్నాడంటే ఉన్నాడు అన్నట్టు ఉంది.

దివ్య రీసెంట్ గానే వచ్చింది కానీ ఆమె టఫ్ ఫైట్ ఇచ్చేలా ఉంది. ఫైనల్ గా టాప్ లో ఇమ్మాన్యుయెల్, భరణి ఉండగా లీస్ట్ లో ఫ్లోరా, కళ్యాణ్, సుమన్ శెట్టి ఉన్నారు. వీరిలో రానున్న రోజుల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి.