బిగ్ బాస్ హౌస్ లో తనూజ మీదే అందరి ఫోకస్.. ఆమె మాత్రం..?
ఐతే తనూజకి ఆల్రెడీ ఒక స్టాండర్డ్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఆమెనే మెజారిటీ హౌస్ మెట్స్ కార్నర్ చేయడం పై బయట ఇంకా ఎక్కువ సింపతీ వస్తుంది.
By: Ramesh Boddu | 1 Nov 2025 1:00 PM ISTబిగ్ బాస్ సీజన్ 9లో తనూజ మీదే అందరి ఫోకస్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే తనూజ టాప్ 5కి పక్కా అనే సంకేతాలు ఉన్నాయి. వాటికి తోడు ఆమె హౌస్ లో ప్రతి విషయాన్ని పెద్దది చేస్తుందనే టాక్ కూడా ఉంది. అదేంటి హౌస్ లో కంటెస్టెంట్స్ ని ఇబ్బంది పెడితే వాళ్లను బయటకు పంపిస్తారు కదా అంటే తనూజ విషయంలో అది వేరేలా ఉంది. ఆల్రెడీ సీరియల్ యాక్టర్ గా తనూజకి మంచి ఫాలోయింగ్ ఉంది. అదే కాకుండా హౌస్ లో ముందు వారాల్లో ఆమె మంచిగా ఆడింది.
ఏదో ఒక విధంగా తనూజని పోక్ చేస్తూ..
ఐతే ఈమధ్య రేషన్ మేనేజర్ గా తనూజ తరచు గొడవలకు కేంద్ర బిందువు అవుతుంది. హౌస్ లో ఆమె అంటే పడని వాళ్లు.. అంటే ఆమెను ఏదో ఒక విధంగా బ్యాడ్ చేయాలని అనుకునే వారు ఉన్నారు. వారు వచ్చి ఏదో ఒక విధంగా తనూజని పోక్ చేస్తూనే ఉన్నారు. అది తెలియకుండా తనూజ కూడా ఇష్టం వచ్చినట్టు అరిచేస్తుంది. తనూజ రేషన్ మేనేజర్ గా ఉండటం వల్ల కిచెన్ దగ్గర ప్రతి రోజు కాదు కాదు ప్రతి పూట గొడవ అన్నట్టు ఉంది.
లాస్ట్ వీక్ దివ్య రేషన్ మేనేజర్ గా ఉంటే.. మాధురి విషయంలో గొడవ అయ్యిందని ఆమె ప్లేస్ లో తనూజని రేషన్ మేనేజర్ గా ఉంచారు. ఐతే ఇప్పుడు తనూజ కూడా రేషన్ మేనేజర్ గా చాలా కండీషన్స్ పెడుతుంది. రీసెంట్ గా సంజన అన్నం తింటుంటే ఆమె తనకు తెలియకుండా వడ్డించుకుంది అని గొడవ చేసింది. ఈ విషయాలన్నీ తనూజకి కచ్చితంగా మైనస్ అవుతున్నాయి.
ఊపుతో ఆమె సీజన్ విన్నర్ అయినా..
ఐతే తనూజకి ఆల్రెడీ ఒక స్టాండర్డ్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఆమెనే మెజారిటీ హౌస్ మెట్స్ కార్నర్ చేయడం పై బయట ఇంకా ఎక్కువ సింపతీ వస్తుంది. ఇదే ఊపుతో ఆమె సీజన్ విన్నర్ అయినా అవ్వొచ్చనేలా ఉంది. ఐతే తనూజ అరవడం, గొడవ చేయడంలో తప్పు లేదు కానీ తనకు బయట ఉన్న ఫాలోయింగ్ కి నిజానికి.. నిజాయితీకి సపోర్ట్ చేస్తే ఆమెకు అది ప్లస్ అవుతుంది. అంతేకాకుండా అందరిలానే సెల్ఫిష్ గా ఆలోచిస్తే మాత్రం ఆమె టైటిల్ రేసు నుంచి దూరంగా వెళ్లే ఛాన్స్ ఉంటుంది.
తనూజ టాస్క్ లల్లో తన పర్ఫార్మెన్స్ ఇంకా చూపించాలి. ఎవరో సపోర్ట్ గా కాదు తాను సొంతంగా ఆడగలను అని ప్రూవ్ చేసుకోవాలి. రాబోయే వారాల్లో ఏ ఒక్క టాస్క్ అయినా తనూజ సొంతంగా ప్రూవ్ చేసుకుని గెలిచి చూపిస్తే మాత్రం బయట ఉన్న ఫాలోయింగ్ కి ఆమె గ్రాఫ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో తనూజ గేమ్ ప్లాన్ ఏంటన్నది కమింగ్ వీక్స్ లో చూడాలి.
