బిగ్ బాస్ 9.. తనూజ జర్నీలో ఆ ఇద్దరే హైలెట్..!
తనూజ జర్నీలో ఆమె తర్వాత కళ్యాణ్, భరణి ఇద్దరు హైలెట్ అయ్యారు. తనూజ ప్రతి టాస్క్ లో తను చూపించిన ఎఫర్ట్ ఏంటన్నది చూపించారు.
By: Ramesh Boddu | 19 Dec 2025 12:02 PM ISTబిగ్ బాస్ సీజన్ 9 లో టాప్ 5 కంటెస్టెంట్ ల జర్నీ చూపిస్తూ వారి గురించి బిగ్ బాస్ మాట్లాడటం హౌస్ లో ఉన్న ఆడియన్స్ కి మాత్రమే కాదు బిగ్ బాస్ ఆడియన్స్ కి కూడా తెగ నచ్చేస్తుంది. తమకి నచ్చిన కంటెస్టెంట్ జర్నీ ఎలా ఉంటుంది వారి గురించి బిగ్ బాస్ ఎలా మాట్లాడతాడంటూ ఆసక్తిగా చూస్తారు. ఆల్రెడీ నిన్న ఎపిసోడ్ లో ఇమ్మాన్యుయెల్ జర్నీ చూపించగా గురువారం ఎపిసోడ్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన తనూజ, డీమాన్ పవన్ జర్నీలను చూపించారు.
కళ్యాణ్ తో కలిసి ఆడిన టాస్క్..
తనూజ జర్నీ గురించి చెబుతూ సీరియల్స్ లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మీరు అంటూ మొదలు పెట్టి హౌస్ లో ప్రతి విషయం మీ చుట్టూ తిరిగేలా కిచెన్ నుంచే మీరు ఆట ఆడారని పొగిడాడు బిగ్ బాస్. ఇక ఆమె స్నేహం గురించి కళ్యాణ్ తో కలిసి ఆడిన టాస్క్ లు, మాట్లాడిన మాటలు చూపించారు. మరోపక్క నాన్న అనే రిలేషన్ తో భరణితో చేసిన టాస్క్ లు అతనితో మాట్లాడినవి చూపించారు.
తనూజ జర్నీలో ఆమె తర్వాత కళ్యాణ్, భరణి ఇద్దరు హైలెట్ అయ్యారు. తనూజ ప్రతి టాస్క్ లో తను చూపించిన ఎఫర్ట్ ఏంటన్నది చూపించారు. అంతేకాదు తనని టార్గెట్ చేసిన వారికి ఆమె ఇచ్చిన ఆన్సర్ తో పాటు టాస్క్ లల్లో శివంగిలా ఆమె ఆడిన తీరుని చూపించారు. మొత్తానికి తనూజకి విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయని వాళ్లు వీళ్లు చెప్పడం కాదు జర్నీ చూశాక అందరు ఫిక్స్ అయ్యేలా చేశారు.
బిగ్ బాస్ సీజన్ 9లో లేడీ విన్నర్ గా..
బిగ్ బాస్ సీజన్ 9లో లేడీ విన్నర్ గా తనూజ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ లు అని చెప్పొచ్చు. పోటీగా కళ్యాణ్ పడాల రేసులో ముందున్నాడు. మరోపక్క ఇమ్మాన్యుయెల్ కూడా సెకండ్ ప్లేస్ కోసం దూకుడు గా ఉన్నాడు. సో టాప్ 3లో ఎవరి పొజిషన్ ఏంటన్నది ఆడియన్స్ చేస్తున్న ఓటింగ్ ని బట్టి ఉంటుంది. ఈరోజు రాత్రి వరకే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ని డిసైడ్ చేసే ఓటింగ్ కొనసాగుతుంది. విన్నర్ ఎవరన్నది ఆదివారం రాత్రి ఫైనల్ ఎపిసోడ్ లో రివీల్ అవుతుంది.
బిగ్ బాస్ సీజన్ 9లో తనూజ స్టార్ ప్లేయర్ గా బిగ్ బాస్ ఏవీలో చెప్పినట్టుగా ఆమె చుట్టూనే అన్ని విషయాలు జరిగాయి. కిచెన్ లో ఆమె వంట చేసినా స్టోర్ మేనేజర్ గా ఉన్నా కూడా ఏదో ఒక హంగామా జరుగుతుంది. గొడవలు, అభిమానం, ప్రేమ, ఫ్రెండ్ షిప్, టాస్క్ లల్లో వీర ప్రతాపం ఇలా అన్నిటిల్లో తనూజ బెస్ట్ ఇచ్చింది. ఐతే ఫైనల్ గా విజేత చేయాల్సింది ఆడియన్స్ మాత్రమే. వాళ్లకి ఆమె విన్నర్ మెటీరియలా కాదా అన్నది ఓటింగ్స్ ద్వారా తెలియచేయాల్సి ఉంది.
