Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. గోల్డెన్ డైమండ్ గెలిచుకుంది ఎవరంటే..?

అంతకుముందు సీరియల్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తనూజ ఈమధ్య స్టార్ మాలోనే కుకింగ్ జాతిరత్నాలు ప్రోగ్రాం లో ఫైనల్ గెలిచింది.

By:  Ramesh Boddu   |   26 Oct 2025 10:42 AM IST
బిగ్ బాస్ 9.. గోల్డెన్ డైమండ్ గెలిచుకుంది ఎవరంటే..?
X

బిగ్ బాస్ సీజన్ 9లో తనూజ స్ట్రాంగ్ ప్లేయర్ గా దూసుకెళ్తుంది. అంతకుముందు సీరియల్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తనూజ ఈమధ్య స్టార్ మాలోనే కుకింగ్ జాతిరత్నాలు ప్రోగ్రాం లో ఫైనల్ గెలిచింది. అదే జోష్ తో ఆమెను సీజన్ 9లోకి తీసుకొచ్చారు. మొదటి నుంచి తన ఆట తాను ఆడుతూ వచ్చిన తనూజ భరణితో నాన్న అనే బాండింగ్ ఏర్పరచుకుంది. ఐతే ఆమెకు ఈ బాండింగే ఆమెను అందరికీ టార్గెట్ అయ్యేలా చేసింది. తనూజ టాస్కుల్లో పర్వాలేదు.. ఐతే కోపం వచ్చినప్పుడు అరవడమే కాదు ప్రేమ చూపించడం కూడా అదే విధంగా చూపిస్తుంది. అక్కడే ఆడియన్స్ ఆమెకు ఫిదా అయ్యారు.

సీజన్ 9 లేడీ విన్నర్ గా..

బిగ్ బాస్ సీజన్ 9లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా తనూజ దూసుకెళ్తుంది. అందరు అంటున్నట్టుగా ఈ సీజన్ లేడీ విన్నర్ గా ఆమె మారే ఛాన్స్ లు కూడా ఉన్నాయన్న మాట వాస్తవం. ఇక నిన్న శనివారం ఎపిసోడ్ లో హౌస్ లో అందరు ఎవరికో ఒకరికి బోర్డ్ లతో వారి ఆట తీరుని చెప్పారు. తనూజతో పాటు పవన్, రీతు, సుమన్ కు ఎలాంటి ట్యాగ్ లు రాలేదు. గౌరవ్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు కానీ ఇమ్మాన్యుయెల్ అతన్ని తీసేశాడు.

ఈ నలుగురిలో ఒకరికి మాధురి మిస్ అయిన గోల్డ్ డైమండ్ వస్తుంది. ఆదివారం ఎపిసోడ్ లో ఈ టాస్క్ నిర్వహిస్తారని తెలుస్తుంది. ఐతే బిగ్ బాస్ లీక్స్ లో భాగంగానే ఈ గోల్డ్ డైమండ్ గెలుచుకుంది ఎవరన్నది తెలిసిపోయింది. పవన్, సుమన్, రీతు, తనూజకు పజిల్ టాస్క్ ఇస్తారు నాగార్జున. ఈ టాస్క్ లో తనూజ విన్ అయ్యి గోల్డ్ డైమండ్ గెలుచుకుంటుంది. ఐతే ఈ డైమండ్ పవర్ సేవింగ్ చేయొచ్చు. ఎవరైనా ఎలిమినేషన్ కి డేంజర్ జోన్ లో ఉంటే వారిని సేవ్ చేసే ఛాన్స్ ఉంది.

పవర్ ఫుల్ డైమండ్ తనూజకి రావడం..

ఇలాంటి పవర్ ఫుల్ డైమండ్ తనూజకి రావడం వల్ల అది ఆమెకైనా లేదా ఆమె ఎవరి కోసం అయినా వాడే ఛాన్స్ ఉంటుంది. మాధురికి ఎక్కువ బోర్డ్ లు రావడం వల్ల ఆమెకు తనూజ నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినేట్ చేసిందని తెలుస్తుంది. మొత్తానికి గోల్డ్ డైమండ్ దక్కడంతో తనూజ ఆట మరింత ఆసక్తిగా ఇంకా దూకుడుగా వెళ్లే ఛాన్స్ ఉంటుంది.

బిగ్ బాస్ సీజన్ 9లో ఇమ్మాన్యుయెల్ తర్వాత కాస్త కూస్తో లక్ ఉన్న కంటెస్టెంట్ ఎవరంటే అది తనూజ అని చెప్పొచ్చు. ఇమ్మాన్యుయెల్ కి ఆల్రెడీ పవర్ అస్త్ర ఉండగా ఇప్పుడు తనూజకి గోల్డ్ డైమండ్ అస్త్రం ఆమె నెక్స్ట్ వీక్స్ కి బాగా సపోర్ట్ చేస్తుంది.